పెద్దపల్లి, సెప్టెంబర్ 01:
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని ఏఐఎఫ్బీ పట్టణ కన్వీనర్ కుక్క శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. హామీలు అమలు చేయలేకపోతే ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని నిరసన వ్యక్తం చేశారు. మహిళలకు రూ.2,500, రూ.500కే గ్యాస్ సిలిండర్, పెన్షన్ల పెంపు, రైతు భరోసా, ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం తదితర హామీలను అమలు చేయాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయడంతోపాటు పెండింగ్ డీఏలను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుక్క అశోక్, నూనె వెంకటేశ్, మహరాజ్, షఫీ, కుక్క చరణ్, ఒడ్డపల్లి తిరుమల్ తోపాటు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.


