Friday, 2 October 2026

Tag: జనగామ

జనగాం

ప్రభుత్వ పాఠశాలల్లో బాలల భద్రత ఆరోగ్యం హక్కులపై అవగాహనకు ప్రత్యేక చర్యలు

ప్రభుత్వ పాఠశాలల్లో బాలల భద్రత, ఆరోగ్యం, హక్కులపై అవగాహనకు ప్రత్యేక చర్యలు:జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ————————————————————————– *ప్రతి ప్రభుత్వ పాఠశాలకు 15 పోస్టర్లు.. మూడు రకాల బ్యానర్లు అందజేత* *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మాసిక ఆరోగ్యం–పరిశుభ్రత, పాఠశాల భద్రత, బాలల హక్కులు–శరీర భద్రత, పోక్సో చట్టం, తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక అవగాహన పోస్టర్లు, బ్యానర్లను ప్రతి ప్రభుత్వ పాఠశాలకు అందజేయడం జరిగిందని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలకు మొత్తం 15 పోస్టర్లు అందజేయగా, ఇందులో మూడు రకాల పోస్టర్లను 5 చొప్పున పంపిణీ చేశామన్నారు. అదే విధంగా ప్రతి పాఠశాలకు మూడు రకాల అవగాహన బ్యానర్లు కూడా అందజేశామని వెల్లడించారు. *నా ఆరోగ్యం – నా ఆత్మవిశ్వాసం* “My Period • My Health • My Confidence” పేరుతో రూపొందించిన పోస్టర్ల ద్వారా రుతుక్రమం సహజమైన ప్రక్రియ అని, దీనిపై సిగ్గుపడాల్సిన అవసరం లేదని, సరైన అవగాహన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని తెలియజేస్తుందన్నారు. శుభ్రమైన శానిటరీ ప్యాడ్ లను వినియోగించడం, వాటిని మార్చే ముందు–తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఉపయోగించిన సామగ్రిని సురక్షితంగా పారవేయడం, ప్యాడ్లను టాయిలెట్‌లో ఫ్లష్ చేయకూడదని వివరించారు. అలాగే తీవ్ర నొప్పి, అధిక రక్తస్రావం, తల తిరగడం (లేదా) మూర్ఛ, జ్వరం, దురద, అసౌకర్యం వంటి సమస్యలు ఎదురైనప్పుడు తల్లిదండ్రులు, విశ్వసనీయ ఉపాధ్యాయులు, ఏఎన్ఎం/ఆశా (లేదా) సమీప ఆరోగ్య కేంద్రం ద్వారా సహాయం పొందాలని సూచించారు. తోటి విద్యార్థినులను ఎగతాళి చేయకుండా, వారి గోప్యతను గౌరవిస్తూ అవసరమైనప్పుడు సహాయం చేయాలని, ప్రతి పాఠశాలలో పీరియడ్-ఫ్రెండ్లీ సదుపాయాలు ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. *పాఠశాలల భద్రత* “EVERY CHILD. EVERY DAY. EVERYWHERE.” అనే సందేశంతో రూపొందించిన పాఠశాల భద్రత పోస్టర్లలో విద్యార్థులు అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అగ్ని ప్రమాదం సంభవిస్తే బయటకు వెళ్లడం, పిడుగులు పడే సమయంలో భవనంలోకి వెళ్లడం, భూకంప సమయంలో వంగి–రక్షణ పొంది–పట్టుకోవడం వంటి ప్రాథమిక భద్రతా చర్యలను తెలియజేస్తుందన్నారు. అగ్ని, భూకంపం, పిడుగులు–తుఫాన్లు, వరదలు, ఎండ వేడి, విద్యుత్–గ్యాస్–ల్యాబ్ ప్రమాదాలు, తరగతి గదులు–ఆట స్థలాల భద్రత, రోడ్లు–బస్సులు–పర్యటనల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా పోస్టర్లలో పొందుపరిచారు. అదే విధంగా ఆన్‌లైన్ భద్రత, ఆరోగ్యం–ఆహారం–పరిశుభ్రత, మాసిక గౌరవం, ప్రథమ చికిత్స, కాలిన గాయాలు, జంతువుల కాట్లు, పాము కాటు, విషపదార్థాలు, అందరికీ భద్రత–సిద్ధత వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా పోస్టర్లను రూపొందించడం జరిగిందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 112 – అత్యవసర సహాయం, 101 – అగ్నిమాపక సహాయం, 108 – అంబులెన్స్, 1098 – బాలల సహాయవాణి నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు. *నా శరీరం – నా హక్కు – నా భద్రత* “My Body. My Rights. My Safety.” పేరుతో రూపొందించిన పోస్టర్ల ద్వారా విద్యార్థులకు మంచి స్పర్శ, చెడు స్పర్శ, వ్యక్తిగత హద్దులు, బాలల హక్కులు, పోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తుందన్నారు. తమ శరీరంపై తమకే హక్కు ఉందని, ఇష్టం లేని కౌగిలింత, స్పర్శను తిరస్కరించే హక్కు ప్రతి చిన్నారికి ఉందని తెలియజేశారు. వ్యక్తిగత భాగాల గోప్యతను కాపాడుకోవడం, అనుమానాస్పద (లేదా) అసురక్షిత స్పర్శ, బెదిరింపులు, వ్యక్తిగత చిత్రాలకు సంబంధించిన విషయాలను నమ్మకమైన పెద్దలకు తెలియజేయాలని సూచించారు. “వద్దు – భద్రత – చెప్పండి” అనే సందేశంతో, సురక్షిత ప్రదేశానికి వెళ్లడం, సహాయం అందేవరకు నమ్మకమైన పెద్దలకు విషయం తెలియజేస్తూ ఉండాలని వివరించారు. అసురక్షిత పరిస్థితిలో భయంతో స్పందించలేకపోయినా, ఆలస్యంగా చెప్పినా అది బాలల తప్పు కాదని, వారికి సహాయం అందాల్సిందేననే భరోసాను కల్పించేలా పోస్టర్లను రూపొందించడం జరిగిందన్నారు. ఆన్‌లైన్‌లో వ్యక్తిగత చిత్రాలను పంపకూడదని, బెదిరింపులకు డబ్బులు చెల్లించకూడదని, హానికరమైన పరిచయాలను బ్లాక్ చేసి, రిపోర్ట్ చేసి, పెద్దల సహాయం పొందాలని సూచించారు. 18 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారిని రక్షించే పోక్సో చట్టం, లైంగిక దాడి, లైంగిక వేధింపులు, లైంగిక చిత్రాలకు సంబంధించిన నేరాలను పోస్టర్ల ద్వారా అవగాహన కల్పిస్తుందన్నారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు సహాయం అందించే నమ్మకమైన వ్యక్తిని, ప్రత్యామ్నాయ సహాయక వ్యక్తిని గుర్తించడం, న్యాయ సహాయం పొందే అవకాశాలపై కూడా అవగాహన కల్పిస్తుందన్నారు. *విద్యార్థుల భద్రతకు సమగ్ర అవగాహన* పాఠశాల అనేది విద్యార్థులు సురక్షితంగా, ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎదగాల్సిన ప్రదేశమనే ఉద్దేశంతో ఈ అవగాహన పోస్టర్లు, బ్యానర్లను రూపొందించడం జరిగిందన్నారు. ప్రతి విద్యార్థి తన ఆరోగ్యం, భద్రత, హక్కులపై అవగాహన కలిగి ఉండేలా పాఠశాలల్లో వీటిని ప్రదర్శించాలని సూచించారు. “మన భద్రత – మన బాధ్యత”, “మీరు ఒంటరివారు కాదు. అది మీ తప్పు కాదు”, వంటి సందేశాల ద్వారా విద్యార్థుల్లో భద్రత, గౌరవం, పరస్పర సహకారం, ఆత్మవిశ్వాసం పెంపొందించేలా అవగాహన కల్పిస్తుందని స్పష్టం చేశారు.

