పెనుబల్లి / ఖమ్మం
పెనుబల్లి మండల పరిధిలోని కండిమల్లవారి బంజర్ వద్ద గ్రీన్ఫీల్డ్ హైవేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి డీసీఎం వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కొని అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న వంగ ముత్యాల బంజర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడిని మహారాష్ట్రకు చెందిన నవనీత్ మారాటిగా పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.



