కాలంలో వెనక్కి వెళ్లే అవకాశం (Time Machine) ఉంటే, నా పదవులన్నింటినీ వదులుకుని మళ్లీ మధురమైన పాత విద్యార్థి జీవితంలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నా అని కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు
, కావలి లోని ఆర్.ఎస్.ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ లో మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తో కలిసి 2026 ఇంటర్మీడియట్ సి.బి.యస్.ఇ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో, పదవ తరగతి ఫలితాల్లో జిల్లా స్థాయిలో , ఉత్తమ ఫలితాలు కనబరిచిన విద్యార్థులను సన్మానించి , మెమొంటో లు అందజేసి, విద్యార్థులను ఉద్దేశించి మాజీ మంత్రి ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు “డా” కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రసంగించారు.
– విద్యార్థులు సమాజంలో విద్య ద్వారానే రాణించి, ఉన్నత గుర్తింపు తెచ్చుకోవాలని భవిష్యత్తు సమాజాన్ని నిర్మించాలని కోరారు.విద్యార్థులు తమ జీవితంలో ఎల్లవేళలా సమాజం మెచ్చేలా, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గర్వపడేలా వ్యవహరించాలని
ఇంటర్మీడియట్, పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆశీస్సులు అందచేస్తూ, విద్యార్థుల విజయాల వెనుక కృషి చేసిన ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను, స్కూల్ యాజమాన్యాన్ని, ప్రత్యేకంగా అభినందించారు.
చదువుతో పాటు విద్యార్థులు ఇతర కార్యకలాపాలపై కూడా దృష్టి పెట్టాలని కోరారు.
విద్యార్థులు జీవితంలో పైకి ఎదుగుతున్న కొద్దీ మరిన్ని సవాళ్లు, ఇబ్బందులు ఎదురవుతుంటాయి, వాటిని అధిగమించడానికి ఎల్లప్పుడూ ధైర్యం, ఆత్మస్థైర్యం కలిగి ఉండాలని కోరారు.
విద్యార్థులు తమ జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి పాఠశాల చైర్మన్ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ని ఆదర్శంగా (రోల్ మోడల్) తీసుకోవాలని
చైర్మన్ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చినప్పటికీ.. తన కఠోర శ్రమ, చిత్తశుద్ధి, మరియు అంకితభావంతో సమాజంలో ఒక అద్భుతమైన వ్యక్తిగా, విజయవంతమైన నాయకుడిగా ఎదిగారని కొనియాడారు
–

