Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: పొలిటికల్

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

*క్యాంప్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ

*సేవా సంకల్ప కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ క్యాంప్* *క్యాంప్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17, 2026 వరకు నిర్వహిస్తున్న సేవా సంకల్ప కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్‌ను పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆసుపత్రికి వచ్చే రోగుల సమస్యలను సానుభూతితో తెలుసుకుని మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు. రోగుల పట్ల నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ఆసుపత్రి అభివృద్ధికి తన సహకారం అందిస్తానని తెలిపారు. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు 378 ఆపరేషన్లు నిర్వహించిన ఆసుపత్రి సూపరింటెండెంట్‌, వైద్య సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు. ఆసుపత్రికి అవసరమైన మౌలిక సదుపాయాలను సీఎస్‌ఆర్‌ నిధులతో త్వరలో సమకూర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ప్రజాసేవా భావంతో పనిచేయడం అందరికీ స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్యులు, వైద్య సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

ఖమ్మం

బిజెపి ఆధ్వర్యంలో అంగన్వాడీ సిబ్బందికి ఘన సన్మానం: ముఖ్య అతిధి గా హాజరైన పాల నాగ సురేంద్ర రెడ్డి

వేంసూరు/ ఖమ్మం భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ 76వ జన్మదినోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా వేంసూరు మండలం చౌడవరం గ్రామంలోని రెండు అంగన్వాడీ కేంద్రాల సిబ్బందిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఖమ్మం జిల్లా కార్యదర్శి పాల నాగ సురేంద్ర రెడ్డి పాల్గొన్నారు. మండల ప్రధాన కార్యదర్శులు యామరపు అప్పారావు, బండి వెంకటరెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా కార్యాలయ సంయుక్త కార్యదర్శి గొర్ల శ్రావణ్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు భీమిరెడ్డి బాలకృష్ణ రెడ్డి, దొడ్డపనేని కృషయ్య, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు కిన్నెర మహేష్, మహిళా మోర్చా మండలాధ్యక్షురాలు భీమిరెడ్డి సతీ అనసూయదేవి, గిరిజన మోర్చా మండలాధ్యక్షులు మూడు సీతారాములు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ప్రజా సమస్యలు, వాటి పరిష్కార మార్గాలకు ప్రజా దర్బార్ వారధి

వాడపాలెంలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. ప్రజా సమస్యలు,వాటి పరిష్కారానికి ప్రజా దర్బార్ వారధిగా నిలుస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. శుక్రవారం వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల వద్ద నుంచి వినతులు, అర్జీలు స్వీకరించారు.కార్యక్రమంలో భాగంగా మొత్తం 22 వినతులు అందాయి. అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పలు సమస్యలు పరిష్కరించారు. ప్రజల వద్ద నుంచి స్వీకరించిన ప్రతీ అర్జీ పరిష్కారం కావాలని అధికారులను ఆదేశించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ

* డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి మండలంలోని అయినవిల్లి, ముక్తేశ్వరం, అలాగే వీరవల్లిపాలెం గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పదవీకాలం ముగిసిన తెలుగుదేశం ఎంపీటీసీలను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి. *వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం ఎంపీటీసీలు బలంగా నిలబడ్డారు… పదవీకాలం ముగిసిన తెలుగుదేశం ఎంపీటీసీలను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సత్తా చాటాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. వైసీపీ హయాంలో స్థానిక సంస్థలు ఎన్నికలు అరాచకాలు బెదిరింపులతో సాగాయని అయినా తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీటీసీలుగా పలువురు ప్రజాభిమానంతో విజయం సాధించి తమ సత్తా చాటారన్నారు. గురువారం కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో ఇటీవల పదవీకాలం ముగిసిన తెలుగుదేశం ఎంపీటీసీలను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఘనంగా సత్కరించారు. ఆత్రేయపురం మండలం నుంచి ఉచ్చిలికి చెందిన మట్టా లక్ష్మి, రావులపాలెం మండలం పొడగట్లపల్లి గ్రామానికి చెందిన సకినాల నాగజ్యోతి గణపతి, కేతరాజుపల్లి కి చెందిన పమ్మి శాంతి కుమారి, వెదిరేశ్వరం కు చెందిన గంటా సుబ్బారావు, ఆలమూరు మండలం ఆలమూరుకు చెందిన గంగుల నాగజ్యోతి, జొన్నాడకు చెందిన మారిశెట్టి శ్రీనివాస్, కొత్తపేట మండలం మోడేకుర్రుకు చెందిన రెడ్డి శ్రీనివాస్, మందపల్లి కి చెందిన సిద్ధంశెట్టి సత్యనారాయణ, వానపల్లికి చెందిన మాకే నాగభూషణం, బల్ల సుధారాణి, బిల్లకుర్రుకు చెందిన చిత్రపు ఆనంద్ లను ఎమ్మెల్యే సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి హయాంలో స్థానిక సంస్థల ప్రతినిధులకు ఎటువంటి ప్రాధాన్యత లేదని, గ్రామాల్లో ఏ విధమైన అభివృద్ధి జరగలేదని అన్నారు.

ఖమ్మం

పిడిఎస్‌యూ ఖమ్మం జిల్లా కమిటీలో మూకుమ్మడి రాజీనామాలు

సి పి ఐ (ఎంఎల్‌) మాస్‌ లైన్‌ అనుబంధ విద్యార్థి సంఘం పిడిఎస్‌యూలో ఖమ్మం జిల్లాలో మూకుమ్మడి రాజీనామాలు చోటుచేసుకున్నాయి. జిల్లా కార్యదర్శి వంగూరి వెంకటేష్‌తో పాటు సహాయ కార్యదర్శులు సాదిక్‌ పాషా, యశ్వంత్‌, ఉపాధ్యక్షులు శశికిరణ్‌, వినయ్‌ తదితర జిల్లా కమిటీ సభ్యులు బాధ్యతలకు, మాస్‌లైన్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ కళాశాలలో బుధవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం ప్రకటించారు. సంస్థలో సరైన మార్గదర్శకత్వం లేకపోవడం, ఏకపక్ష నిర్ణయాలు, కార్యకర్తలపై అణచివేత ధోరణులు, గ్రూపు రాజకీయాలు పెరుగుతున్నాయని వారు ఆరోపించారు. ప్రగతిశీల, అభ్యుదయ భావజాలంతో విద్యార్థి సమస్యలపై పనిచేస్తామని, భవిష్యత్‌ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. రాజీనామా చేసిన వారిలో శిలర్‌ పాషా, హరిచంద్ర ప్రసాద్‌, సందీప్‌, సురేష్‌, నవీన్‌, అన్వేష్‌, కార్తీక్‌, వెంకటేష్‌, నిఖిల్‌, వేల్పుల వెంకటేష్‌, విష్ణు, అశోక్‌, మహేష్‌, ఈశ్వర్‌, అసిఫ్‌ తదితరులు ఉన్నారు.

ఖమ్మం

నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగంగా పూర్తి చేయాలి: మంత్రి పొంగులేటి

ఎదులాపురం / ఖమ్మం ఏదులాపురం మున్సిపాలిటీలోని వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద తరుణీ హట్ ప్రాంగణంలో కొనసాగుతున్న రెవెన్యూ ఇంటిగ్రేటెడ్ కార్యాలయ భవన నిర్మాణ పనులను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణ పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భవన సముదాయం అందుబాటులోకి వస్తే ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల సేవలు ఒకే చోట ప్రజలకు అందుబాటులోకి వస్తాయని, దీంతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, మున్సిపల్ కమిషనర్ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఖమ్మం రూరల్ మండలాధ్యక్షులు తోట వీరభద్రం, పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ఖమ్మం

