ఆత్మకూరులో శ్రీ హనుమాన్ శోభాయాత్ర ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. భారీ హనుమంతుని విగ్రహంతో పాటు వివిధ దేవతామూర్తుల వేషధారణలు, నృత్య ప్రదర్శనలు, మేళతాళాలు, డీజేల మధ్య “జై హనుమాన్” నినాదాలతో ఎంతో భక్తిపార్వశంగా ఈ హనుమాన్ శోభయాత్ర ఉత్సాహంగా సాగింది. ఆంజనేయ స్వామి విగ్రహానికి హారతి ఇచ్చి బయలుదేరిన ఈ శోభాయాత్ర లో నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన భక్తులు భారీగా పాల్గొని స్కూటర్ ర్యాలీతో బైపాస్ రోడ్ నుంచి పట్టణంలోని పలు వీధుల గుండా శోభాయాత్ర కొనసాగుతోంది. శోభాయాత్ర కు కావలిసిన అన్ని సదుపాయాలను నిర్వాహకులు సిద్ధం చేశారు.. డీఎస్పీ కే. వేణుగోపాల్ ఆధ్వర్యంలో సీఐ గంగాధర్ పర్యవేక్షణలో ముగ్గురు సీఐ లు ఎనిమిది మంది ఎస్ఐలు 60 మందికి పైగా పోలీసు సిబ్బందితో ఈ యాత్రకు బందోబస్తు నిర్వహిస్తున్నారు.