జనగాం

హోమ్ ఎగ్జామ్స్ లో బాహ్య మూల్యాంకణాన్ని రద్దు చేయాలి :టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి. శ్రీనివాస్

హోమ్ ఎగ్జామ్స్‌లో బాహ్య మూల్యాంకనాన్ని రద్దు చేయాలి సంసిద్ధత లేకుండా బాహ్య మూల్యాంకనం చేపట్టడం అశాస్త్రీయం: టిపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. శ్రీనివాస్ ——————————————————————- ప్రభుత్వ పాఠశాలల్లో హోమ్ ఎగ్జామ్స్‌కు సంబంధించి ఒకటి నుంచి పదో తరగతి వరకు బాహ్య మూల్యాంకనం (External Evaluation) నిర్వహించాలనే విద్యాశాఖ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని టిపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బోధనా పరిస్థితులు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, ఉపాధ్యాయుల కొరత, పాఠశాలల్లో అందుబాటులో ఉన్న వసతులను పరిగణనలోకి తీసుకోకుండా ఈ నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు. బుధవారం జనగామలో టిపిటిఎఫ్ జనగామ జిల్లా శాఖ సబ్ కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు ఎన్.ఎన్. రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన డి. శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యాహక్కు చట్టం స్ఫూర్తికి అనుగుణంగా విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయాన్ని తొలగించి, అభ్యసన సామర్థ్యాలను పెంపొందించే విధంగా విద్యావిధానం ఉండాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న నాన్ డిటెన్షన్ విధానంలో విద్యార్థుల వయస్సు ఆధారంగా పై తరగతులకు ప్రమోషన్ కల్పిస్తున్న నేపథ్యంలో, తగిన సంసిద్ధత లేకుండా ఒకటి నుంచి పదో తరగతి వరకు హోమ్ ఎగ్జామ్స్‌కు బాహ్య మూల్యాంకనం ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే CCE, FLN, LIP, రెమిడియల్ తరగతులు, వివిధ విద్యాశాఖ కార్యక్రమాలు, శిక్షణా కార్యక్రమాలు, ఆన్‌లైన్ అప్‌లోడ్లతో ఉపాధ్యాయుల బోధనా సమయం తగ్గిపోతోందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ ఉపాధ్యాయులను నియమించకపోవడం కూడా బోధనపై ప్రభావం చూపుతోందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు ప్రణాళిక, తగిన శిక్షణ, అవసరమైన వనరులు కల్పించకుండా అకస్మాత్తుగా బాహ్య మూల్యాంకనం నిర్వహించాలని నిర్ణయించడం విద్యావ్యవస్థలో అయోమయానికి దారితీస్తుందని అన్నారు. పదో తరగతి పరీక్షల మూల్యాంకనానికి సంబంధించిన పారితోషికాలు సైతం ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయని, అటువంటప్పుడు హోమ్ ఎగ్జామ్స్ బాహ్య మూల్యాంకనానికి అవసరమైన నిధులు ఎలా సమకూరుస్తారో విద్యాశాఖ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు NN రాజు మాట్లాడుతూ బాహ్య మూల్యాంకనాన్ని భవిష్యత్తులో ప్రవేశపెట్టాలనుకుంటే కనీసం మూడు సంవత్సరాల ముందస్తు ప్రణాళికతో, ఉపాధ్యాయులకు తగిన శిక్షణ, విద్యార్థులకు అభ్యసన సంసిద్ధత కల్పించి, అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చిన తరువాతే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఐదో, ఏడో తరగతుల్లో మూల్యాంకన విధానం, డిటెన్షన్ విధానం వంటి అంశాలపై విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలతో విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. విద్యాశాఖలో సంస్కరించాల్సిన అనేక అంశాలు ఉన్నాయని, ముందుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల అభ్యసన స్థాయులను పెంపొందించేందుకు నాణ్యమైన బోధన, నిరంతర పర్యవేక్షణ, అవసరమైన ఉపాధ్యాయ నియామకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సంసిద్ధత, తగిన వనరులు లేకుండా ఈ విద్యా సంవత్సరంలోనే బాహ్య మూల్యాంకనాన్ని అమలు చేయాలనే నిర్ణయాన్ని ఉపాధ్యాయులందరూ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలను, ప్రభుత్వ పాఠశాలల వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించి, బాహ్య మూల్యాంకనాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్ అంకుషావలి వందన సమర్పణ చేశారు.. ఈ సమావేశానికి రాష్ట్ర కౌన్సిలర్ కుర్రేముల యాదగిరి, జిల్లా పూర్వ అధ్యక్షుడు B లక్మయ్య, మహమ్మద్ అంకుషావలి, y. వజ్రయ్య, శ్రీహరి, లక్మణ్ జీ, బానోతు వెంకన్న, సత్యనారాయణ రెడ్డి, దూడల రమేష్, శారదమ్మ మరియు జే రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు

జనగాం

వరి కోత యంత్రాల( హార్వెస్టర్స్ )అద్దె చార్జీలపై వ్యవసాయ, రవాణా శాఖల సమన్వయ సమావేశం

