Sunday, 27 September 2026

Tag: బ్రేకింగ్ న్యూస్

రంగారెడ్డి

ఎల్బీనగర్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఎల్బీనగర్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వివిధ డివిజన్లలో జాతీయ జెండా ఆవిష్కరించిన టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఎల్బీనగర్: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సురాబాద్, హయత్‌నగర్, లెక్చరర్స్ కాలనీ, నాగోల్, జీఎస్‌ఐ డివిజన్లతో పాటు ఎల్బీనగర్ చౌరస్తాలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ప్రజలంతా దేశాభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ మన్సురాబాద్ డివిజన్ అధ్యక్షుడు స్వామిగౌడ్, లెక్చరర్స్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు కళ్లెం నరసింహారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర మహేందర్, సీనియర్ నాయకులు ఇరిగి రమేశ్, యువ నాయకులు జక్కిడి సత్యతేజ రెడ్డి, విఠల్ రెడ్డి, పృథ్వీరాజ్, శ్యామ్ సుందర్ రెడ్డి, చుక్క వెంకటేష్, పుల్లయ్య, ప్రకాష్, ఆంజనేయులు, జకీర్, యాదగిరి, వెంకట్ సాయి, కుషాల్ తదితరులు పాల్గొన్నారు.

కడప

జండా వందనానికి నేతలు కరువు..పులివెందుల కాంగ్రెస్ కార్యాలయానికి తాళం!

దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ…దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ… పులివెందులలో మాత్రం జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పరిస్థితి చర్చనీయాంశంగా మారింది.స్వాతంత్ర్య సమరంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీకి… పులివెందులలో ఆగస్టు 15న జెండా వందనం చేసేందుకు నాయకుడే కరువయ్యారా?ఇదే ఇప్పుడు స్థానికంగా వినిపిస్తున్న ప్రశ్న…పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసేందుకు ఒక్క నాయకుడు కూడా ముందుకు రాకపోవడం విస్మయం కలిగిస్తోంది.దేశం మొత్తం జాతీయ జెండాలతో కళకళలాడుతుంటే… చిన్నారుల నుంచి యువత వరకు స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొంటుంటే… ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, రాజకీయ పార్టీల కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేస్తుంటే…పులివెందుల కాంగ్రెస్ కార్యాలయం మాత్రం వెలవెలబోయింది.కార్యాలయానికి గేటుకు తాళం… లోపల చూస్తే చెత్తాచెదారం…కంప చెట్లతో నిండిపోయిన ప్రాంగణం… కార్యకర్తలు, నాయకుల సందడి కనిపించని పరిస్థితి…స్వాతంత్ర్య పోరాట చరిత్రతో ముడిపడి ఉన్న పార్టీకి చెందిన కార్యాలయంలోనే… స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఇలాంటి పరిస్థితి కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవాల్సిన రోజున… పార్టీ కార్యాలయానికి తాళాలు వేసి ఉండటం ఎంతవరకు సమంజసం?కాంగ్రెస్ పార్టీకి పులివెందులలో నాయకత్వం ఉందా? కార్యకర్తలు ఉన్నారా? లేదా పార్టీ కార్యక్రమాలకే నాయకులు దూరమయ్యారా? అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండా కింద పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించిన పులివెందులలో… నేడు జాతీయ పండుగ రోజున కనీసం జెండా వందనం చేసేందుకు కూడా నాయకత్వం ముందుకు రాకపోవడం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.జాతీయ జెండా అంటే కేవలం ఒక వస్త్రం కాదు… కోట్లాది భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీక.అలాంటి జాతీయ జెండాకు వందనం చేయాల్సిన రోజున… పార్టీ కార్యాలయమే తాళం వేసి కనిపించడం పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం, స్థానిక నాయకత్వం స్పందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇకనైనా పులివెందుల కాంగ్రెస్ నాయకత్వం మేల్కొంటుందా? పార్టీ కార్యాలయానికి పూర్వ వైభవం తీసుకొస్తుందా?ప్రతి జాతీయ పండుగను బాధ్యతగా నిర్వహించేలా కార్యాచరణ చేపడుతుందా?స్వాతంత్ర్య పోరాట వారసత్వాన్ని చెప్పుకునే పార్టీకి… పులివెందులలో కనిపిస్తున్న ఈ దుస్థితికి కారణమేంటి?సమాధానం చెప్పాల్సింది మాత్రం స్థానిక కాంగ్రెస్ నాయకత్వమే.

