Friday, 2 October 2026
  • Home  
  • గాంధీజీ ఆశయాలే సమాజానికి మార్గదర్శకం – మహాలక్ష్మి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నివాళులు, మొక్క నాటడం.
- నిర్మల్

గాంధీజీ ఆశయాలే సమాజానికి మార్గదర్శకం – మహాలక్ష్మి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నివాళులు, మొక్క నాటడం.

నిర్మల్ జిల్లా అక్టోబర్ 02 (పున్నమి ప్రతినిధి) నిర్మల్: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని మహాలక్ష్మి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కను నాటారు. ఈ సందర్భంగా సోషల్ వర్కర్, బ్లడ్ బ్యాంక్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ సాజిద్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ చూపిన అహింస, సత్యం, శాంతి మార్గాలు నేటి సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. గాంధీజీ ఆశయాలను కేవలం జయంతి వేడుకలకే పరిమితం చేయకుండా, ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, మానవత్వం, సేవాభావం పెంపొందించినప్పుడే గాంధీజీకి నిజమైన నివాళి అర్పించినవారమవుతామని సందేశమిచ్చారు. ఈ కార్యక్రమంలో మహాలక్ష్మి ఆటో యూనియన్ అధ్యక్షుడు చెప్పురి శెట్టి, ఉపాధ్యక్షుడు సుభాష్, గౌరవ అధ్యక్షుడు జప ప్రకాష్, సీను శంకర్ తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్ జిల్లా అక్టోబర్ 02 (పున్నమి ప్రతినిధి)
నిర్మల్: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని మహాలక్ష్మి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కను నాటారు. ఈ సందర్భంగా సోషల్ వర్కర్, బ్లడ్ బ్యాంక్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ సాజిద్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ చూపిన అహింస, సత్యం, శాంతి మార్గాలు నేటి సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. గాంధీజీ ఆశయాలను కేవలం జయంతి వేడుకలకే పరిమితం చేయకుండా, ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, మానవత్వం, సేవాభావం పెంపొందించినప్పుడే గాంధీజీకి నిజమైన నివాళి అర్పించినవారమవుతామని సందేశమిచ్చారు.
ఈ కార్యక్రమంలో మహాలక్ష్మి ఆటో యూనియన్ అధ్యక్షుడు చెప్పురి శెట్టి, ఉపాధ్యక్షుడు సుభాష్, గౌరవ అధ్యక్షుడు జప ప్రకాష్, సీను శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.