బీజేపీ ప్రభుత్వం లో భాగం అయిన ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ కు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ
—————————————————————-7
SIRపై కాంగ్రెస్ నిరసన ర్యాలీకాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ నిరసన ప్రదర్శన
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో అక్రమాలు జారుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జనగామ జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.ఏఐసీసీ,టీపీసీసీ, ఆదేశాల మేరకు, జనగామ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పిలుపు మేరకు నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టడం జరిగింది.
అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి,మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి , DCC అధ్యక్షురాలు లకావత్ ధనవంతి,జిల్లా గ్రంధాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు,జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ జనగామ, స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ చైర్పర్సన్ లు, ప్రజాప్రతినిధులు,వివిధ చైర్మన్ లతో పాటు టీపీసీసీ, డీసీసీ ముఖ్య నాయకులు, సర్పంచ్ లు, కౌన్సిలర్లు, డైరెక్టర్ లు,అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు,జిల్లా,మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు,మాజీ ప్రజాప్రతినిధులు,నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





