Friday, 2 October 2026

Tag: జనగామ

జనగాం

బాహ్య మూల్యాంకనం పేరుతో అనేక సమస్యలు :Tsutf

**బాహ్య మూల్యాంకనం పేరుతో అసలు సమస్యలు పక్కదారి పట్టిస్తున్న అధికారులు** **విద్యారంగం పటిస్టత పట్ల అధికారుల నిర్లక్ష్య ధోరణి** **పాఠశాల విద్యాశాఖ ఏక పక్షనిర్ణయాలను వ్యతిరేకిస్తున్నాం.** -TSUTF ——————————————————— జనగామ, ఆగష్టు 31,పున్నమి జిల్లా ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సంస్కరణల పేరుతో అధికారులు కేవలం ప్రయోగాలకు పరిమితమైన విధానాలను రూపొందిస్తూ విద్యారంగాన్ని రోజురోజుకు దిగజారుస్తున్నారని TSUTF అభిప్రాయపడుతున్నది. విద్యాశాఖాధికారుల ఏకపక్ష నిర్ణయం ఫలితంగా అసంబద్ధమైన నిర్ణయాలు చేస్తూ ఉత్తర్వులు ఇస్తున్నారని TSUTF ఆరోపిస్తున్నాది. ఇదీవల బాహ్యమూల్యాంకనం పేరుతో తీసుకున్న నిర్ణయం కూడ ఈ అసంబద్ధ ఏకపక్ష నిర్ణయాలలో భాగమేనని TSUTF అభిప్రాయపడుతున్నది. విద్యార్థుల నాణ్యత ప్రమాణాలు పెంచడానికి బోధన సక్రమంగా జరిగేటట్లు పర్యవేక్షణ వ్యవస్థను పెంపొందించడం ఉపాధ్యాయులకు బోధనేతర పనులు తగ్గించడం అవసరమైన ఉపాధ్యాయుల సంఖ్యను ఎప్పటికప్పుడు భర్తీ చేయడంతోపాటు విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించుకొనేటే సహపాఠ్యకార్యక్రమాలపై దృష్టి సారించడం చేయాల్సిన అధికారులు ఆ వైపు కనీసం ఆలోచించకుండా పరీక్షల సంస్కరణల పేరుతో బాహ్యమూల్యాంకన విధానాన్ని తీసుకువచ్చారని అభిప్రాయపడుతున్నాది . వాస్తవానికి ఈ విధానం అమలులో ఉండే సాధ్య అసాధ్యాలను ఏమాత్రం ఆలోచించినట్లుగా లేరు. ప్రాథమిక పాఠశాలల్లో కనీసం తరగతికి ఒక ఉపాధ్యాయుడు లేని సందర్భంలో ఆ ఉపాధ్యాయులు మండల కేంద్రానికి పేపర్ల మూల్యాంకనంకోసం వెళితే బడి ఎలా నడుస్తుంది. నాన్ డిటెన్షన్ సిస్టమ్ ప్రకారం 7వ తరగతి కామన్ బోర్డ్ పరీక్ష విధానాన్ని ఎత్తివేసిన అధికారులు 1 నుండి 9 తరగతి వరకు పరీక్షలోని మార్కులతో సంబంధం లేకుండానే పై తరగతికి పంపించాలి ఉండగా మార్కులకు ఆ ప్రాధాన్యత లేదని, ప్రాధాన్యత లేని అంశపట్ల సంస్కరణల పేరుతో డబ్బులు వృదా చేయడం, ఉపాధ్యాయుల్ని బోధనకు దూరం చేయడం సరైనది కాదని, తరగతికి ఒక ఉపాధ్యాయుని పెట్టాలని, జి.ఓ. 25 సవరించాలని గత కొన్నేళ్ళుగా ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తువుంటే పట్టించుకొని అధికారులు కనీసం ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం కూడ నిర్వహించడానికి తీరికలేని అధికారులు స్వచ్ఛంద సంస్థలు చెప్పిన సలహాలు పాటిస్తూ విద్యారంగంలో ప్రయోగాలు చేస్తున్నారని 20 ఏళ్ళుగా ఇలాంటి ప్రయోగాలకు తెరలేపిన అధికారులు అవి విఫలం చెందిన ప్రతిసారి కొత్త పేరుతో విద్యారంగంలో నాణ్యతతోపాటు ఉపాధ్యాయుల్లో ఉన్న బోధన ఆసక్తిని కూడ నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాబట్టి విద్యాశాఖ అధికారులు వెంటనే ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి బాహ్య మూల్యాంకనం యొక్క విశిష్టత ఏంటో తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేనిచో భవిష్యత్తులో అధికారుల ఏకపక్ష వైఖరికి నిరసనగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం

జనగాం

ఫీజు రియింబుర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలి :బిజెపి జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్

బిజెపి మరియు యువమోర్చ దీక్ష విజవంతం : –బిజెపి జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ ———————————————————- జనగామ, ఆగష్టు 31:పున్నమి జిల్లా ప్రతినిధి : ఈరోజు భారతీయ జనతా పార్టీ మరియు యువ మోర్చా ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని దీక్ష నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు చౌడ రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో 40 లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కోసం కండ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారని వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొని ఉందని చిన్నచిన్న ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకుందామంటే యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయని అటు దరఖాస్తులు చేసుకోలేక ఉన్నత చదువులు చదువుకోలేక విద్యార్థుల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతుందని విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని లేనియెడల ఈ దీక్షలు ప్రారంభం మాత్రమే అని రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలకు వెనుకాడబోమని విద్యార్థుల పక్షాన భాజపా పోరాటం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి విద్యార్థులకు ఫీజు ఇచ్చేంతవరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో యువ మోర్చా జిల్లా అధ్యక్షులు ఎల్లబోయిన హరీష్ బిజెపి రాష్ట్ర నాయకులు విడుదల రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ఉమారాణి కొంతం శ్రీనివాస్ ఐలోని అంజిరెడ్డి ఉపాధ్యక్షులు పల్లె కుమార్ రంగు రాములు చింత సృజన్ బల్ల శ్రీనివాస్ పిట్టల సత్యం మహిళా మోర్చా అధ్యక్షురాలు జీవనజ్యోతి కిసాన్ మోర్చా అధ్యక్షులు సోమిడి వెంకటరెడ్డి దళితం మోర్చా అధ్యక్షులు బంధార యాదగిరి గిరిజన మోర్చా అధ్యక్షులు రవి వివిధ మండలాల అధ్యక్షులు

జనగాం

నడత నేర్పిన అమ్మను మరువకు

నడత నేర్పిన అమ్మను మరువకు —————————————— నడత నేర్పిన అమ్మను మరువకు నడక నేర్పిన నాన్నను మరువకు మంచి ప్రవర్తన తో మెలిగినచో మంచి ఫలితాలు వస్తాయి చెడు ప్రవర్తనతో మెలిగినచో దుష్ట ఫలితాలు వస్తాయి… కష్టాలెన్ని ఎదురైనా చేపలాగా ఎదురీదాలి లక్ష్య సాధనకై కృషి చేయాలి తల్లి దండ్రుల ఆశయాలను కడవరకు నెరవేర్చాలి….. నడత నడకలు సక్కగా ఉంటే జీవితం మంతా సఫలమే వంకరటింకార వెళ్లినట్లయితే దారం తెగిన గాలిపటం లాగా చినిగిన ఇస్తారాకుల లాగా చెల్లచెదారమవుతుంది జీవితమంతా… జీవితం నీటి బుడుగ లాంటిది శాశ్వతం ఏది లేదు ఈ లోకంలో సాటి మనిషికి సాయం చేయాలి మానవ సేవయే మాధవ సేవగా పది మందికి సహాయం చేయాలి సత్సంబంధాలు పెంచు కోవాలి… —రేణుకుంట్ల మురళి రిటైర్డ్ Lflhm కలం పేరు :బిస్మరేయ్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ పోయెట్,రైటర్ &ఆథర్

జనగాం

శామీర్ పేట గ్రామం లో ఘనంగా బోనాల పండుగ

శామీర్ పేట గ్రామంలో బోనాల పండుగ ———————————– జనగామ, ఆగష్టు 31,పున్నమి జిల్లా ప్రతినిధి :ఈ రోజు జనగామ జిల్లా శామీర్ పేట గ్రామం లో బోనాల పండుగ ఘనంగా జరుపుకోవడం జరిగిందని జనగామ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా శివరాజ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో బోనాలు చాలా ఘనంగా, ఉత్సాహంగా గ్రామ పెద్దలు, మహిళలు, నాయకులు,యువతీ యువకులు మరియు బంధుమిత్రులు సంతోషంగా జరుపుకుంటామని తెలియచేసారు.

