జనగామ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో వివిధ ఉద్యోగాల భర్తీకి నియామక పరీక్ష ప్రశాంతంగా నిర్వహణ*
—————————————————————-
ఆదివారం, జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో వివిధ కేటగిరీల్లో పోస్టుల భర్తీ కోసం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* పర్యవేక్షణలో రాత పరీక్షను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించారు.
ఈ నియామక ప్రక్రియకు మొత్తం (11) పోస్టులకు గాను, (281) దరఖాస్తులు రాగా, (233) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. (48) మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు.
*కేటగిరీల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి:*
*ఫిజీషియన్:* (01) పోస్టుకు గాను, మొత్తం (12) దరఖాస్తులు రాగా, (07) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా, (05) మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు.
*ఎంఎల్హెచ్పీ:* (06) పోస్టులకు గాను, మొత్తం (166) దరఖాస్తులు రాగా, (130) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా, (36) మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు.
*ల్యాబ్ టెక్నీషియన్:* (02) పోస్టులకు గాను, మొత్తం (96) దరఖాస్తులు రాగా, (90) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా, (06) మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు.
*సైకియాట్రిస్ట్:* (01) పోస్టుకు గాను, మొత్తం ఒక అభ్యర్థి దరఖాస్తు చేసుకోగా, ఆ అభ్యర్థి పరీక్షకు గైర్హాజరయ్యారు.
*ఆప్థాల్మిక్ అసిస్టెంట్:* (01) పోస్టుకు గాను, మొత్తం (06) దరఖాస్తులు రాగా, (06) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్, ఉపాధి శాఖ అధికారి కుమారస్వామి, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




