శ్రీ కాళహస్తి, జూన్ 17, (పున్నమి న్యూస్) : నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ హయాంలోనే రాజకీయ గుర్తింపు, ఆర్థిక స్వావలంబన, సామాజిక గౌరవం లభించాయని టీడీపీ నాయి బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంట్ సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ స్థాపన కాలం నుంచే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సాంప్రదాయ వృత్తిదారుల అభ్యున్నతికి ప్రత్యేక ప్రాధాన్యత లభించిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు, నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా తమ వర్గాన్ని రాజకీయంగా బలోపేతం చేశారని గుర్తు చేశారు. సెలూన్ షాపుల ఆధునీకరణ, ఉచిత కిట్ల పంపిణీ, రుణ సదుపాయాల ద్వారా వేలాది కుటుంబాలు ఆర్థికంగా లబ్ధి పొందాయని వివరించారు. సామాజికంగా, రాజకీయంగా ఎదగడానికి యువత సోషల్ మీడియా వేదికగా పార్టీ సాధించిన అభివృద్ధిని గ్రామస్థాయి వరకు విస్తృతంగా తీసుకెళ్లాలని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. సామాజిక న్యాయానికి, సంక్షేమానికి కట్టుబడి ఉన్న తెలుగుదేశం పార్టీకి నాయి బ్రాహ్మణులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఆయన పేర్కొన్నారు.

టిడిపితోనే నాయి బ్రాహ్మణులకు సామాజిక గౌరవం-కోట చంద్రశేఖర్