2026–27 విద్యా సంవత్సరానికి ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంటర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు గడువు పొడిగించినట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి కే. రవిబాబు తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు విద్యార్థులు ప్రవేశాలు పొందవచ్చని పేర్కొన్నారు. నిర్ణయించిన గడువు ముగిసిన అనంతరం అడ్మిషన్ల ప్రక్రియ నిలిపివేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం చదవాలనుకునే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సంబంధిత కళాశాలలను సంప్రదించి నిర్ణీత గడువులోగా ప్రవేశ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు. గడువు ముగిసిన తర్వాత ఎలాంటి అవకాశం ఉండదని DIEO వెల్లడించారు.



