Friday, 2 October 2026

Tag: సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల

పోతుగల్‌లో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు

రాజన్న సిరిసిల్ల ఆగస్టు 20 ( పున్నమి ప్రతినిధి) రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమంలో భాగంగా 1,874 మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని నాయకులు తెలిపారు. రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందనున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

టీకాల కార్యక్రమంపై డీఎంహెచ్‌ఓ పర్యవేక్షణ

రాజన్న సిరిసిల్ల ఆగస్టు 19 (పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట పీహెచ్‌సీ పరిధిలోని ధర్మారం సబ్‌ సెంటర్‌లో నిర్వహించిన యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ (UIP) సెషన్‌ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఏంజెలా ఆల్ఫ్రెడ్ బుధవారం పర్యవేక్షించారు. చిన్నారులకు అందిస్తున్న టీకాలు, టీకాల నిల్వ, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. అర్హులైన ప్రతి చిన్నారికి నిర్ణీత షెడ్యూల్ ప్రకారం టీకాలు అందించాలని సూచించారు. తల్లిదండ్రులకు టీకాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో ఇమ్యునైజేషన్ అధికారి డా. సంపత్ కుమార్, VCCM నవీన, ANMలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

ముస్తాబాద్ లో ఘనంగా అంతర్జాతీయ పోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు జెండా ఆవిష్కరణ

రాజన్న సిరిసిల్ల ఆగస్ట్ 19 (పున్నమి ప్రతినిది ) ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్లో జెండా ఆవిష్కరణ ముస్తాబాద్ మండల కేంద్రంలో క్రేజీ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యూనియన్ అధ్యక్షులు మాంకాళి వేణు జెండా ఎగరవేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎర్రగొల్ల అనిల్, క్యాషియర్లు గొట్టిగళ్ల మధు, నాగరాజు, ప్రధాన కార్యదర్శి మాన్య రాజేష్, సీనియర్ ఫోటోగ్రాఫర్లు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి ఏటా ఆగస్టు 19న ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకుంటారు. ఫోటోగ్రఫీ కళ, చరిత్ర, సాంకేతికతను గుర్తుచేసుకుంటూ, సమాజంలోని ముఖ్యమైన సంఘటనలను చిత్రాలుగా భద్రపరిచే ఫోటోగ్రాఫర్ల సేవలను గౌరవించేందుకు ఈ రోజును నిర్వహిస్తారు.

రాజన్న సిరిసిల్ల

హరీష్ రావు హౌస్ అరెస్ట్‌పై బీఆర్ఎస్ తీవ్ర ఖండన

రాజన్న సిరిసిల్ల ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి ముస్తాబాద్: మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. మాజీ రైతుబంధు అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్ రావు మాట్లాడుతూ, టీమ్స్ హాస్పిటల్ సందర్శనకు వెళ్లాల్సిన మాజీ మంత్రి హరీష్ రావును కోకాపేటలో హౌస్ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అలాగే నర్సంపేటలో పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అర్ధరాత్రి తొలగించడాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను కొనసాగిస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, రాచమడుగు సంతోష్ రావు, మెంగాని మనోహర్, శీలం స్వామి, కోడె శ్రీనివాస్, జాంగిర్, శేరయ్య, మీడిదొడ్డి యాదగిరి, పల్లె సత్యం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

కొండాపూర్ లో 10 30 కుటుంబాలకు నూతన రేషన్ కార్డు పంపిణీ

రాజన్న సిరిసిల్ల ఆగస్టు 18 (పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామ పంచాయతీ వద్ద నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం గ్రామ శాఖ అధ్యక్షులు గంతరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. లబ్ధిదారులు రేషన్ కార్డులు అందుకుని హర్షం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు, ఉద్యోగాలు, ఉన్నత విద్య తదితర అవసరాలకు రేషన్ కార్డు ఎంతో కీలకమని గంతరాజు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డులు అందిస్తున్నారని పేర్కొన్నారు. కొండాపూర్ గ్రామానికి 1,030 నూతన రేషన్ కార్డులు రావడంతో గ్రామస్తులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రేషన్ కార్డులతో పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత చేరువవుతాయని గంతరాజు అన్నారు.

రాజన్న సిరిసిల్ల

కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ను నిర్వీర్యం చేయొద్దు బి ఆర్ ఎస్

కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ను నిర్వీర్యం చేయొద్దు: బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల ఆగస్టు 17 (పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్: కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ముస్తాబాద్‌లోని బీఆర్ఎస్ మండల కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ పట్టణ అధ్యక్షుడు రాచమడుగు సంతోష్‌రావు, రాష్ట్ర నాయకుడు మెంగని మనోహర్ మరియు శీలం స్వామి మాట్లాడారు. మరియు ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచే ఈ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. పథకం నిలిచిపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

ముస్తాబాద్ వ్యవసాయ అధికారిని మార్చాలి: ప్రజావాణిలో బొంపల్లి సురేందర్ రావు ఫిర్యాదు

రాజన్న సిరిసిల్ల ఆగస్టు 17 (పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్: మండల వ్యవసాయ అధికారి అందుబాటులో ఉండడం లేదని ఆరోపిస్తూ ముస్తాబాద్ బి ఆర్‌ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్‌రావు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు అందుబాటులో ఉండాల్సిన అధికారి విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుత వ్యవసాయ అధికారిని మార్చి, రైతులకు అందుబాటులో ఉండి సమర్థవంతంగా పనిచేసే నూతన అధికారిని నియమించాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. రైతులకు ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ సలహాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.