వరి కోత యంత్రాల (హార్వెస్టర్ల) అద్దె ఛార్జీలపై వ్యవసాయ, రవాణా శాఖల సమన్వయ సమావేశం ———————————————————————– జనగామ,సెప్టెంబర్ 29,పున్నమి జిల్లా ప్రతినిధి : మంగళవారం, వరి సేకరణ, పంట కోతల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వరి కోత యంత్రాల (హార్వెస్టర్ల) గంట అద్దె ఛార్జీల నిర్ణయంపై వ్యవసాయ శాఖ, రవాణా శాఖ అధికారులు, హార్వెస్టర్ యజమానుల మధ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదా నష్టం కలగకుండా, వారికి అనుకూలంగా ఉండే విధంగా హార్వెస్టర్ల అద్దె ఛార్జీలను నిర్ణయించాల్సిన అవసరాన్ని అధికారులు సూచించారు. అదే సమయంలో హార్వెస్టర్ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలు, నిర్వహణ ఖర్చులు, ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని పరస్పర అవగాహనతో నిర్ణయానికి రావాలని చర్చించారు. హార్వెస్టర్ యజమానులు మాట్లాడుతూ.. వరి కోత యంత్రాలను ప్రధానంగా వ్యవసాయ అవసరాల కోసం మాత్రమే వినియోగిస్తున్నందున, వీటిపై కమర్షియల్ పన్ను కాకుండా పన్ను మినహాయింపు (టాక్స్ ఎగ్జెంప్షన్) కల్పించాలని అధికారులను కోరారు. హార్వెస్టర్ల నిర్వహణకు సంబంధించిన ఖర్చులు, రైతులకు అందిస్తున్న సేవలను దృష్టిలో ఉంచుకుని పన్ను మినహాయింపు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పంట కోత సమయంలో ధాన్యం నష్టం జరగకుండా, నాణ్యమైన రీతిలో కోత పూర్తయ్యేలా హార్వెస్టర్ల సాంకేతిక ప్రమాణాలను సక్రమంగా నిర్వహించడంపై సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా యంత్రాల RPM (స్పీడ్), ఫ్యాన్ బ్లేడ్లు, మోటార్ సెట్టింగ్స్ తదితర అంశాలను పంటకు అనుగుణంగా సరైన స్థాయిలో ఉంచాలని సూచించారు. ధాన్యం నేలపై రాలిపోకుండా, పంటలోని ధాన్యం వృథా కాకుండా, తాలు లేకుండా శుభ్రంగా ధాన్యం లభించే విధంగా హార్వెస్టర్లను సాంకేతికంగా సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరాన్ని అధికారులు వివరించారు. యంత్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల రైతులకు పంట నష్టం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హార్వెస్టర్ల అద్దెకు సంబంధించి నిర్దేశిత రేట్లు, యంత్రాల వినియోగ విధానం, పంట కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించేందుకు క్లస్టర్ స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు. వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOs) ఆధ్వర్యంలో రైతులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, హార్వెస్టర్ అద్దె ఛార్జీలు, కోత విధానం, యంత్రాల సాంకేతిక అంశాలపై రైతులకు పూర్తి సమాచారం అందించాలని సూచించారు. దీనివల్ల రైతులకు, హార్వెస్టర్ యజమానులకు మధ్య పరస్పర అవగాహన పెరిగి, పంట కోతల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రానున్న వరి కోతల సీజన్‌లో రైతులకు సకాలంలో యంత్రాలు అందుబాటులో ఉండేలా, పంట నష్టం లేకుండా కోతలు పూర్తయ్యేలా సంబంధిత శాఖలు, హార్వెస్టర్ యజమానులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జనగామ, పెంబర్తి, తదితర మండలాలకు చెందిన హార్వెస్టర్ యజమానులు, సంబంధిత శాఖల అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

జనగాం

బిజెపి ప్రభుత్వం లో భాగం అయిన ఎన్నికల సంఘం కమీషనర్ జ్ఞానేశ్వర్ కు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ

బీజేపీ ప్రభుత్వం లో భాగం అయిన ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ కు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ —————————————————————-7 SIRపై కాంగ్రెస్ నిరసన ర్యాలీకాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ నిరసన ప్రదర్శన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ (SIR)లో అక్రమాలు జారుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జనగామ జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.ఏఐసీసీ,టీపీసీసీ, ఆదేశాల మేరకు, జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పిలుపు మేరకు నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టడం జరిగింది. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి,మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి , DCC అధ్యక్షురాలు లకావత్ ధనవంతి,జిల్లా గ్రంధాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు,జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ జనగామ, స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ లు, ప్రజాప్రతినిధులు,వివిధ చైర్మన్ లతో పాటు టీపీసీసీ, డీసీసీ ముఖ్య నాయకులు, సర్పంచ్ లు, కౌన్సిలర్లు, డైరెక్టర్ లు,అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు,జిల్లా,మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు,మాజీ ప్రజాప్రతినిధులు,నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