రంగారెడ్డి

తెలంగాణ నేపథ్యంలో మరో సినిమా “శనార్తి”

తెలంగాణ నేపథ్యంలో మరో సినిమా “శనార్తి” హైదరాబాద్, ఆగస్టు 14: తెలంగాణ నేపథ్యంలో మరో ఆసక్తికరమైన చిత్రం తెరకెక్కనుంది. “శనార్తి” పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో “రాజు వెడ్స్ రాంబాయి” ఫేమ్ అఖిల్ హీరోగా, నాగదుర్గ హీరోయిన్‌గా నటించనున్నారు. సంపత్ నంది నిర్మాణంలో, ఆదిత్య మూవీస్ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా చిత్ర బృందం సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. తెలంగాణ సంస్కృతి, స్థానిక జీవన విధానం, ఇక్కడి ప్రజల నేపథ్యాన్ని ప్రతిబింబించేలా కథను రూపొందిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాత సంపత్ నంది తెలిపారు. అఖిల్ ఇప్పటికే “రాజు వెడ్స్ రాంబాయి” చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో ఆయన పాత్ర ప్రత్యేకంగా ఉండనుందని సమాచారం. హీరోయిన్ నాగదుర్గ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమా ప్రారంభోత్సవంతోనే చిత్రంపై ఆసక్తి నెలకొంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించి, నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

రంగారెడ్డి

తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. ఆటో డ్రైవర్లకు రూ.1.50 లక్షల సబ్సిడీ

రేషన్‌దారులకు స్మార్ట్‌ కార్డులు తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. ఆటో డ్రైవర్లకు రూ.1.50 లక్షల సబ్సిడీ హైదరాబాద్, ఆగస్టు 14: ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని 3.42 కోట్ల మంది రేషన్‌ లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2.0 నిర్వహించనున్నారు. ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’ థీమ్‌తో జరిగే సదస్సులో భారత్‌ ఫ్యూచర్‌ సిటీ ప్రణాళికను ఆవిష్కరించనున్నారు. డిఫెన్స్‌, ఏరోస్పేస్‌, ఫార్మా రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా సదస్సు నిర్వహించనున్నారు. వానాకాలంలో ఏడు రకాల సన్నధాన్యం సాగును ప్రోత్సహించాలని కేబినెట్‌ నిర్ణయించింది. యాసంగిలో సేకరించిన మిగులు ధాన్యాన్ని క్వింటాలుకు రూ.2,389 బేసిక్‌ ధరతో ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు. ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్‌ కళాశాలలను యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడానికి ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌లో కాలుష్య నియంత్రణకు రూ.200 కోట్లతో ఈవీ ఆటో పథకానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అర్హులైన ఆటో డ్రైవర్లకు గరిష్ఠంగా రూ.1.50 లక్షల సబ్సిడీ అందించనున్నారు. మక్తల్‌–నారాయణపేట–కొడంగల్‌ ఎత్తిపోతల ఫేజ్‌-2కు రూ.2,100 కోట్లకు ఆమోదం లభించింది.

