డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ;
అయినవిల్లి లంకలో పోతబత్తుల నరసింహారావు కుమార్తె కొప్పడి శివగంగ నివాసం అగ్నిప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పి. గన్నవరం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు (శీనన్న) బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అయినవిల్లి మండల పార్టీ అధ్యక్షుడు మేడిశెట్టి శ్రీనివాస్‌తో కలిసి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున ఆర్థిక సహాయాన్ని అందజేసి, ఈ కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అగ్నిప్రమాదంతో ఇల్లు, సామగ్రి దెబ్బతిన్న కుటుంబానికి అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాసరి శ్రీనివాసరావు, దాసరి వీరాస్వామి, పెనిగాడి గంగాధరరావు, కోడూరి శివాజీ, గోడి వరప్రసాద్, కొంకి సత్యనారాయణ, మచ్చ ప్రభాకర్, డెక్క బాలరాజు, జుత్తిక రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.
Uploaded Video:


