Sunday, 27 September 2026
  • Home  
  • అనంతసాగరం చెరువు తూముకు మరమ్మతులు.. రైతులకు ఊరట
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అనంతసాగరం చెరువు తూముకు మరమ్మతులు.. రైతులకు ఊరట

అనంతసాగరం: మండలంలోని అనంతసాగరం చెరువు తూముకు మంగళవారం మరమ్మతులు చేపట్టారు. తూము గేటు పైకి, కిందికి సక్రమంగా పనిచేయకపోవడంతో ఇరిగేషన్ అధికారుల ఆదేశాల మేరకు మండల చెరువు సాగునీటి సంఘం అధ్యక్షుడు రాపూర్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పనులు నిర్వహించారు. తూము వద్ద ఇసుక బస్తాలు ఏర్పాటు చేసి తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం చెరువు కింద సుమారు 500 ఎకరాల్లో వరి సాగులో ఉంది. తూము సమస్య కారణంగా సాగునీటికి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు సుబ్బారెడ్డి తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులను త్వరగా పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. మరమ్మతులతో సాగునీటి సరఫరా సక్రమంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.