Friday, 2 October 2026

Tag: జనగామ

జనగాం

*విజయవంతంగా వినాయక నిమజ్జనాలు* *”విశ్వహిందూ పరిషత్ జనగామ జిల్లా అధ్యక్షులు ఎనగందులబిక్షపతి, ఎక్కలదేవి మోహన కృష్ణ భార్గవ

*విజయవంతంగా వినాయక నిమజ్జనాలు* ———————————————————- *”విశ్వహిందూ పరిషత్ – వినాయక నిమజ్జన స్వాగత వేడుకలు” *భారీ వర్షం కొంతమేర ఇబ్బందులు కలిగించినా కూడా పోలీస్ యంత్రాంగం మరియు పవర్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ సమర్థవంతంగా సమస్యను అధిగమించి నిమజ్జనాలను విజయవంతం చేసాయనడంలో సందేహం లేదు..* *విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనగామ బస్టాండ్ చౌరస్తాలో స్వాగత వేదిక ఏర్పాటు చేయడం జరిగింది.. ఈ వేడుకలలో డిసిపి రాజమహేంద్రనాయక్ ఐపిఎస్ గారు, ఏసిపి మరియు సీఐ, ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు..* *జనగామ జిల్లా అధ్యక్షుడు ఎనగందుల బిక్షపతి, కార్యదర్శి మోహనకృష్ణ భార్గవ, ఉపాధ్యక్షులు బచ్చు బాలనారాయణ, కోశాధికారి దిడిగం లక్ష్మణ్, సహా కార్యదర్శి చిలువేరు హర్షవర్ధన్, తాడూరి సంతోష్ రాజ్, బొమ్మకంటి అనిల్, మాస రాజు.. జనగామ ఫార్మసి ఆర్గనైజర్ కిరణ్ కుమార్, అమరేందర్, శ్రీధర్, రాజశేఖర్, మేఘన తదితరులు పాల్గొన్నారు..* *పరిషత్ సభ్యులు.. నెల్లుట్ల చెరువుని సందర్శించి, నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు..* *నవరాత్రి ఉత్సవ నిర్వాహకులు..‌ భక్తి శ్రద్ధలతో శాంతియుత వాతావరణంలో ఆనందోత్సాహాలతో నిమజ్జన కార్యక్రమాలు జరుపుకున్నారు..*

జనగాం

నిత్య జీవితం లో ఆయుర్వేదం జీవన విధానాన్ని అలవార్చుకోవాలి : డాక్టర్ అంజిరెడ్డి

జనగామ లో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం రక్తదాన శిబిరం విజయవంతం: డాక్టర్ అంజిరెడ్డి ———————————————————————— నిత్య జీవితంలో ఆయుర్వేద జీవన విధానాన్ని అలవర్చుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్షును సాధించవచ్చని వేద ఆయుర్వేదిక్ పంచకర్మ వెల్నెస్ సెంటర్ డాక్టర్ అంజిరెడ్డి అన్నారు.బుధవారం జనగామ జిల్లా కేంద్రంలోని వేద ఆయుర్వేదిక్ పంచకర్మ వెల్నెస్ సెంటర్ లో విశ్వ ఆయుర్వేద పరిషత్ , ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో భాగంగా సామాజిక బాధ్యతతో హాస్పిటల్ ప్రాంగణంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. హాస్పిటల్ అధినేత డాక్టర్ అంజిరెడ్డి ,ప్రముఖ వైద్యురాలు డాక్టర్ శ్రావ్య ,బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దివ్య లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ అంజిరెడ్డి మాట్లాడుతూ నిత్య జీవితంలో ఆయుర్వేద జీవన విధానాన్ని అలవర్చుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్షును సాధించవచ్చని అన్నారు. ప్రజల్లో ఆయుర్వేదంపై అవగాహన కల్పించడంతో పాటు, సామాజిక సేవా దృక్పథంతోనే ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ శిబిరంలో 20 మంది యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. రక్తదాతలకు నిర్వాహకులు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, విశ్వ ఆయుర్వేద పరిషత్ ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

జనగాం

జనగామ పట్టణం వాసవి కాలనీ ఫేస్ 2 లో ఘనంగా మహా దీపారాధన

వాసవి కాలనీలో ఫేస్ 2 లో ఘనంగా జరిగిన మహాదీపారాధన కార్యక్రమం… ——————————————————————- జనగామ పట్టణంలోని 18 వ వార్డులో గల వాసవి కాలనీ పేస్ 2 లో వినాయక మండపం వద్ద మహాదీపారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమంలో కాలనీలోని మహిళలందరూ ఉత్సాహంగా పాల్గొని వినాయకునికి 101 దీపాలతో ఆరాధన చేసి పూజలు నిర్వహించారు… ఈ కార్యక్రమంలో వాసవి కాలనీ మహిళలు శాలిని, రజిని, శిరీష, జ్యోతి ,నలిని నీరజ ,కమల, పావని ,లక్ష్మి ఊర్మిళ ,దివ్య రెడ్డి, సుమ, స్రవంతి తదితరులు పాల్గొన్నారు… అలాగే దంపతులు కూడా ప్రత్యేక పూజలు చేశారు…

జనగాం

జనగామ పట్టణం లో ఉత్తమ గణేష్ మండపాలకు బహుమతుల ప్రధానం:మంచాల రవిందర్ JGUS అధ్యక్షులు

ఈరోజు జనగామ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు మంచాల రవీందర్ ఆధ్వర్యంలో కామాక్షి ఫంక్షన్ హాల్ లో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా జనగామ పట్టణ సిఐ సత్యనారాయణ గౌరవ అధ్యక్షులుగా కె.వి ఎల్ ఎన్ రెడ్డి వచ్చి ఉత్తమ గణేష్ మండపాలకు నిర్వహణ పర్యావరణ రక్షణ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నిటిని దృష్టిలో తీసుకొని ఫస్ట్ సెకండ్ థర్డ్ మరియు కాన్సిలేషన్ బహుమతులు కండువాలు ఇవ్వడం జరిగింది జనగామ పట్టణంలో ఉన్న అన్ని ఏరియాలలో సంబంధించిన గణనాధులకు ఈ బహుమతులు ఇవ్వడం జరిగింది.మండపాల నిర్వహకులు ఎంతో సంతోషంతో బహుమతులను స్వీకరించి వారి వారి మండపాలలో సరైన పద్ధతిలో గణనాథుల నిమజ్జనం చేయడానికి తమ వంతు కృషి చేస్తామని ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చూస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి సభ్యులు పెద్దోజు జగదీష్ గోధుమల అశోక్ దూసరి శివకృష్ణ జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్క కుమారస్వామి జిల్లా ఉపాధ్యక్షులు సాదం మదన్ మోహన్ యాదవ్, కొలిపాక లక్ష్మణ్, మంగ శ్రీకాంత్, గండి నాగరాజు, కంజర్ల పవన్, భుక్య మనోహర్ ,సంతోష్..తదితరులు పాల్గొన్నారు.

జనగాం

సౌడ రమేష్ బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు ను పరామర్శించిన మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్

సౌడ రమేష్ బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు ను పరామర్శించిన మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్ ———————————————————————— ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కోసం అసెంబ్లీ ముట్టడి బిజెపి కార్యక్రమంలో గాయపడి కోలుకుంటున్న జిల్లా అధ్యక్షులు చౌడ రమేష్ ను వారి నివాసంలో పరామర్శించిన మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్. వారికి మనోధైర్యం చెప్పి పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమం లో బిజెపి జిల్లా ఉపాధ్యక్షురాలు తోకల ఉమారాణి, రాష్ట్ర నాయకులు రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐలోనంగిరెడ్డి, మాజీ ఎంపిటిసి రాజు, బుర్ర తిరుపతి, రంగు రాములు, జిల్లా ఉపాధ్య్యక్షలు పైండ్ల రాజేష్, ఉపేందర్, గట్టు రాంబాబు, స్వప్న తదితరులు పాల్గొన్నారు

జనగాం

గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉత్తమ గణనాథుల ఎంపిక :జనగామ గణేష్ ఉత్సవ సమితి (JGUS)

గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉత్తమ గణనాథుల ఎంపిక ———————————————————————— జనగామ గణేష్ ఉత్సవ సమితి (JGUS) ప్రతినిధి బృందం జనగామ పట్టణంలోని పలు ప్రాంతాల్లో కొలువుదీరిన వివిధ గణేష్ మండపాలను ఆదివారం క్షేత్రస్థాయిలో సందర్శించింది. మండపాల నిర్వహణ, క్రమశిక్షణ, పర్యావరణ స్పృహ, ఆధ్యాత్మిక శోభ తదితర అంశాలను పరిశీలించిన అనంతరం ఉత్తమ గణనాథులను కమిటీ ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఉత్సవ సమితి ప్రతినిధులు మాట్లాడుతూ, ఎంపికైన ఉత్తమ గణేష్ మండపాల నిర్వాహకులకు సోమవారం స్థానిక సాయిరాం (కామాక్షి) ఫంక్షన్ హాల్‌లో మధ్యాహ్నం 2;00 నిర్వహించనున్న “గణేష్ భక్తుల సమన్వయ సమావేశం”లో ఘనంగా బహుమతులు, కండువాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరిగేలా మండప నిర్వాహకులు, భక్తులు సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో JGUS జిల్లా అధ్యక్షులు మంచాల రవీందర్, పెద్దోజు జగదీష్ జిల్లా ముక్క కుమారస్వామి, గోధుమల అశోక్, నాయకులు దూసరి శివకృష్ణ, బింగి రమేష్, మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

జనగాం

MPSR టవర్స్ నూతన కమిటీ ఎన్నిక

కె.లింగారెడ్డి,డాక్టర్ టి. గురుబ్రహ్మం MPSR టవర్స్,వడ్డెపల్లి నూతన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి గా ఎన్నిక ————————————————————– హన్మకొండ వడ్డేపల్లి చర్చి సమీపమున గల MPSR టవర్స్ పరిమళ కాలనీ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగిందని నూతనంగా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి గా ఎన్నుకోబడిన కె. లింగారెడ్డి డాక్టర్ టి. గురుబ్రహ్మం తెలిపారు.అపార్ట్మెంట్ లో నివసిస్తున్న కుటుంబాలు మంచి సుహృద్భావం తో ఈ ఎన్నిక నిర్వహించడం జరిగింది.నరేష్ కుమార్ కోశాధికారిగా , గౌరవ అధ్యక్షులుగా మహ్మద్ సిద్దిఖి హుస్సేన్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.ఈ సందర్బంగా వాళ్ళు మాట్లాడుతూ ఎం పి ఎస్ టవర్స్ లో గల సమస్య లను పరిష్కరిస్తామని, ఏవైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం ద్రుష్టి కి తీసుకెళ్లి జవాబు దారులుగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో మల్లారెడ్డి, రమేష్, కరుణాకర్, శ్రీకాంత్,కిషన్ రావు డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

జనగాం

బమ్మెరలో ఘనంగా పోతన జయంతి భాగవత ఉద్భవ సాహిత్య ఉత్సవాలు

బమ్మెరలో ఘనంగా పోతన జయంతి భాగవత ఉద్భవ సాహిత్య ఉత్సవాలు సెప్టెంబర్ 20 ఆదివారం రోజున సహజ కవి బమ్మెర పోతన జయంతిని బమ్మెర పోతన స్మారక కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పోతన రచించిన భాగవతం ద్వారా అందించిన సందేశం అందుకోని ముందుకు సాగితే ఆయనకు మనం అందించే ఘన నివాళి అని ముఖ్య అతిథిగా వచ్చిన కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యులు,అర్చకులు కె.వి.జి.కె.ఆచార్య అన్నారు.ఆత్మీయ అతిథులుగా పాల్గోన్న వ్యవస్థాపక అధ్యక్షులు సౌదామని సాహిత్య సంస్థ – కామారెడ్డి గూడెం చింత ప్రసాద్ పోతన చరిత్రను నేటి తరానికి అందించాలి పోతన స్మారక కేంద్రాన్ని త్వరగా పూర్తి చేయాలి పోతన ఆనవాళ్లను పరిరక్షించుకోవాలని అన్నారు. రామాలయ పూజారి బట్టర్ రామాచార్యులు మాట్లాడుతూ పోతన వారసత్వాన్ని పరిరక్షించాలని ,పోతన పద్యాలను నేటి యువతకు,భావితరాలకు అందించేలా అడుగేయాలని పేర్కోన్నారు.వచ్చే సంవత్సరం ఘనంగా పోతన జయంతి నిర్వహిస్తామని,కవి సమ్మేళనం ఏర్పాటు చేసి పోతన వైభవం అందరికి తెలిసెలా ముందుకు సాగుతామని గ్రామ సర్పంచ్ రమ్య ప్రశాంత్ , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ పేర్కోన్నారు.మధురమైన పద్యాలను అందించిన పోతన గ్రామంలో మేము ఉండటం మా భాగ్యమని పోతన సాహిత్య కళావేదిక కార్యదర్శి దేవసాని ఉపేందర్, శ్రీ రామదాసు భజన మండలి మండల అధ్యక్షులు సోమ,సత్యం పేర్కోన్నారు.పోతన వైభవం అందరికి అందేలా ప్రభుత్వం పోతన జయంతిని అధికారికంగా నిర్వహించాలని పోతన సాహిత్యకళా వేదిక అధ్యక్షులు మాన్యపు భుజేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామదాసు భజన మండలి సభ్యులు, వార్డు సభ్యులు వంగాల భాస్కర్, ఉపాధ్యాయుడు కొంగ సురేష్, యువ నాయకుడు ఉడుత నరేష్, ఉప్పలయ్య, కొమురయ్య, పెంతల బిక్షం, సోమ, నారాయణ, మారం వెంకన్న, అంజమ్మ, సోమేశ్వర్ గ్రామపంచాయతీ సిబ్బంది తదితరు

