Sunday, 27 September 2026
  • Home  
  • వాకింగ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన వ్యక్తి.. గుండెపోటుతో మృతి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వాకింగ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన వ్యక్తి.. గుండెపోటుతో మృతి

కావలి పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉదయగిరి రోడ్డులోని మినీ స్టేడియం మైదానంలో శనివారం ఉదయం వాకింగ్ చేస్తుండగా ఓ వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందారు. దంతంవారి వీధికి చెందిన కె. హరి (వయస్సు తెలియదు) ప్రతిరోజులాగే ఉదయం మినీ స్టేడియం మైదానంలో వాకింగ్‌కు వెళ్లారు. వాకింగ్ చేస్తుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురై కిందపడిపోయారు. గమనించిన సహచర వాకర్స్ వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే హరి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటు కారణంగానే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో హరి కుటుంబ సభ్యులు, సహచర వాకర్స్ విషాదంలో మునిగిపోయారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.