Friday, 2 October 2026

Tag: జనగామ

జనగాం

జిల్లా లో వైద్య ఆరోగ్య శాఖలో వివిధ ఉద్యోగ భర్తీకి నియామక పరీక్ష ప్రశాంతంగా నిర్వహణ :జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో వివిధ ఉద్యోగాల భర్తీకి నియామక పరీక్ష ప్రశాంతంగా నిర్వహణ* —————————————————————- ఆదివారం, జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో వివిధ కేటగిరీల్లో పోస్టుల భర్తీ కోసం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* పర్యవేక్షణలో రాత పరీక్షను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించారు. ఈ నియామక ప్రక్రియకు మొత్తం (11) పోస్టులకు గాను, (281) దరఖాస్తులు రాగా, (233) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. (48) మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. *కేటగిరీల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి:* *ఫిజీషియన్:* (01) పోస్టుకు గాను, మొత్తం (12) దరఖాస్తులు రాగా, (07) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా, (05) మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. *ఎంఎల్హెచ్పీ:* (06) పోస్టులకు గాను, మొత్తం (166) దరఖాస్తులు రాగా, (130) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా, (36) మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. *ల్యాబ్ టెక్నీషియన్:* (02) పోస్టులకు గాను, మొత్తం (96) దరఖాస్తులు రాగా, (90) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా, (06) మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. *సైకియాట్రిస్ట్:* (01) పోస్టుకు గాను, మొత్తం ఒక అభ్యర్థి దరఖాస్తు చేసుకోగా, ఆ అభ్యర్థి పరీక్షకు గైర్హాజరయ్యారు. *ఆప్థాల్మిక్ అసిస్టెంట్:* (01) పోస్టుకు గాను, మొత్తం (06) దరఖాస్తులు రాగా, (06) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్, ఉపాధి శాఖ అధికారి కుమారస్వామి, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జనగాం

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం :మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

*పూరిగుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి* *విడతల వారీగా ప్రతి అర్హ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు* *పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం* పేదవాడి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, పేదింటి ఆడబిడ్డ కుటుంబంలో చిరునవ్వు చూడాలన్న తపనతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని *రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి* అన్నారు. శనివారం, జిల్లాకేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా గల ప్రెస్టన్ కళాశాల గ్రౌండ్ లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి *భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజ మహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్, జనగామ మున్సిపల్ వైస్ ఛైర్మన్ బూష పర్వతాలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్, జనగామ, బనుక శివరాజ్ యాదవ్, డీసీసీ అధ్యక్షురాలు, జనగామ ఎల్. ధన్వంతి నాయక్, వైటీడీఏ సభ్యులు ఎల్. లక్ష్మీనారాయణ నాయక్ లతో కలిసి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి* హాజరై, తెలంగాణ రాష్ట్ర గీతావళిని ఆలపించారు. ఈ సందర్భంగా *మంత్రివర్యులు* మాట్లాడుతూ.. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని పేదల గుమ్మానికి చేర్చే బాధ్యతతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అదనంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కొత్త తెల్ల రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి కార్యక్రమాలను అమలు చేశామని తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు హాస్టళ్లలో డైట్ ఛార్జీలను 40 శాతం పెంచడంతో పాటు కాస్మోటిక్ ఛార్జీలను గణనీయంగా పెంచామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో సుమారు రూ.200 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ స్థాయి ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థలను నిర్మిస్తున్నామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. వచ్చే దసరా నాటికి 2.18 లక్షల ఇళ్లు పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రతి నియోజకవర్గానికి సమానంగా 3,500 ఇళ్లు మంజూరు చేశామని, జనగామ నియోజకవర్గానికి కూడా అదే విధంగా ఇళ్లు ఇచ్చామని తెలిపారు. లబ్ధిదారులు నిర్మాణ పనులు చేసిన దశలను బట్టి ప్రతి సోమవారం వారి ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్తున్నామని చెప్పారు. రెండో విడతలో 2.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, ప్రతి నియోజకవర్గానికి మరో 2,000 ఇళ్లు కేటాయించామని తెలిపారు. రాష్ట్రంలో పూరిగుడిసెలు లేకుండా చేయాలనే లక్ష్యంతో ముందుగా పూరిళ్లలో నివసిస్తున్న కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. జనగామ నియోజకవర్గంలో గుర్తించిన 500 పూరిళ్ల కుటుంబాలకు ఈ వేదికపై నుంచే రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. అసంపూర్తిగా నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్లు, మొండిగోడలతో ఉన్న ఇళ్లు, స్లాబ్ స్థాయిలో ఆగిపోయిన ఇళ్లను కూల్చకుండా పూర్తి చేసుకునేందుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని కూడా రెండో విడతలో అమలు చేస్తున్నామని చెప్పారు. మూడో విడత, నాలుగో విడతల్లో కూడా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని *మంత్రి* హామీ ఇచ్చారు. గతంలో సేకరించిన ప్రభుత్వ ఇళ్ల స్థలాలను గుర్తించి, అర్హులైన పేదలకు పంపిణీ చేసి, తదుపరి విడతల్లో అక్కడ కూడా ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మహిళా సంఘాలకు ఇప్పటివరకు రూ.70 వేల కోట్లకు పైగా సున్నా వడ్డీ రుణాలు అందించామని చెప్పారు. గతంలో నిర్మాణం పూర్తికాని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నివాసయోగ్యంగా మార్చి, లబ్ధిదారులకు అందించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. జనగామలో ఇందుకు అవసరమైన రూ.2 కోట్లను వెంటనే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దసరా నాటికి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను నివాసయోగ్యంగా అందిస్తామని తెలిపారు. జనగామ మున్సిపాలిటీలో మౌలిక వసతుల అభివృద్ధికి మొదటి విడతగా రూ.25 కోట్లు వెంటనే మంజూరు చేస్తామని, ఇప్పటికే శంకుస్థాపన చేసిన రూ.58–60 కోట్ల అభివృద్ధి పనులు, టెండర్లు పూర్తయిన రూ.19 కోట్ల పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. రైతు భరోసా పథకాన్ని కొనసాగిస్తున్నామని, వరి సాగు చేసిన రైతులకు మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు బోనస్ అందిస్తున్నామని తెలిపారు. నిరుద్యోగ యువత కోసం ఇప్పటికే 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 14–15 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యత అని, అర్హులైన ఏ ఒక్క కుటుంబం కూడా ఇందిరమ్మ ఇల్లు విషయంలో నిరాశ చెందాల్సిన అవసరం లేదని, విడతల వారీగా ప్రతి అర్హ కుటుంబానికి ఇల్లు అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని *మంత్రి* స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో *భువనగిరి పార్లమెంట్ సభ్యులు* మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకుందని, ఈ కాలంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా అనేక కార్యక్రమాలను అమలు చేసిందన్నారు. ప్రజాపాలనలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ వంటి పలు సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ఇంకా రాష్ట్రంలో పరిష్కరించాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయని, వాటి పరిష్కార దిశగా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రజల కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అప్పుల భారం ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యంతో ఏర్పడిందని గుర్తు చేస్తూ, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతోనే తెలంగాణ ఏర్పడిందన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో అర్హులైన పేదలకే ఇళ్లు అందించాలన్నారు. అర్హత లేని వారు ఉంటే తొలగించి, నిజమైన అర్హులకు అవకాశం కల్పించాలన్నారు. ఈ క్రమంలో *జనగామ శాసనసభ్యులు* మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో జనగామ మున్సిపాలిటీ అత్యంత పురాతన మున్సిపాలిటీ అని పేర్కొంటూ, మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతులను మరింత మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఏడు నెలల క్రితం జనగామ మున్సిపాలిటీ పరిధిలో రూ.18.90 కోట్ల అభివృద్ధి పనులు మంజూరై టెండర్లు పూర్తయ్యాయని, ఆ పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా వడ్లకొండ–శామీర్‌పేట్ బైపాస్ రోడ్డును డబుల్ లైన్ చేయాలని కోరారు. అలాగే చీటకోడూరు బ్రిడ్జి నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయాలని, గండిరామారం పంపులను మరమ్మతులు చేసి, వినియోగంలోకి తీసుకురావాలన్నారు. అలాగే రెండో దశలో అదనంగా మరిన్ని ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేసి, అందించాలన్నారు. అనంతరం *జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్* మాట్లాడుతూ.. 2008 సంవత్సరం నుంచి తాగునీటి సరఫరా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చీటకోడూరు డ్యామ్ పరిసర ప్రాంతాల ప్రజల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, ఆయా ప్రాంతాలకు మంచినీటి సరఫరాను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రజలకు నిరంతర తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. జనగామ మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, పలు వార్డుల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ఈ పనుల ద్వారా జనగామ మున్సిపాలిటీని అందరికీ ఆదర్శప్రాయమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో *జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ.. జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. నిరుపేదల సొంత ఇంటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. తదనంతరం 500 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గోపీరాం, మునిసిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి, ఇతర సంబంధిత అధికారులు, అన్ని మండలాల ఎంపిడిఓలు, తహసీల్దార్లు, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జనగాం