జనగాం

ఐఎన్టియుసి 327 యూనియన్ జండా ఆవిష్కరణ కార్యక్రమం

ఐఎన్టియుసి 327 యూనియన్ జండా ఆవిష్కరణ కార్యక్రమం ———————————————————————— జనగామ, సెప్టెంబర్ 29,పున్నమి జిల్లా ప్రతినిధి : లింగాల ఘనపూర్ సెక్షన్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా INTUC-327 స్టేట్ సెక్రటరీ జనరల్ శ్రీధర్ స్టేట్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం ఐలేష్, కంపెనీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, రీజినల్ జిల్లా అధ్యక్షులు వీరాంజనేయులు, నరేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు మహేందర్ కార్యదర్శి విజయ్ కుమార్ మరియు ఘనపూర్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీధర్, ఫయాజ్ మరియు జిల్లా,డివిజన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించిన శ్రీధర్ గారు మాట్లాడుతూ పలు సమస్యల పైన మాట్లాడుతూ => పే రివిజన్, => ఉద్యోగుల పదోన్నతులు, => ట్రాన్ఫర్లు, => EPF to GPF => ఆర్టిజన్ల ప్రధాన డిమాండ్ APSEB రూల్స్ సాధన => Unnamed కార్మికులను ఆర్టిజన్ గా గుర్తింపు => ఆర్టిజన్ పెండింగ్ లో ఉన్న పెయిడ్ హాలిడేస్ మరియు అన్ని సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు

జనగాం

రెసిడెన్సీయల్ విద్యాసంస్థల లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలి :రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలి : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ————————————————————————– కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి *ఆహారం, పారిశుద్ధ్యం, హాజరు, మౌలిక వసతులపై నిరంతర పర్యవేక్షణ* *విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత.. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చర్యలు* *చలికాలంలో వెచ్చని నీరు, దుప్పట్లు అందుబాటులో ఉంచాలి* *దసరా నాటికి ప్రతి విద్యార్థికి రెండు జతల కుట్టిన ఏకరూప దుస్తులు అందేలా చర్యలు* *ఇంటిగ్రేటెడ్ పోర్టల్‌లో వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలి* *రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు* రాష్ట్రంలోని పాఠశాల విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పటిష్టంగా పర్యవేక్షిస్తూ, విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని *రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు* జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం, హైదరాబాదు నుంచి *ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు* రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్వహణ, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* ఈ వీడియో సమావేశానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో *రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి* మాట్లాడుతూ.. రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, విద్యతో పాటు వారికి అందుతున్న మౌలిక వసతులపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కలెక్టర్లు క్రమం తప్పకుండా రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేసి, క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించాలని సూచించారు. ముఖ్యమంత్రి ఇటీవల నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ, కొన్ని చోట్ల ఆహార విషబాధ, ఎలుకలు, పాము కాటు వంటి ఘటనలు చోటు చేసుకోవడంపై ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని సీఎస్ ప్రస్తావించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో ఆహారం తయారీ, ఆహార పదార్థాల నిల్వ, వినియోగంలో నిర్దేశిత ప్రామాణిక నిర్వహణ విధానాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యత, పారిశుద్ధ్య నిర్వహణ, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, మౌలిక వసతుల లోపాలు, తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. వంటశాలలను ఆధునికీకరించే అవకాశం ఉన్న చోట్ల పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని సూచించారు. రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను ఉన్నతస్థాయిలో పర్యవేక్షించేందుకు రూపొందించిన డ్యాష్‌బోర్డ్‌ను కలెక్టర్లు క్రమం తప్పకుండా పరిశీలించాలని తెలిపారు. విద్యాసంస్థల్లోని సౌకర్యాలు, లోపాలు, చేపట్టిన పరిష్కార చర్యల వివరాలను ఇంటిగ్రేటెడ్ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. తద్వారా క్షేత్రస్థాయిలో చేపట్టిన మార్పులను ఉన్నతస్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుంటుందని తెలిపారు. జిల్లాలో రెసిడెన్షియల్ విద్యాసంస్థలకు సంబంధించి ప్రతికూల నివేదికలు వచ్చినప్పుడు అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని సూచించారు. ఏదైనా సమాచారం తప్పుడు ప్రచారంగా ఉన్నట్లు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, వాస్తవంగా సమస్య ఉన్నట్లు తేలితే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వం డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలను పెంచి, అమలు చేస్తోందని, కాస్మెటిక్ ఛార్జీలను డీబీటీ ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. రానున్న శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు స్నానానికి వెచ్చని నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన దుప్పట్లను ముందుగానే సమకూర్చాలని ఆదేశించారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న రెసిడెన్షియల్ విద్యాసంస్థల భవన యజమానులతో కలెక్టర్లు సమావేశమై, అవసరమైన మార్పులు, మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఉపాధ్యాయుడికి అవసరమైన శిక్షణ అందేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇకపై ప్రతిరోజూ ఒక లక్ష ఏకరూప దుస్తులు కుట్టేలా చర్యలు తీసుకోవాలని, దసరా నాటికి ప్రతి విద్యార్థికి రెండు జతల కుట్టిన ఏకరూప దుస్తులు అందేలా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. యూనిఫాం క్లాత్ ఇప్పటికే జిల్లాలకు చేరినందున కుట్టు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా పర్యవేక్షిస్తూ, క్షేత్రస్థాయిలో చేపట్టిన చర్యలు, సమస్యల పరిష్కార వివరాలను ఇంటిగ్రేటెడ్ పోర్టల్‌లో క్రమం తప్పకుండా నవీకరించాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, పోషకాహారం, మానసిక శ్రేయస్సుకు సంబంధించిన అంశాలపై ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. అన్ని విద్యాసంస్థల్లో ఎఫ్‌ఆర్‌ఎస్ (FRS) హాజరు తప్పనిసరిగా అమలు చేయాలని, సిబ్బంది సమయపాలన, విధుల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. విద్యార్థులకు అందించే భోజనం నాణ్యంగా, పరిశుభ్రంగా ఉండేలా వంటశాల పారిశుద్ధ్యాన్ని ప్రతిరోజూ తనిఖీ చేయాలని ఆదేశించారు. వంటగది, పాత్రలు, ఆహార నిల్వ గదులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి విద్యాసంస్థకు ప్రత్యేకంగా ఒక నోడల్ అధికారిని నియమించి, విద్యార్థుల సంక్షేమం, హాజరు, పారిశుద్ధ్యం, ఆహార నాణ్యత, తాగునీటి సౌకర్యాలు, భద్రత, తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నోడల్ అధికారులు క్రమం తప్పకుండా సంస్థలను సందర్శించి, నివేదికలు సమర్పించాలని చెప్పారు. బాలికల విద్యాసంస్థల్లో మహిళా అధికారిని తప్పనిసరిగా నియమించాలని ఆదేశించారు. బాలికల భద్రత, ఆరోగ్యం, వ్యక్తిగత సమస్యలు, పరిశుభ్రత, కౌన్సెలింగ్ వంటి అంశాలపై మహిళా అధికారి ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయాలన్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యం అత్యంత ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు, భావోద్వేగ ఇబ్బందులను గుర్తించి, అవసరమైన కౌన్సెలింగ్ అందించాలని, ప్రతి విద్యాసంస్థలో విద్యార్థులతో తరచూ మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని సంక్షేమ, గురుకుల, రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల ఎఫ్‌ఆర్‌ఎస్ (FRS) హాజరు తప్పనిసరిగా నమోదు కావాలని, ప్రతి విద్యాసంస్థలో నిత్య పర్యవేక్షణతో పాటు పరిశుభ్రత, ఆహార నాణ్యత, బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రతి రోజు తనిఖీ చేసే విధంగా నోడల్ అధికారులను నియమించాలని ఆదేశించారు. తనిఖీల సమయంలో వంటగది పరిశుభ్రత, తాగునీటి స్వచ్ఛత, మరుగుదొడ్ల నిర్వహణ, తరగతి గదులు, హాస్టల్ గదుల పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. విద్యార్థులకు అందించే భోజనం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు. వంటకు ఉపయోగించే ముడి సరుకుల నాణ్యత, ఆహార తయారీ విధానం, భోజనం వడ్డించే పరిశుభ్రతను నిరంతరం తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా బాలికల విద్యాసంస్థల్లో మహిళా అధికారులను ప్రత్యేక నోడల్ అధికారులుగా నియమించి, విద్యార్థినుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమంపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. విద్యాసంస్థల్లో పరిశుభ్రమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్, జీసీడీఓ గౌసియా బేగం, బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహ రావు, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారి హసీనా బేగం, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి మురళీధర్ రావు, ఆహార భద్రత అధికారి వినీల్, డీసీఓ మాన్వీ చంద్, డీఎంహెచ్ఓ వాణిశ్రీ, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జనగాం

