ముధోల్, ఆగస్టు 30(పున్నమి ప్రతినిధి ): ముధోల్ మండలంలోని విట్టొలి గ్రామంలో డాక్టర్ అన్నాభావూ సాఠే 106వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ కాలేవర్ రుచిత దిగంబర్ సాఠే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తన సాహిత్యంతో సామాజిక చైతన్యానికి, శ్రామిక వర్గాల హక్కుల కోసం బాటలు వేసిన మహనీయుడు సాఠే అని కొనియాడారు.ఆయన చూపిన బాటలో పయనిస్తూ సామాజిక సమానత్వానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ శివరాజ్, మాజీ సర్పంచ్ సత్య గౌడ్, నగేష్ పటేల్, దిగంబర్ పటేల్ గ్రామ పెద్దలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.



