Wednesday, 23 September 2026
  • Home  
  • అమలాపురం మున్సిపల్ ఓటర్ల జాబితాలో అక్రమాలు: జాయింట్ కలెక్టర్ కి విముక్తి చిరుతల పార్టీ(VCK )వినతి
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అమలాపురం మున్సిపల్ ఓటర్ల జాబితాలో అక్రమాలు: జాయింట్ కలెక్టర్ కి విముక్తి చిరుతల పార్టీ(VCK )వినతి

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ​ అక్రమ ముసాయిదా ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలి జీవో 1113 నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో పారదర్శకంగా రీ-సర్వే నిర్వహించాలి. గణాంకాల తారుమారుపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అమలాపురం పురపాలక సంఘం పరిధిలో అధికారులు ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ప్రక్రియ తీవ్ర అభ్యంతరకరంగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని విముక్తి చిరుతల పార్టీ (VCK) రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ బొంతు రమణ ఆరోపించారు. శనివారం అమలాపురం కలెక్టరేట్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్‌ను కలసి పార్టీ బృందంతో కలసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జీవో నంబరు 1113 ప్రకారం ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు మున్సిపల్ అధికారులు ప్రతీ వార్డులోనూ ఇంటింటికీ తిరిగి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మహిళా ఓటర్ల వివరాలను పారదర్శకంగా సేకరించాల్సి ఉందని గుర్తుచేశారు. కానీ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లకుండా, కార్యాలయాల్లో కూర్చొని బోగస్ రీతిలో జాబితాలు తయారు చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ​రీ-సర్వే చేసి న్యాయం చేయాలి ప్రస్తుతం ప్రచురించిన అక్రమ ఓటర్ల ముసాయిదా, రిజర్వేషన్ల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని VCK నాయకులు డిమాండ్ చేశారు. జీవో 1113 నిబంధనల ప్రకారం మున్సిపల్ సిబ్బందితో క్షేత్రస్థాయిలో నిజాయితీగా, పారదర్శకమైన రీ-సర్వే నిర్వహించాలని కోరారు. గణాంకాల తారుమారుపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బడుగు, బలహీన వర్గాలు తమ రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ హక్కులను కోల్పోకుండా పక్కా గణాంకాలతో సరైన రీతిలో రిజర్వేషన్లు ఖరారు చేయాలని బొంతు రమణ కోరారు. ఈ కార్యక్రమంలో…. వి సి కే పార్టీ జిల్లా అధ్యక్షులు మెండి డేవిడ్ అంబేద్కర్, జల్లి అజయ్ పాల్గొన్నారు.

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం

అక్రమ ముసాయిదా ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలి
జీవో 1113 నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో పారదర్శకంగా రీ-సర్వే నిర్వహించాలి.
గణాంకాల తారుమారుపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

అమలాపురం పురపాలక సంఘం పరిధిలో అధికారులు ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ప్రక్రియ తీవ్ర అభ్యంతరకరంగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని విముక్తి చిరుతల పార్టీ (VCK) రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ బొంతు రమణ ఆరోపించారు. శనివారం అమలాపురం కలెక్టరేట్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్‌ను కలసి పార్టీ బృందంతో కలసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జీవో నంబరు 1113 ప్రకారం ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు మున్సిపల్ అధికారులు ప్రతీ వార్డులోనూ ఇంటింటికీ తిరిగి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మహిళా ఓటర్ల వివరాలను పారదర్శకంగా సేకరించాల్సి ఉందని గుర్తుచేశారు. కానీ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లకుండా, కార్యాలయాల్లో కూర్చొని బోగస్ రీతిలో జాబితాలు తయారు చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

​రీ-సర్వే చేసి న్యాయం చేయాలి

ప్రస్తుతం ప్రచురించిన అక్రమ ఓటర్ల ముసాయిదా, రిజర్వేషన్ల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని VCK నాయకులు డిమాండ్ చేశారు. జీవో 1113 నిబంధనల ప్రకారం మున్సిపల్ సిబ్బందితో క్షేత్రస్థాయిలో నిజాయితీగా, పారదర్శకమైన రీ-సర్వే నిర్వహించాలని కోరారు. గణాంకాల తారుమారుపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బడుగు, బలహీన వర్గాలు తమ రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ హక్కులను కోల్పోకుండా పక్కా గణాంకాలతో సరైన రీతిలో రిజర్వేషన్లు ఖరారు చేయాలని బొంతు రమణ కోరారు. ఈ కార్యక్రమంలో…. వి సి కే పార్టీ జిల్లా అధ్యక్షులు మెండి డేవిడ్ అంబేద్కర్, జల్లి అజయ్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.