జనగాం

శామీర్ పేట గ్రామం లో నూతన కాంగ్రెస్ పార్టీ కమిటీ నియామకం

శామీర్ పేట గ్రామంలో నూతన కాంగ్రెస్ పార్టీ కమిటీ లు నియామకం ————————————————————– ఈరోజు జనగామ మండలం శామీర్ పేట గ్రామంలో టీపిసిసి ఆదేశాల మేరకు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ,మాజీ ఎమ్మెల్యే శ్రీ *కొమ్మూరి ప్రతాప్ రెడ్డి*సూచన మేరకు నూతన గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్యవర్గం,యూత్ కాంగ్రెస్, బీసీ సెల్, SC సెల్, మైనారిటీ సెల్, కిసాన్ కాంగ్రెస్ , సేవాదళ్ మరియు మహిళ కాంగ్రెస్ పార్టీ కమిటీలు ఏకగ్రీవంగా నియమించడం జరిగింది. ✓ఈ కార్యమానికి ముఖ్య అతిథిలుగా జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ *బనుక శివరాజ్ యాదవ్*,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండ శ్రీధర్ రెడ్డి,మాజీ జిల్లా ఉపాధ్యక్షులు సర్వల నర్సింగ రావు,మాజీ SC సెల్ జిల్లా అధ్యక్షులు గానిపాక మహేందర్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మెరుగు బాలరాజు పాల్గొన్నారు. ✓నూతన గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు: సాదం రమేష్ యాదవ్, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు:, గద్ద నరేష్ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు: కంసాని భాస్కర్ రెడ్డి బీసీ సెల్ అధ్యక్షులు: జిట్టె బాలకుమార్ SC సెల్ అధ్యక్షులు: తాండ్ర నర్సింగరావు మైనారిటీ సెల్ అధ్యక్షులు: సయ్యద్ యాకుబ్ పాషా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు : కడకంచి లక్ష్మి సేవాదళ్ అధ్యక్షులు: తాండ్ర కమలాకర్ మరియు ఇంకా వివిధ నూతన కార్యవర్గం సభ్యులు కూడా ఉన్నారు. ✓ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సాధం మధుసూదన్ యాదవ్, AMC డైరెక్టర్ నామాల శ్రీనివాస్,మండల ప్రధాన కార్యదర్శి ఆవుల రమణ,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రకాష్ యాదవ్,మాజీ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చాడ గొండ కృష్ణ రెడ్డి, జినుకల రాజు,సీనియర్ కాంగ్రెస్ నేతలు కడకంచి వీరమల్లు,కన్నేబోయిన కొమురెల్లి, బత్తుల లక్ష్మీనారాయణ,గద్ద లక్ష్మణ్ , సాదం జంపన్న,చిన్న,మెరుగు గణేష్, తాండ్ర కమలాకర్, తేల్జేరు వెంకటేష్,వార్డు మెంబర్ గద్ద నవీన్,గణేష్, నాగరాజ్,యూత్ కాంగ్రెస్ నాయకులు తొగరు పృథ్వీరాజ్,కాల్వ నాగరాజ్, జిల్లెల కనకరాజు, కరుణాకర్,సందీప్,మహేష్,సంపత్,నవీన్, గ్రామ కాంగ్రెస్ నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

జనగాం

సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నాన్ టీచింగ్ పోస్ట్ ల ఎంపిక పరీక్ష పారధర్షక నిర్వహణ

సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నాన్ టీచింగ్ పోస్ట్ ల ఎంపిక పరీక్ష పారదర్శక నిర్వహణ జనగామ,ఆగష్టు 31,పున్నమి జిల్లా ప్రతినిధి : *సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కేజీబీవీలు, టీజీఎంఎస్ బాలికల వసతి గృహాల నాన్-టీచింగ్ పోస్టుల ఎంపిక పరీక్ష పారదర్శకంగా నిర్వహణ* జిల్లాలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (KGBVs), తెలంగాణ ఆదర్శ పాఠశాలల (TGMS) బాలికల వసతి గృహాలలో ఖాళీగా ఉన్న నాన్-టీచింగ్ పోస్టుల ఎంపిక పరీక్షను ఆదివారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో పారదర్శకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలలో ఖాళీగా ఉన్న కేజీబీవీ, చిల్పూర్ – స్వీపర్ & స్కావెంజర్ 01, కేజీబీవీ, నర్మెట్ట – స్వీపర్ & స్కావెంజర్ 02, కేజీబీవీ, పాలకుర్తి – హెడ్ కుక్ 01, కేజీబీవీ, కొడకండ్ల – అటెండర్ 01, కేజీబీవీ, జనగామ – హెడ్ కుక్ 01, అసిస్టెంట్ కుక్ 01, స్వీపర్ & స్కావెంజర్ 01, కేజీబీవీ, బచ్చన్నపేట – అసిస్టెంట్ కుక్ 01 లతో కలిపి మొత్తం 09 నాన్-టీచింగ్ పోస్టులు, అలాగే TGMS (ఆదర్శ పాఠశాలల) బాలికల వసతి గృహాలలో అసిస్టెంట్ కుక్ 01, బచ్చన్నపేట, వాచ్ ఉమెన్ 01, రఘునాథపల్లి లతో కలిపి మొత్తం 02 నాన్-టీచింగ్ పోస్టులు భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానించగా, మొత్తం (32) మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో (30) మంది అభ్యర్థులు ఎంపిక పరీక్షకు హాజరయ్యారు. *పోస్టుల వారీగా దరఖాస్తుల వివరాలు ఇలా ఉన్నాయి:* అసిస్టెంట్ కుక్ పోస్టులకు 6 మంది, అటెండర్ పోస్టులకు 6 మంది, హెడ్ కుక్ పోస్టులకు 5 మంది, స్వీపర్ అండ్ స్కావెంజర్ పోస్టులకు 10 మంది, వాచ్ ఉమెన్ పోస్టుకు 3 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్, జీసీడీఓ గౌసియా బేగం, తదితరులు పాల్గొన్నారు.

