గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉత్తమ గణనాథుల ఎంపిక
————————————————————————
జనగామ గణేష్ ఉత్సవ సమితి (JGUS) ప్రతినిధి బృందం జనగామ పట్టణంలోని పలు ప్రాంతాల్లో కొలువుదీరిన వివిధ గణేష్ మండపాలను ఆదివారం క్షేత్రస్థాయిలో సందర్శించింది. మండపాల నిర్వహణ, క్రమశిక్షణ, పర్యావరణ స్పృహ, ఆధ్యాత్మిక శోభ తదితర అంశాలను పరిశీలించిన అనంతరం ఉత్తమ గణనాథులను కమిటీ ఎంపిక చేసింది.
ఈ సందర్భంగా ఉత్సవ సమితి ప్రతినిధులు మాట్లాడుతూ, ఎంపికైన ఉత్తమ గణేష్ మండపాల నిర్వాహకులకు సోమవారం స్థానిక సాయిరాం (కామాక్షి) ఫంక్షన్ హాల్‌లో మధ్యాహ్నం 2;00 నిర్వహించనున్న “గణేష్ భక్తుల సమన్వయ సమావేశం”లో ఘనంగా బహుమతులు, కండువాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరిగేలా మండప నిర్వాహకులు, భక్తులు సహకరించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో JGUS జిల్లా అధ్యక్షులు మంచాల రవీందర్, పెద్దోజు జగదీష్ జిల్లా ముక్క కుమారస్వామి, గోధుమల అశోక్, నాయకులు దూసరి శివకృష్ణ, బింగి రమేష్, మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.