చాకలి ఐలమ్మ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తి దాయకం :జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

*చాకలి ఐలమ్మ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం* *ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు* —- *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* చాకలి ఐలమ్మ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం అని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* అన్నారు. శనివారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో *చాకలి ఐలమ్మ 131వ జయంతి* సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* చాకలి ఐలమ్మ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన గావించి, పూలమాలలు సమర్పించి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ పోషించిన పాత్ర చిరస్మరణీయమని అన్నారు. భూమి, ఆత్మగౌరవం కోసం ఆమె చేసిన పోరాటం సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. భావితరాలకు ఆమె జీవితం మార్గదర్శకమని తెలిపారు. అదే విధంగా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోం, జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, కుల సంఘాల ప్రతినిధులు, సభ్యులు, అధికారులు అందరూ పాల్గొని, చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ అధికారి ఎన్.ఎల్. నరసింహ రావు, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిపాక రాములు, జిల్లా పద్మశాలి సంఘం అద్యక్షులు వేముల బాలరాజు, కుమ్మరి సంఘం అధ్యక్షులు ఎద్నూరి బుచ్చయ్య, అభినాష్, ఇతర కుల సంఘ సభ్యులు, జిల్లా అధికారులు, ఐడిఒసి సిబ్బంది, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

జనగాం

ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశాలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చే ఘనంగా ప్రారంభం

శనివారం, జనగామ పట్టణంలోని వీవర్స్ కాలనీ 12వ వార్డులో గల ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా *ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి* హాజరై, డోర్నాల లావణ్య శ్రీనివాస్, కందగట్ల మమత, చుంచు సుమలత రాజ్ కుమార్, బిర్రు భవాని మల్లేష్, కొండ ధనలక్ష్మి లబ్ధిదారుల ఇళ్లకు గృహ ప్రవేశం చేశారు. అలాగే లబ్ధిదారులకు నూతన వస్త్రాలను *మంత్రివర్యులు* అందజేశారు. అదే విధంగా చేనేత కుటుంబాలు మగ్గాలపై నేస్తున్న వస్త్రాలను పరిశీలించిన *మంత్రి*, వారి కళా నైపుణ్యాన్ని అభినందించారు. సంప్రదాయ చేనేతకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో చేనేత కార్మికుల పాత్ర ఎంతో కీలకమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో *జనగామ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజ మహేంద్ర నాయక్, జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు* తదితరులు పాల్గొన్నారు. Uploaded Video:

జనగాం

జనగామ మున్సిపాలిటీ ఆవరణలో నూతన ఆటో ల కు, జేసీబీ కి జండా ఊపి ప్రారంభించిన మంత్రి పొంగులేటి