జనగాం

తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ (TUF) ఛలో యాదగిరిగుట్ట పోస్టర్ ఘనంగా ఆవిష్కరణ :డాక్టర్ చీమ శ్రీనివాస్, TUF రాష్ట్ర అధ్యక్షులు

తెలంగాణ ఉద్యమ కారుల ఫోరమ్ (TUF) ఛలో యాదగిరిగుట్ట పోస్టర్ ఘనంగా ఆవిష్కరణ ———————————- సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఉద్యమ కారులను గుర్తించడానికి కమిటీ వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు డాక్టర్ చీమ శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమకార్ల అధ్యక్షులు. ఈ రోజు జనగామ పట్టణం చౌరస్తా అంబేద్కర్ విగ్రహంకు పూలమాల వేసి తదనంతరం విలేకరులతో మాట్లాడుతూ సెప్టెంబర్ 27 ఆదివారం రోజు న యాదగిరిగుట్ట లక్ష్మి నరసింహ ఫంక్షన్ హాల్ లో నిర్వహించే టియూఎఫ్,తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 9వ రాష్ట్ర మహాసభల ను విజవంతం చేయాలని పిలుపునిచ్చారు.తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవం కోసం, ఉద్యమ కారుల సంక్షేమం కోసం,సామాజిక ప్రజాస్వామ్య తెలంగాణ కోసం తెలంగాణ వాదులం మనమంతా కలిసి పోరు చేయాలని సకల జనులమంతా కార్మికులు, కర్శకులు, విద్యార్థులు, ఉద్యోగస్థులు, మేధావులు అందరూ యాదగిరిగుట్ట లో నిర్వహించే TUF మహా సభ కు రావాలని డాక్టర్ చీమ శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం రాష్ట్ర నాయకులు దయానంద్ గొల్లపళ్ళి నాగరాజు, శ్యామల జగన్ యాదవ్,ఆర్ కే భూపాల్, జోగు అంజన్న,శంకర్ చంద్రభాను నాయక్ మరియు జనగామ TUF జిల్లా నాయకులు కడింగుల బాలకృష్ణ,లాజర్, తిప్పారాపు ఆనంద్,ఈగం శ్రీనివాస్,రేణుకుంట్ల మురళి బైండ్ల, బోడ రమేష్ నేత, బొల్లం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

జనగాం

కవిత :జ్ఞాపకాలు పదిలపరుచుకుందాం:అంకాల సోమయ్య, దేవరుప్పుల, జనగామ

జ్ఞాపకాలు పదిలపరుచుకుందాం (మన ఉనికి ఆనవాలివేగదా) @@@@@@@@@@@@ సగటు మనిషిని అచేతనున్ని చేసేవి మనీనా! మనుషులా!? నేనైతే ముమ్మాటికీ మనీయేఅంటాను ప్రతీ విషయాన్ని మనీతో ముడిపెట్టిన మాయ మార్కెటైజ్డ్ వరల్డ్ లో గింగిర్లు కొడుతూ ప్రతీదీ డబ్బుమయమే అనే మిషతో ఊరేగుతున్నారు ఇప్పుడంతా సమాజంలో మనం ప్రేమానురాగాలు మృగ్యమైన మరబొమ్మలుగా మారిపోతున్నాము కాలం కన్న కాసు విలువైనదేమి కాదు కానీ తాత్కాలిక ఉపశమనం కాసే, కానీ అదిప్పుడు కాలాన్ని శాసించే స్థాయికి చేరుకుంది . ఇదో మనీ వేదాంతం శుష్కప్రియత్వం దయా, జాలి ,కరుణ ఆత్మీయతానురాగాలు ఏ సమాజంలో శూన్యమైపోతాయో! ఆ సమాజం మానవ సమాజం కాక ఆటవిక, న్యాయరహిత సమాజాన్ని ఏర్పాటు చేసుకొని ఊరేగుతుంది కనీసం మనం మన జీవితంలో ఒక్కరోజైనా పరుల కోసం బ్రతుకుదాం దయ జాలి కరుణ యొక్క ఉదాత్తమైన గుణాలను చాటుదాం రేపు మనం పోయినా మన జ్ఞాపకాలను ఈ భూతలాన కొన్ని వదిలి వెళ్ళాలి కదా! అంకాల సోమయ్య దేవరుప్పుల జనగామ

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.