రంగారెడ్డి

గ్యాస్‌ వినియోగదారులకు బిగ్‌ అలర్ట్‌ ఈ-కేవైసీకి ఆగస్టు 16 డెడ్‌లైన్‌

గ్యాస్‌ వినియోగదారులకు బిగ్‌ అలర్ట్‌ ఈ-కేవైసీకి ఆగస్టు 16 డెడ్‌లైన్‌ హైదరాబాద్‌, ఆగస్టు 14: గ్యాస్‌ వినియోగదారులకు ముఖ్యమైన అలర్ట్‌. LPG గ్యాస్‌ e-KYC పూర్తి చేసేందుకు ఆగస్టు 16 వరకు గడువు ఉన్నట్లు సమాచారం. గడువు సమీపిస్తుండటంతో వినియోగదారులు వెంటనే e-KYC పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. గ్యాస్‌ ఏజెన్సీకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే మొబైల్‌ ద్వారా ఇంటి నుంచే ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఇందుకోసం సంబంధిత గ్యాస్‌ కంపెనీ అధికారిక యాప్‌తో పాటు Aadhaar Face RD యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఇండేన్‌ వినియోగదారులు Indian Oil ONE, HP గ్యాస్‌ వినియోగదారులు HP Pay, భారత్‌ గ్యాస్‌ వినియోగదారులు Hello BPCL యాప్‌లో రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌తో OTP ద్వారా లాగిన్‌ కావాలి. తర్వాత LPG e-KYC/Aadhaar Authentication ఎంపిక చేసి ఆధార్‌ నంబర్‌ నమోదు చేసి ఫేస్‌ స్కాన్‌ పూర్తి చేయాలి. ఆథెంటికేషన్‌ విజయవంతమైతే యాప్‌లో మెసేజ్‌ లేదా గ్రీన్‌ టిక్‌ కనిపిస్తుంది. దీంతో e-KYC ప్రక్రియ పూర్తవుతుంది. వినియోగదారులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే e-KYC పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.

రంగారెడ్డి

గ్యాస్‌ వినియోగదారులకు బిగ్‌ అలర్ట్‌ ఈ-కేవైసీకి ఆగస్టు 16 డెడ్‌లైన్‌

గ్యాస్‌ వినియోగదారులకు బిగ్‌ అలర్ట్‌ ఈ-కేవైసీకి ఆగస్టు 16 డెడ్‌లైన్‌ హైదరాబాద్‌, ఆగస్టు 14: గ్యాస్‌ వినియోగదారులకు ముఖ్యమైన అలర్ట్‌. LPG గ్యాస్‌ e-KYC పూర్తి చేసేందుకు ఆగస్టు 16 వరకు గడువు ఉన్నట్లు సమాచారం. గడువు సమీపిస్తుండటంతో వినియోగదారులు వెంటనే e-KYC పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. గ్యాస్‌ ఏజెన్సీకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే మొబైల్‌ ద్వారా ఇంటి నుంచే ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఇందుకోసం సంబంధిత గ్యాస్‌ కంపెనీ అధికారిక యాప్‌తో పాటు Aadhaar Face RD యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఇండేన్‌ వినియోగదారులు Indian Oil ONE, HP గ్యాస్‌ వినియోగదారులు HP Pay, భారత్‌ గ్యాస్‌ వినియోగదారులు Hello BPCL యాప్‌లో రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌తో OTP ద్వారా లాగిన్‌ కావాలి. తర్వాత LPG e-KYC/Aadhaar Authentication ఎంపిక చేసి ఆధార్‌ నంబర్‌ నమోదు చేసి ఫేస్‌ స్కాన్‌ పూర్తి చేయాలి. ఆథెంటికేషన్‌ విజయవంతమైతే యాప్‌లో మెసేజ్‌ లేదా గ్రీన్‌ టిక్‌ కనిపిస్తుంది. దీంతో e-KYC ప్రక్రియ పూర్తవుతుంది. వినియోగదారులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే e-KYC పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.

రంగారెడ్డి

నందివనపర్తిలో అగ్నిప్రమాదం.. మాజీ సర్పంచ్ ఇంట్లో భారీగా ఆస్తి నష్టం

నందివనపర్తిలో అగ్నిప్రమాదం.. మాజీ సర్పంచ్ ఇంట్లో భారీగా ఆస్తి నష్టం యాచారం, ఆగస్టు 14: యాచారం మండలం నందివనపర్తి గ్రామంలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రాజు నాయక్ ఇంట్లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు గ్రామస్థులు తెలిపారు. క్షణాల్లో మంటలు ఇంటి అంతటా వ్యాపించడంతో ఇంట్లో ఉన్న సామగ్రి, ఇతర వస్తువులు పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. అగ్నిప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో మరింత ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఇంట్లోని విలువైన సామగ్రి కాలిపోవడంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం సంభవించకపోవడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, నష్టానికి సంబంధించిన వివరాలు అధికారుల పరిశీలన అనంతరం తెలియాల్సి ఉంది.