శనివారం, జిల్లాకేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి *ముఖ్య అతిథిగా రాష్ట్ర గృహ నిర్మాణం, రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి* హాజరై, జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ఆరంభించారు. ఈ సందర్భంగా జనగామ మున్సిపాలిటీకి చెందిన రూ. కోటి 77 లక్షల విలువ గల 16 చెత్త సేకరణ నూతన ఆటోలకు, జేసీబీకి *మంత్రి* జెండా ఊపి ప్రారంభించారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలో శానిటరీ వర్కర్లు (30) మంది, డ్రైవర్ లు (20), ఎలక్ట్రీషియన్ లు (4)తో కలిపి మొత్తం (54) మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందించారు. అనంతరం రూ. రెండు కోట్ల విలువ గల మున్సిపల్ డంపింగ్ యార్డ్ షెడ్ అండ్ మెషినరీ పనులు, అలాగే రూ. 38 కోట్ల విలువ గల మురుగు నీటి శుద్ధి ప్లాంట్ (ఎస్‌టీపీ) పనులు, జిల్లాలోని తరిగొప్పుల మండలంలో రూ. 2.25 కోట్ల విలువ గల తహసీల్దార్ కార్యాలయ నూతన భవన నిర్మాణ పనులు, జిల్లాలోని బచ్చన్నపేట మండలంలోని కట్కూర్ ZPHS, MPPS పాఠశాలల్లో రూ.38.75 లక్షల వ్యయంతో భవన మరమ్మతులు, పునరుద్ధరణ పనులు, అలాగే పోచన్నపేట ఎంపీపీఎస్ పాఠశాలలో రూ.24 లక్షలతో, రామచంద్రాపురం ఎంపీపీఎస్ పాఠశాలలో రూ.23 లక్షలతో, జిల్లాకేంద్రంలోని కోర్టు వద్ద గల జెడ్పీ ఉన్నత పాఠశాల (బాలికలు) రూ. 20 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు, అలాగే జిల్లాలోని 12 కేజీబీవీలు, 15 పీఎం శ్రీ పాఠశాలలు, 28 జెడ్పీహెచ్ఎస్ (బాలికలు) లలో రూ. 1,92,31,996 కోట్లతో అవుట్‌ డోర్ బాస్కెట్‌ బాల్ కోర్టుల నిర్మాణ పనులు, రూ. 19.25 లక్షల విలువ గల జనగామ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) ఆవరణలో అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులు, రూ. 7.35 లక్షల విలువ గల జనగామ చంపక్ హిల్స్‌లోని మాతా-శిశు ఆసుపత్రి (ఎంసీహెచ్)లో ఆక్సిజన్ ప్లాంట్‌కు 50 మీటర్ల సీసీ రోడ్డు పనులు, పార్కింగ్ ప్రాంతంలో గ్రావెల్ నింపడం, సెప్టిక్ ట్యాంక్ నుంచి డ్రెయిన్ వరకు పైప్ డ్రెయిన్ (యూజీడీ) ఏర్పాటు, రూ. పది లక్షలతో జనగామ ఐడీఓసీ (కలెక్టరేట్ కార్యాలయం) వద్ద పార్కింగ్ టైల్స్ వేయడం, ఫెన్సింగ్ ఏర్పాటు, రూ. 31 లక్షలతో జనగామ ఐడీఓసీ (కలెక్టరేట్ భవనం)కు ప్రహరీ గోడ నిర్మాణాల పనుల శిలాఫలకాలను *మంత్రి* ఆవిష్కరించి, శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో *జనగామ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజ మహేంద్ర నాయక్, జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు,* తదితరులు పాల్గొన్నారు.

జనగాం

పాలకుర్తి వెలుగు పాఠశాల ను సందర్శించిన DM&HO డాక్టర్ వాణిశ్రీ

పాలకుర్తి లోని వెలుగు పాఠశాల ను సందర్శించిన DM&HO డాక్టర్ వాణిశ్రీ ———————————————————————— జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ఈ రోజు DM&HO డా. వాణిశ్రీ మేడం గారు వైద్య సిబ్బందితో కలిసి పాలకుర్తి వెలుగు పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో సుమారు 400–500 మంది విద్యార్థులతో మాట్లాడి,వారికి ఎలుకలు కరిచిన గాయాలు, గుర్తులు గాని , జ్వరం గాని కనపడలేదు. వారితో DM&HO డా. వాణిశ్రీ మేడం మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, అలాగే ఏవైనా అనుకోని సంఘటనలు/అసౌకర్యాలు ఎదురైనప్పుడు ఎటువంటి సంకోచం లేకుండా వెంటనే తరగతి ఉపాధ్యాయులకు మరియు పాఠశాల యాజమాన్యానికి సమాచారం అందించాల్సిన అవసరాన్ని వివరించారు. అదేవిధంగా, ప్రభావితమైన విద్యార్థులందరికీ యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ (Anti-Rabies Vaccination) డోసులను ఎటువంటి విరామం లేకుండా, పాఠశాలలోనే వైద్య సిబ్బంది పర్యవేక్షణలో పూర్తి చేయాలని పాలకుర్తి PHC వైద్య బృందాన్ని ఆదేశించారు.కిటికీలకు తలుపులకు ఎలాంటి క్రిమి కీటకాలు, ఎలుకలు, పాములు, తేళ్ళు, రాకుండా ఉండుటకు మెస్ దొర్లు బిగించాలి అని సూచించారు. అలాగే, ప్రభావితమైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం దగ్గరగా పర్యవేక్షిస్తూ, వారి ఆరోగ్యం మరియు క్షేమాన్ని నిర్ధారించాలని DM&HO మేడం గారు వైద్య సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమం లో ప్రోగ్రాం ఆఫీసర్డా. సిద్దార్థ రెడ్డి, వైద్యాధికారులు డా. స్వప్న, డా. జావేద్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

