ప్రపంచ రేబీస్ దినోత్సవం సందర్భంగా నంద్యాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శారద బాయి, జిల్లా సర్వేలెన్స్ అధికారి డాక్టర్ ఎస్. అశ్రుఫ్ ఆలీ రేబీస్ దినోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రేబీస్ నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కుక్కలు, ఇతర జంతువులు కరిచిన వెంటనే గాయాన్ని సబ్బు, నీటితో శుభ్రంగా కడిగి, ఆలస్యం చేయకుండా ప్రభుత్వ వైద్యసంస్థను సంప్రదించి యాంటీ రేబీస్ టీకా తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ప్రసన్న లక్ష్మీ, డీపీఎంవో డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ శ్రీజ, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

రేబీస్పై అప్రమత్తతే రక్షణ