రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 21 (పున్నమి ప్రతినిధి): సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రాజమహేంద్రవరం ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రక్తదాన శిబిరంలో పలువురు కార్యకర్తలు, యువత రక్తదానం చేశారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా రక్తదానం చేయడం ద్వారా అత్యవసర సమయాల్లో రోగులకు ఉపయోగపడుతుందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నాయకులు, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ నాయకులు, యువమోర్చా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



