కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి వాసులు నిక్కంటి వెంకటకృష్ణ, నిక్కంటి వెంకటరాయుడు, నిక్కంటి వీర రాఘవులు నూతనంగా ఏర్పాటు చేసిన WUDVEXA Plywood, Laminates, Hardware & Interiors షాప్‌ను ముఖ్య అతిథిగా పాల్గొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ, బాచుపల్లి ప్రాంత ప్రజలకు నాణ్యమైన Plywood, Laminates, Hardware & Interior Products అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి సాధించి, మంచి పేరు సంపాదించాలని షాప్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొలన్ కృష్ణారెడ్డి, మాజీ కార్పొరేటర్ కొలన్ వీరేందర్ రెడ్డి, బాచుపల్లి డివిజన్ అధ్యక్షులు కొలన్ జీవన్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నవీన్, విక్రాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