సత్తుపల్లిని ఎప్పటికీ మర్చిపోం: డాక్టర్ తుమ్మల యుగంధర్

సత్తుపల్లి / ఖమ్మం సత్తుపల్లి ప్రాంతం తమ కుటుంబానికి రాజకీయ జన్మనిచ్చిందని, ఈ ప్రాంత ప్రజల రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేమని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్ భావోద్వేగంతో అన్నారు. శ్రీ ప్రసన్న గణపతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి నిర్వహించిన గణేష్ ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 2004 సంవత్సరం నుంచి తన తండ్రి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లి నుంచి పోటీ చేసే అవకాశం లేకపోయినా, సత్తుపల్లి అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుండాలన్నదే ఆయన ఆకాంక్ష అని తెలిపారు. సత్తుపల్లి గౌరవ ప్రతిష్టలు మరింత పెంచే విధంగా తాము పనిచేస్తామని డాక్టర్ తుమ్మల యుగంధర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సత్తుపల్లి ప్రజలతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు, తుమ్మల అభిమానులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అమలాపురం మున్సిపల్ ఓటర్ల జాబితాలో అక్రమాలు: జాయింట్ కలెక్టర్ కి విముక్తి చిరుతల పార్టీ(VCK )వినతి

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ​ అక్రమ ముసాయిదా ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలి జీవో 1113 నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో పారదర్శకంగా రీ-సర్వే నిర్వహించాలి. గణాంకాల తారుమారుపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అమలాపురం పురపాలక సంఘం పరిధిలో అధికారులు ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ప్రక్రియ తీవ్ర అభ్యంతరకరంగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని విముక్తి చిరుతల పార్టీ (VCK) రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ బొంతు రమణ ఆరోపించారు. శనివారం అమలాపురం కలెక్టరేట్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్‌ను కలసి పార్టీ బృందంతో కలసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జీవో నంబరు 1113 ప్రకారం ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు మున్సిపల్ అధికారులు ప్రతీ వార్డులోనూ ఇంటింటికీ తిరిగి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మహిళా ఓటర్ల వివరాలను పారదర్శకంగా సేకరించాల్సి ఉందని గుర్తుచేశారు. కానీ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లకుండా, కార్యాలయాల్లో కూర్చొని బోగస్ రీతిలో జాబితాలు తయారు చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ​రీ-సర్వే చేసి న్యాయం చేయాలి ప్రస్తుతం ప్రచురించిన అక్రమ ఓటర్ల ముసాయిదా, రిజర్వేషన్ల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని VCK నాయకులు డిమాండ్ చేశారు. జీవో 1113 నిబంధనల ప్రకారం మున్సిపల్ సిబ్బందితో క్షేత్రస్థాయిలో నిజాయితీగా, పారదర్శకమైన రీ-సర్వే నిర్వహించాలని కోరారు. గణాంకాల తారుమారుపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బడుగు, బలహీన వర్గాలు తమ రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ హక్కులను కోల్పోకుండా పక్కా గణాంకాలతో సరైన రీతిలో రిజర్వేషన్లు ఖరారు చేయాలని బొంతు రమణ కోరారు. ఈ కార్యక్రమంలో…. వి సి కే పార్టీ జిల్లా అధ్యక్షులు మెండి డేవిడ్ అంబేద్కర్, జల్లి అజయ్ పాల్గొన్నారు.

ఖమ్మం

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి.

వేంసూరు / ఖమ్మం సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ వెంసూర్ మండల శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ వెంసూర్ మండల అధ్యక్షుడు గోర్ల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం జిల్లా కార్యదర్శి పాల నాగ సురేంద్ర రెడ్డి, కిసాన్ మోర్చా ఖమ్మం జిల్లా కార్యాలయ సంయుక్త కార్యదర్శి గొర్ల శ్రావణ్ కుమార్ రెడ్డి, మండల కార్యదర్శి బండి వెంకట రెడ్డి, సీనియర్ నాయకులు భీమిరెడ్డి బాలకృష్ణ రెడ్డి, దొడ్డపనేని కృష్ణయ్య, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు కిన్నెర మహేష్, కంచర్ల మధన్ మౌళి తదితరులు పాల్గొన్నారు.