రంగారెడ్డి

ఆదిభట్లలో పారిశుద్ధ్య సమస్యలు.. ప్రజలకు ఇబ్బందులు

ఆదిభట్లలో పారిశుద్ధ్య సమస్యలు.. ప్రజలకు ఇబ్బందులు ఆదిభట్ల, ఆగస్టు 14: ఆదిభట్ల ప్రధాన రహదారిలో పారిశుద్ధ్య సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంజన్ నాల సమీపంలో రోడ్డు పక్కనే పెద్దఎత్తున చెత్తకుప్పలు పేరుకుపోయాయి. చెత్త వేయరాదని సూచించే బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ, దాని పక్కనే చెత్తను పడేస్తుండటం అధికారుల పర్యవేక్షణపై విమర్శలకు దారితీస్తోంది. చెత్తకుప్పల నుంచి దుర్వాసన వెలువడటంతో పాటు పరిసరాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోందని ప్రజలు చెబుతున్నారు. మరోవైపు టీసీఎస్‌ రోడ్డులో డ్రైనేజీ పొంగిపొర్లడంతో మురుగునీరు రోడ్లపైకి చేరుతున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో దుర్వాసనతో పాటు దోమల బెడద పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో దోమల తీవ్రత అధికంగా ఉంటోందని, ఫాగింగ్‌ నిర్వహించాల్సిన సానిటేషన్‌ సిబ్బంది క్రమం తప్పకుండా ఫాగింగ్‌ చేపట్టడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రధాన రహదారి పక్కనే చెత్త పేరుకుపోవడం, డ్రైనేజీ సమస్య పరిష్కారం కాకపోవడం వల్ల ప్రజారోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అంజన్ నాల వద్ద పేరుకుపోయిన చెత్తను తొలగించాలని, టీసీఎస్‌ రోడ్డులో డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతున్నారు. అదేవిధంగా ఫాగింగ్‌ నిర్వహించి దోమల నియంత్రణకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆదిభట్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. Uploaded Video:

రంగారెడ్డి

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత మన్సూరాబాద్, ఆగస్టు 14: అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన బహుగుణం భాస్కర శర్మ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.60 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరాబాద్‌కు చెందిన భాస్కర శర్మ కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆర్థిక సహాయం కోసం యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డిని సంప్రదించారు. వారి విజ్ఞప్తిపై స్పందించిన శివ చరణ్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో CMRFకు దరఖాస్తు చేయించారు. అనంతరం ప్రభుత్వం నుంచి రూ.60 వేల విలువైన చెక్కు మంజూరైంది. మంజూరైన చెక్కును శుక్రవారం మన్సూరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు స్వామిగౌడ్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు జక్కిడి సత్య తేజ రెడ్డి, మృతుడి కుమారుడు విజయభాస్కర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో విఠల్ రెడ్డి, జకీర్ తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

నేర్రపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ

నేర్రపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నేర్రపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన యూనిఫామ్‌లను గ్రామ సర్పంచ్ గొద్దెండ్ల హేమలత శ్రీహరి, ఉప సర్పంచ్ వెలగ వేణుగోపాల్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గొద్దెండ్ల హేమలత శ్రీహరి మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ పరిధిలోని నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రభుత్వం అందిస్తున్న యూనిఫామ్‌లను అందజేస్తూ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణు మాధవ్, గ్రామ కార్యదర్శి రాజ్‌కుమార్, స్కూల్ చైర్మన్ శ్రీలత, పొదుపు సంఘం వీఓ పద్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.