Thursday, 16 April 2026
  • Home  
  • మహిళా రిజర్వేషన్ బిల్లుకు శ్రీకాళహస్తిలో మద్దతు ర్యాలీ
- తిరుపతి

మహిళా రిజర్వేషన్ బిల్లుకు శ్రీకాళహస్తిలో మద్దతు ర్యాలీ

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 16 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఉభయ పార్లమెంట్ సభల్లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బేరి వారి మండపం నుండి నాలుగు వీధుల మీదుగా జరిగిన ఈ ర్యాలీలో ప్రధాన అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతూ నారీశక్తిగా ఎదుగుతున్న వేళ, చట్టసభలలో వారికి 33 శాతం రిజర్వేషన్ కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ఈ బిల్లుకు మద్దతుగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఆనందకరమని తెలిపారు. ర్యాలీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, ఎన్డీఏ కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కండ్రిగ ఉమ, చాగణం శైలజ, ఉమా సింగ్, అంకమ్మతో పాటు జిల్లా, మండల స్థాయి పదాధికారులు, మహిళలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.