Monday, 28 September 2026
  • Home  
  • జలదంకిలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, ఎంఎస్ఎఫ్ మండల కమిటీలు నియామకం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జలదంకిలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, ఎంఎస్ఎఫ్ మండల కమిటీలు నియామకం

జలదంకి: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, ఎంఎస్ఎఫ్ అనుబంధ సంఘాల మండల సదస్సు ఆదివారం జలదంకి టౌన్‌లోని ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో జరిగింది. ఎంఎస్పీ మండల ఇన్‌చార్జి చెరుకూరి వెంకటేష్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జీలు మంద వెంకటేశ్వరరావు మాదిగ, పందిటి అంబేద్కర్ మాదిగ, గోచిపాతల వెంకటేశ్వర్లు మాదిగ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణ సాధనలో మందకృష్ణ మాదిగ కృషిని కొనియాడారు. అక్టోబర్ 6న జరిగే ఎంఎస్ఎఫ్ జాతీయ సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడిగా చవలమూడి హజరత్ మాదిగ, ఎంఎస్పీ అధ్యక్షుడిగా కూచిపాటి మస్తాన్ బాబు మాదిగ, ఎంఎస్ఎఫ్ అధ్యక్షుడిగా శెట్టిపల్లి శివకోటయ్య మాదిగలను ఎంపిక చేశారు. కార్యక్రమంలో నాయకులు, మాదిగ పెద్దలు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.