జనగామ మున్సిపాలిటీ లో నూతన స్వచ్చ ఆటో ల ర్యాలీ

జనగాం మున్సిపాలిటీలో నూతన స్వచ్ఛ ఆటోల ర్యాలీ ——————————————————————- జనగాం మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు నూతనంగా అందుబాటులోకి వచ్చిన **స్వచ్ఛ ఆటోల ర్యాలీని** ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన స్వచ్ఛ ఆటోలకు పూలమాలలు వేసి, స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ర్యాలీ నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డులో ఇంటింటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందించడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ బాలమణి,కమిషనర్ రాజ శేఖర్ రెడ్డి కౌన్సిలర్లు, వార్డు అధికారులు మరియు మున్సిపల్ సిబ్బంది** పాల్గొని నూతన స్వచ్ఛ ఆటోల ర్యాలీని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ మాట్లాడుతూ, “పరిశుభ్రమైన జనగాం – స్వచ్ఛ జనగాం”లక్ష్యంగా మున్సిపాలిటీ నిరంతరం పనిచేస్తోందని, ప్రజలు కూడా మున్సిపల్ సిబ్బందికి సహకరించి తమ ఇళ్లలోనే తడి, పొడి చెత్తను వేరు చేసి స్వచ్ఛ ఆటోలకు అందించాలని కోరారు

జనగాం

వదంతులు నమ్మవద్దు.. విద్యార్థుల్లో ఎలుకలు కరిచిన ఆనవాళ్లు లేవు :జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

వదంతులను నమ్మవద్దు.. విద్యార్థుల్లో ఎలుకలు కరిచిన ఆనవాళ్లు లేవు : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా విద్యార్థుల ఆరోగ్యంపై క్షుణ్ణంగా ఆరా తీసిన కలెక్టర్* *పాఠశాలలో పరిశుభ్రత, పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి సారించాలి* *అనుమతి లేకుండా బయటి వ్యక్తులను పాఠశాలలోకి రానివ్వొద్దు* *పాలకుర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్* సోమవారం, జిల్లాలోని పాలకుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* సందర్శించి, సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా *ఆర్డీఓ కిరణ్ ప్రకాష్ తో కలిసి కలెక్టర్* విద్యార్థులతో నేరుగా మాట్లాడి, ఈ నెల 22న విద్యార్థులను ఎలుకలు కరిచినట్లు వచ్చిన సమాచారంపై పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను ఉద్దేశించి భోజనం ఎలా ఉంది? ఆరోగ్యం ఎలా ఉంది? రాత్రి సమయంలో జ్వరం వస్తుందా? ఎలుకలు కరిచినట్లు మీరు వాటిని చూసారా? మీ పేరు ఏమిటి? మీ అమ్మానాన్న పేర్లు? వారు ఏం చేస్తారు? ఏ ఊరు? టీకాలు తీసుకున్నారా? అని ప్రశ్నించారు. అలాగే విద్యార్థుల కాళ్లు, చేతులను నిశితంగా పరిశీలిస్తూ, ఏ సమయంలో జరిగింది? ఆ సమయంలో రక్తం వచ్చినట్లు అనిపించిందా? నొప్పిగా ఏమైనా ఉందా? అని వివరాలు తెలుసుకున్నారు. దీనిపై స్పందించిన విద్యార్థులు.. తమకు జ్వరం లేదని, రక్తం కూడా రాలేదని, భోజనం మంచిగా ఉందని, ఆరోగ్యం బాగుందని *కలెక్టర్ కు* వివరించారు. ఈ నేపథ్యంలో *జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ.. వదంతులను నమ్మవద్దని పేర్కొన్నారు. విద్యార్థులను పరిశీలించిన అనంతరం ఎలుకలు కరిచిన ఆనవాళ్లు ఏవీ లేవని, వారి చేతులు, కాళ్లపై ఎటువంటి గీతలు కూడా కనిపించలేదని తెలిపారు. అనంతరం పాఠశాలలోని భోజన గది, సరుకుల నిల్వ గది, వంటశాల, మరుగుదొడ్లు, మూత్రశాలలు, తదితర ప్రాంతాలను కలియతిరిగి విస్తృతంగా పరిశీలించారు. విద్యార్థుల మంచాలను కూడా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించిన *కలెక్టర్*, పరిశుభ్రత విషయంలో పంచాయతీ కార్యదర్శిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, పనికిరాని వస్తువులను వెంటనే తొలగించాలని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డికి ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన, శుభ్రమైన పౌష్టికాహారాన్ని అందించాలని, నిల్వ లేకుండా తాజా కూరగాయలతో ఆహారం అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అదే విధంగా అనుమతి లేకుండా బయటి వ్యక్తులను పాఠశాల లోపలికి రానివ్వకూడదని స్పష్టం చేశారు. ఎంపిడిఓ, తహసీల్దార్ లు పాఠశాలలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. విద్యార్థులు సయానుగుణంగా ఆహరం తీసుకోవాలని, బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడాలని ప్రోత్సహించారు. ఈ పర్యవేక్షణలో తహసీల్దార్ సరస్వతి, ఎంపీడీఓ వేదవతి, వైస్ ప్రిన్సిపల్ వరలక్ష్మి, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