జనగాం

జనగామ జిల్లా స్థాయి అస్మిత రగ్బి టోర్నమెంట్స్ చెన్నూర్ పాఠశాల మైదానంలో ఘనంగా నిర్వహణ

జనగామ జిల్లా స్థాయి అస్మిత రగ్బీ టోర్నమెంట్స్ ———————————————————— *చెన్నూరులో హోరాహోరీగా రగ్బీ పోటీలు.. విజేతలుగా నిలిచిన క్రీడాకారులు* పాలకుర్తి మండలం చెన్నూర్ జనగామ జిల్లా స్థాయి అస్మిత రగ్బీ టోర్నమెంట్స్ పాలకుర్తి మండలంలోని చెన్నూరు గ్రామ ZPHS పాఠశాల క్రీడా మైదానంలో ఘనంగా నిర్వహించారు. 15 సంవత్సరాల బాలికల విభాగంలో 12 జట్లు, 18 సంవత్సరాల బాలికల విభాగంలో 8 జట్లు పాల్గొన్నాయి…. క్రీడాకారులు హోరాహోరీగా పోటీపడి తమ ప్రతిభను చాటుకున్నారు. 15 సంవత్సరాల బాలికల విభాగం 🥇 ప్రథమ బహుమతి: MJP రఘునాథ్‌పల్లి 🥈 ద్వితీయ బహుమతి: KGBV పాలకుర్తి 🥉 తృతీయ బహుమతి: మహర్షి విద్యా మందిర్, చెన్నూరు 18 సంవత్సరాల బాలికల విభాగం 🥇 ప్రథమ బహుమతి: KGBV పాలకుర్తి 🥈 ద్వితీయ బహుమతి: TG TWRS, గూడూరు 🥉 తృతీయ బహుమతి: MJP రఘునాథ్‌పల్లి గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేసినారు. ఈ కార్యక్రమం లో జనగామ జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షులు దొంతమల్ల గణేష్ తెలంగాణ రాష్ట్ర రగ్బీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శేషు,*గౌరవ అధ్యక్షులు కొండ రవి, *ఉపాధ్యక్షులు మామిండ్ల సోమల్లు, *ప్రధాన కార్యదర్శి బాలబోయిన సందీప్, *ఆర్గనైజింగ్ సెక్రెటరీ రావుల కుమారస్వామి, *సంయుక్త కార్యదర్శులు జోడు సంతోష్, *మాచర్ల సుష్మిత *కోశాధికారి బాలబోయిన నరేష్* *కమిటీ సభ్యులు*:- *కొంతం కుమార్, పెంతలా శరత్, ఉలెంగల మాధవి, ఐలపాక గీత, బెల్లంకొండ సాయికుమార్, మొగలగాని నరేష్, జోగు వెంకన్న, నోముల శ్రీకాంత్, చిట్యాల రఘు, ఎలిగేటి సోమన్న, అరకల సతీష్, జిట్టబోయిన మహేష్* తదితరులు పాల్గొన్నారు.