జనగాం

పాఠశాల అకాడమిక్ క్యాలెండర్ జిల్లా కలెక్టర్ చే ఆవిష్కరణ

పాఠశాల అకాడమిక్ క్యాలెండర్ జిల్లా కలెక్టర్ చే ఆవిష్కరణ ————————————-===——— జనగామ, ఆగష్టు 31,పున్నమి జిల్లా ప్రతినిధి : *ప్రతి పాఠశాలకు అకడమిక్ క్యాలెండర్ – విద్యా కార్యక్రమాల అమలుకు మార్గదర్శి *అకడమిక్ క్యాలెండర్‌ ఆవిష్కరణ* *జిల్లా కలెక్టర్, జిల్లా విద్యా శాఖ అధికారి సందీప్ కుమార్ ఝా శనివారం, తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ రూపొందించిన 2026–27 విద్యా సంవత్సర అకడమిక్ క్యాలెండర్‌ను *జిల్లా కలెక్టర్, జిల్లా విద్యా శాఖ అధికారి సందీప్ కుమార్ ఝా* సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల తన ఛాంబర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ.. అకడమిక్ క్యాలెండర్‌ను కేవలం తేదీల పట్టికగా కాకుండా పాఠశాల విద్యా ప్రణాళికకు మార్గదర్శకంగా ఉపయోగించుకోవాలని సూచించారు. అందులో పేర్కొన్న కార్యక్రమాలను నిర్ణీత గడువుల్లో సమర్థవంతంగా అమలు చేసి, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లాలోని ప్రతి పాఠశాలకు అకడమిక్ క్యాలెండర్ చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో నిర్వహించాల్సిన విద్యా, సహ పాఠ్య, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలు, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి సంబంధించిన కార్యాచరణలను ముందుగానే ప్రణాళికాబద్ధంగా అమలు చేసేందుకు ఈ క్యాలెండర్‌ను రూపొందించినట్లు వివరించారు. ప్రతి నెలకు సంబంధించిన పని దినాలు, సెలవులు, పాఠశాల నిర్వహణ కమిటీ సమావేశాలు, స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు, ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (FA) పరీక్షల షెడ్యూల్, మూల్యాంకనాలు, రికార్డుల నిర్వహణ గడువులు, జిల్లా, జాతీయ స్థాయి క్రీడలు, ప్రదర్శనలు, ప్రాజెక్టు పోటీలు, తదితర వివరాలను ఇందులో పొందుపరిచారన్నారు. సెప్టెంబర్ నెల క్యాలెండర్‌లో 23 పని దినాలు, పాఠశాల నిర్వహణ కమిటీ సమావేశం, జిల్లా స్థాయి క్రీడా పోటీలు, FA-2 పరీక్షల కాలపరిమితి, FA-2, సమగ్ర రికార్డుల పూర్తి తేదీలు, స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల గడువు, జాతీయ స్థాయి ప్రదర్శనలు, ప్రాజెక్టు పోటీల వివరాలను స్పష్టంగా పేర్కొన్నారన్నారు. విద్యార్థుల్లో పఠన అలవాటును పెంపొందించేందుకు ప్రతిరోజూ 30 నిమిషాల రీడింగ్ యాక్టివిటీ, మానసిక ప్రశాంతత, ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతిరోజూ యోగా, ధ్యానం నిర్వహించేలా క్యాలెండర్‌లో ప్రత్యేకంగా ప్రాధాన్యం కల్పించారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్, జీసీడీఓ గౌసియా బేగం, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జనగాం

ప్రతి తరగతి కి ఒక ఉపాధ్యాయున్ని నియమించాలి :టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు

మూల్యాంకన పద్ధతులు మారినంత మాత్రాన విద్యా ప్రమాణాలు పెరగవు –డి శ్రీనివాస్, టిపీటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ————————————————————– జనగామ, ఆగష్టు 30,పున్నమి జిల్లా ప్రతినిధి : *ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయున్ని నియమించాలి, విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెరగాలంటే బోధన అభ్యసన విధానాలలో మార్పు రావాలి. అంతే కానీ బాహ్య మూల్యాంకనంతో విద్యా ప్రమాణాలు ఏ మాత్రం పెరుగవు. ప్రాథమిక స్థాయిలో ప్రతి తరగతికి ఉపాధ్యాయుడు, ప్రతి తరగతి తరగతికి ఒక గది , ఒక ప్రధానోపాధ్యాయుడు, బోధనేతర పనులు చూడడానికి ఒక గుమస్తా , శానిటేషన్ పనుల కోసం ఒక అటెండర్, ఒక స్కావెంజర్ లతో ప్రాథమిక పాఠశాలలు నిర్వహిస్తే ప్రాథమిక పాఠశాలలో నమోదు పెరుగుతుంది మరియు విద్యా ప్రమాణాలు పెరుగుతాయి. ప్రాథమిక స్థాయిలో ఆశించిన విద్యా ప్రమాణాలు సాధిస్తే అవి సెకండరీ మరియు ఉన్నత విద్యలో విద్యా ప్రమాణాలను పెంచుతాయి. ఉపాధ్యాయులను కేవలం బోధనాభ్యసన పనులకు పరిమితం చేస్తే తప్పకుండా విద్యా ప్రమాణాలు మెరుగైతాయి. ప్రాథమిక , మాధ్యమిక స్థాయిలో బాహ్య మూల్యాంకనం చేయించడం సరైన పద్ధతి కాదు ,ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు అనేక అవస్థలతో కొట్టుమిట్టాడుతున్నాయి, ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అనేక ఉన్నాయి. మళ్లీ ఇదొక కొత్త పథకం తీసుకొచ్చి ఉపాధ్యాయులను తరగతి గదికి మరికొన్ని రోజులు దూరం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి బాహ్య మూల్యాంకనం విధానాన్ని వెనక్కి తీసుకోవాలని టిపిటిఎఫ్ డిమాండ్ చేస్తుంది.తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున నిర్ణయించి ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయకుండా , పర్యవేక్షణ అధికారుల పోస్టులను భర్తీ చేయకుండా నిర్లక్ష్యం వహించడం మూలంగానే విద్యారంగం ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత పాఠశాలల వరకు నష్టం జరుగుతా ఉన్నది, బాహ్య మూల్యాంకనం చేయించడం వల్ల విద్యార్థులకుఎలాంటి ప్రయోజనం ఒనగూరదు.

