బొమ్మనహాల్ మండలం నేమకల్లు కొండపై క్వారీలో ఇరుక్కుపోయిన ఎలుగుబంటిని రక్షించినట్లు ఫారెస్టు డిప్యూటీ రేంజర్ ఆఫీసర్ దామోదర రెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం 100 అడుగుల లోతు క్వారీలోని బండరాళ్ల మధ్య ఎలుగుబంటి చిక్కుకుంది. అటవీ సిబ్బంది రెస్క్యూ చేసి రాత్రి సమయంలో కొండపైకి సురక్షితంగా చేర్చగలిగారు. దీంతో ఎలుగుబంటి ప్రాణాపాయం నుంచి బయటపడి అడవిలోకి వెళ్లడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.