జనగాం

రాష్ట్ర గృహ నిర్మాణం, రెవిన్యూ, సమాచార పౌరాసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జనగామ జిల్లా పర్యటన వివరాలు : రాష్ట్ర గృహ నిర్మాణం, రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి* ఈ నెల 26వ తేదీన జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో షెడ్యూల్ వివరాలిలా ఉన్నాయి.. ఈ సందర్భంగా జిల్లాకేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో జనగామ మున్సిపాలిటీకి చెందిన రూ. కోటి 77 లక్షల విలువ గల 16 చెత్త సేకరణ నూతన ఆటోలకు, జేసీబీకి *మంత్రి* జెండా ఊపి ప్రారంభిస్తారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలో 54 మంది శానిటరీ వర్కర్లు, ఎలక్ట్రీషియన్ లు, డ్రైవర్ లకు నియామకాల పత్రాలు అందజేయడం జరుగుతుంది. అనంతరం రూ. రెండు కోట్ల విలువ గల మున్సిపల్ డంపింగ్ యార్డ్ షెడ్ అండ్ మెషినరీ, అలాగే రూ. 38 కోట్ల విలువ గల మురుగు నీటి శుద్ధి ప్లాంట్ (ఎస్‌టీపీ), జిల్లాలోని తరిగొప్పుల మండలంలో రూ. 2.25 కోట్ల విలువ గల తహసీల్దార్ కార్యాలయ నూతన భవన నిర్మాణం, జిల్లాలోని బచ్చన్నపేట మండలంలోని కట్కూర్ ZPHS, MPPS పాఠశాలల్లో రూ.38.75 లక్షల వ్యయంతో భవన మరమ్మతులు, పునరుద్ధరణ పనులు, అలాగే పోచన్నపేట ఎంపీపీఎస్ పాఠశాలలో రూ.24 లక్షలతో, రామచంద్రాపురం ఎంపీపీఎస్ పాఠశాలలో రూ.23 లక్షలతో, జిల్లాకేంద్రంలోని కోర్టు వద్ద గల జెడ్పీ ఉన్నత పాఠశాల (బాలికలు) రూ. 20 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు, అలాగే జిల్లాలోని 12 కేజీబీవీలు, 15 పీఎం శ్రీ పాఠశాలలు, 28 జెడ్పీహెచ్ఎస్ (బాలికలు) లలో రూ. 1,92,31,996 కోట్లతో అవుట్‌ డోర్ బాస్కెట్‌ బాల్ కోర్టుల నిర్మాణం, రూ. 19.25 లక్షల విలువ గల జనగామ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) ఆవరణలో అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులు, రూ. 7.35 లక్షల విలువ గల జనగామ చంపక్ హిల్స్‌లోని మాతా-శిశు ఆసుపత్రి (ఎంసీహెచ్)లో ఆక్సిజన్ ప్లాంట్‌కు 50 మీటర్ల సీసీ రోడ్డు పనులు, పార్కింగ్ ప్రాంతంలో గ్రావెల్ నింపడం, సెప్టిక్ ట్యాంక్ నుంచి డ్రెయిన్ వరకు పైప్ డ్రెయిన్ (యూజీడీ) ఏర్పాటు, రూ. పది లక్షలతో జనగామ ఐడీఓసీ (కలెక్టరేట్ కార్యాలయం) వద్ద పార్కింగ్ టైల్స్ వేయడం, ఫెన్సింగ్ ఏర్పాటు, రూ. 31 లక్షలతో జనగామ ఐడీఓసీ (కలెక్టరేట్ భవనం)కు ప్రహరీ గోడ నిర్మాణాల పనులకు *మంత్రి* శిలాఫలకాల ఆవిష్కరణ, శంకుస్థాపనలు చేస్తారు. అదే విధంగా మున్సిపాలిటీ పరిధిలో గల 99 మంది డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహణ, అలాగే 500 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేస్తారు. తదనంతరం బహిరంగ సభలో *మంత్రి* సందేశం అందిస్తారు.