జనగాం

వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ జాబితా డీ -నోవో తయారీ పై నోటీసు:మున్సిపల్ కమిషనర్ రాజ శేఖర్ రెడ్డి కమీషనర్

జనగాం మున్సిపాలిటీలో వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు జాబితా డీ-నోవో తయారీపై నోటీసు –మున్సిపల్ కమిషనర్ రాజ శేఖర్ రెడ్డి ——————————————————————— వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి **01.11.2026ను అర్హత తేదీగా** నిర్ణయించి, ఓటరు జాబితా డీ-నోవో (De-novo) తయారీ ప్రక్రియలో భాగంగా **రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్, 1960లోని రూల్ 31(3)** ప్రకారం ఎన్నికల నమోదు అధికారి & అదనపు కలెక్టర్, నల్గొండ జారీ చేసిన ప్రజా నోటీసును జనగాం మున్సిపల్ కార్యాలయంలో **28.09.2026న నోటీస్ బోర్డు మరియు ప్రజలకు కనిపించే ప్రముఖ ప్రదేశాల్లో** ప్రచురించినట్లు జనగాం మున్సిపల్ కమిషనర్ తెలిపారు. అలాగే, ప్రజల సమాచారం కోసం సంబంధిత నోటీసు ప్రతులతో పాటు **ఫారం–18** అందుబాటులో ఉంచినట్లు, ఎన్నికల సంఘం / తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు అవసరమైన ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన ఓటరు జాబితా డీ-నోవో తయారీ ప్రక్రియలో భాగంగా అర్హులైన పట్టభద్రులు సంబంధిత ఎన్నికల అధికారుల సూచనల మేరకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు. తెలంగాణలో పట్టభద్రుల నియోజకవర్గాల ఓటరు జాబితా డీ-నోవో తయారీకి ఎన్నికల సంఘం గతంలోనూ సంబంధిత నిబంధనలు, షెడ్యూల్‌ను జారీ చేసింది. ([ceotelangana.nic.in][1])

జనగాం

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు సమసమాజ నిర్మాణానికి స్ఫూర్తి :-జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు సమసమాజ నిర్మాణానికి స్ఫూర్తి-కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ———————————————————————– *ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు* *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* అన్నారు. ఆదివారం,జనగామ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో *కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి* సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన గావించి, పూలమాలలు సమర్పించి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ.. ప్రజల హక్కులు, సామాజిక న్యాయం కోసం బాపూజీ చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శప్రాయమని అన్నారు. బలహీన వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వం కోసం బాపూజీ సాగించిన ఉద్యమం సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన కృషి విశేషమని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. అదే విధంగా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోం, ఆర్టీఏ సభ్యులు చిలువేరు అభి గౌడ్, కుల సంఘాల ప్రతినిధులు, సభ్యులు, అధికారులు అందరూ పాల్గొని, కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ అధికారి ఎన్.ఎల్. నరసింహ రావు, కల్లు గీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట మల్లయ్య, ఇతర కుల సంఘాల సభ్యులు, జిల్లా అధికారులు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.