శ్రీ కాళహస్తి, జులై 21, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి మండలం అమ్మపాలెం పంచాయతీలో ‘మన ఊరు – మన బీజేపీ’ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. బూత్ కమిటీ అధ్యక్షుడు నిడిగంటి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ గ్రామ పెద్దల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ….దేశం, ధర్మం కోసమే బీజేపీ ఆవిర్భవించిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమాజంలో చిట్టచివరి వ్యక్తికీ చేరడమే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పమన్నారు. 2047 నాటికి భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలపడమే మోదీ దృఢ నిశ్చయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, కిషాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కునాటి నాగరాజు, మండల అధ్యక్షుడు బాగిత్తి వెంకటేష్, టీడీపీ నేతలు కందాటి వీరారాఘవ రెడ్డి, పొలంరెడ్డి బత్తిరెడ్డి, చంద్రారెడ్డి, రామిరెడ్డి, నిరంజన్ రెడ్డి, బీజేపీ నాయకులు టి. చెంగలరాయ రెడ్డి, సుబ్రహ్మణ్యం రాజు తదితరులు పాల్గొన్నారు.

అమ్మపాలెంలో బీజేపీ జెండా ఆవిష్కరణ