జనగాం

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా పర్యటనకు పాకడ్బంధీ ఏర్పాట్లు చేయాలి :జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా —————————————————————– జనగామ, సెప్టెంబర్ 25,పున్నమి జిల్లా ప్రతినిధి : అధికారులు సమన్వయంతో బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలి అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. రాష్ట్ర గృహ నిర్మాణం, రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి* ఈ నెల 26వ తేదీన జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో చేపట్టే ఏర్పాట్లపై శుక్రవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో *అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్‌ లతో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ.. మంత్రి పర్యటనలో జనగామ మున్సిపాలిటీకి చెందిన 16 చెత్త సేకరణ నూతన ఆటోలకు జెండా ఊపి ప్రారంభించడం, మున్సిపల్ డంపింగ్ యార్డ్ షెడ్, మురుగు నీటి శుద్ధి ప్లాంట్ (ఎస్‌టీపీ), తహసీల్దార్ కార్యాలయ నూతన భవన నిర్మాణాలకు శంకుస్థాపనలు, 174 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమం, 500 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ, ప్రజా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. మునిసిపల్ కార్యాలయం, ప్రెస్టన్ కళాశాల గ్రౌండ్‌లో నిర్వహించే ప్రజా సమావేశానికి అన్ని ఏర్పాట్లు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వేదిక, పందిళ్లు, బ్యాక్‌డ్రాప్, సౌండ్ సిస్టమ్, ఎల్ఈడీ వీడియో వాల్స్, విద్యుత్ సరఫరా, జనరేటర్లు, ఎయిర్ కండిషనింగ్, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు, అగ్నిమాపక ఏర్పాట్లు, పార్కింగ్, బారికేడింగ్, మీడియా ఎన్‌క్లోజర్, హెల్ప్‌డెస్క్, గ్రీన్ రూమ్, రవాణా, దిశా నిర్దేశక బోర్డులు, తదితర ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం మండలాల వారీగా సీటింగ్ బ్లాకులు, కౌంటర్లు ఏర్పాటు చేయాలని, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు సమన్వయంతో లబ్ధిదారులను టోకెన్ల ఆధారంగా తీసుకువచ్చి, క్రమశిక్షణతో పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. మొత్తం కార్యక్రమ సమన్వయం, ప్రోటోకాల్ ఏర్పాట్లను ఆర్డీఓ పర్యవేక్షించాలన్నారు. మునిసిపల్ కార్యాలయంలో, అలాగే వేదిక పరిసరాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, మరుగుదొడ్లు, పరిశుభ్రత చర్యలు మున్సిపల్ కమిషనర్ చేపట్టాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా, జనరేటర్ బ్యాకప్, లైటింగ్ ఏర్పాట్లను విద్యుత్ శాఖ అధికారి పూర్తి చేయాలన్నారు. అలాగే భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు. వేదికకు వెళ్లే రహదారులు, బ్యారికేడ్లు, మార్గ సూచిక బోర్డులు ఏర్పాటు, వేదిక వద్ద అగ్నిమాపక, వైద్య బృందాలు, అంబులెన్స్, తాగునీటి సదుపాయం, అత్యవసర సేవలు సిద్ధంగా ఉంచాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి, మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. అదే విధంగా *డీసీపీ* మాట్లాడుతూ.. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక డైవర్షన్‌లు అమలు చేయడం, వీఐపీ, అధికారులు, మీడియా, ప్రజల కోసం వేర్వేరు పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. సభా ప్రాంగణంలో అవసరమైన చోట్ల బారికేడింగ్ ఏర్పాటు చేసి, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలను ప్రత్యేకంగా గుర్తించి జనసందోహ నియంత్రణకు తగిన సంఖ్యలో పోలీసు సిబ్బందిని మోహరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ గోపీరాం, ఏసీపీ భీమ్ శర్మ, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జనగాం

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జనగామ జిల్లా శాఖ మేనేజంగ్ కమిటీ నామినేషన్ స్వీకరణ పూర్తి :ఎన్నికల అధికారి ఆర్ డి ఓ కిరణ్ కుమార్

*ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జనగామ జిల్లా జనగామ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పూర్తి: ఎన్నికల అధికారి, ఘనపూర్ (స్టేషన్) ఆర్డీఓ కిరణ్ ప్రకాష్* ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, జనగామ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయినట్లు *ఎన్నికల అధికారి, ఘనపూర్ (స్టేషన్) ఆర్డీఓ కిరణ్ ప్రకాష్* గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మొత్తం (17) మంది అభ్యర్థులు మేనేజింగ్ కమిటీ ఎన్నికల కోసం నామినేషన్లు దాఖలు చేశారు. *నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు:* * గాదె కేథరిన్ – జనగామ * డా. డి. లవ కుమార్ రెడ్డి – జనగామ * కృష్ణ జీవన్ బజాజ్ – జనగామ * పెండెల శ్రీనివాస్ – జనగామ * పెరువారం ప్రభాకర్ – జనగామ * కె. పరశరాములు – జనగామ * డా. పిట్ట సత్యం – జనగామ * దొంతుల శేఖర్ – జనగామ * పప్పు వెంకట్ రెడ్డి – వనపర్తి, లింగాల ఘనపూర్ * మేకపోతుల ఆంజనేయులు – జనగామ * ఏనుగుల ప్రభాకర్ రెడ్డి – జనగామ * బనాసి రజిని – జనగామ * వేమల్ల నర్సింహా రెడ్డి – జనగామ * చారబుడ్ల సురేందర్ రెడ్డి – జనగామ * జైనా రమేష్ – జనగామ * అంబటి హేమంత రాజు – ఘనపూర్ స్టేషన్ * ఎస్. శివరాజ్ యాదవ్ – జనగామ

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.