జనగాం

ఫీజు రియింబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అందించాలి :సౌడ రమేష్ బిజెపి జిల్లా అధ్యక్షులు జనగామ

నలుబై వేల మంది విద్యార్థులకు ఫీజు రియింబుర్సు్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అందించాలి :సౌడ రమేష్ బిజెపి జిల్లా అధ్యక్షులు ————————————————————– జనగామ, ఆగష్టు 30,పున్నమి జిల్లా ప్రతినిధి : ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం లో బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ మాట్లాడుతూ రేపు అనగా 31/8/2026 ఉదయం 10:00 నుండి జిల్లా కేంద్రం చౌరస్తాలో 40,000 మంది విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అందించాలని దీక్ష నిర్వహించడం జరుగుతుంది ఈ దీక్షను విజయవంతం చేయాలని భాజపా శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొని దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు తెలిపారు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు వారి తల్లిదండ్రుల పక్షాన భాజాపా పోరాటం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఫీజు రియంబర్స్మెంట్ను విద్యార్థులకు అందించే వరకు భాజపా ఆధ్వర్యంలో యువ మోర్చా ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు పిడుగుల రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐలోని అంజిరెడ్డి జిల్లా సెక్రెటరీ సతీష్ జగదీష్ పూల చందర్ తదితరులు పాల్గొన్నారు

జనగాం

చేయూత సామాజిక భద్రత పింఛన్ల కు దరఖాస్తూ చేసుకోవాలి -జిల్లా కలెక్టర్

అర్హులైన ప్రతి ఒక్కరూ చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలి-జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ———————————————————— జనగామ, ఆగష్టు 29,పున్నమి ప్రతినిధి : చేయూత పింఛన్లపై విస్తృత ప్రచారం నిర్వహించాలి *చేయూత సామాజిక భద్రతా పింఛన్ల పోస్టర్ ఆవిష్కరణ* *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* అర్హులైన ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేయూత సామాజిక భద్రతా పింఛన్ల కోసం *ఈ నెల 31వ* తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* కోరారు. శుక్రవారం, సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని తన ఛాంబర్‌లో చేయూత సామాజిక భద్రతా పింఛన్ల పోస్టర్‌ను *కలెక్టర్* ఆవిష్కరించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ.. సమాజంలోని అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులకు ప్రభుత్వం చేయూత పింఛన్ల ద్వారా సామాజిక భద్రత కల్పిస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో వార్డు అధికారులు, మున్సిపల్ కమిషనర్లు చేయూత పింఛన్లపై విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి గ్రామం, ప్రతి వార్డులో ఫ్లెక్సీలు, కరపత్రాలు, పోస్టర్ల ద్వారా ప్రజలకు అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానం, చివరి తేదీపై అవగాహన కల్పించాలని సూచించారు. చేయూత పింఛన్ల దరఖాస్తు ఫారాలను చేయూత వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, అలాగే నింపిన దరఖాస్తులను ఎంపీడీఓ కార్యాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, మున్సిపాలిటీ కార్యాలయాల్లో సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా మహిళా సమాఖ్యలు చేయూత సామాజిక భద్రతా పింఛన్ల అమలులో కీలక పాత్ర పోషించాలని సూచించారు. గ్రామాల్లోని అర్హులైన ప్రతి వితంతువు, ఒంటరి మహిళను గుర్తించి, పింఛన్ దరఖాస్తు చేసుకునేలా సహకరించాలని తెలిపారు. దరఖాస్తులు నింపడం, అవసరమైన ధ్రువపత్రాల సేకరణ, సంబంధిత కార్యాలయాల్లో దరఖాస్తుల సమర్పణ వరకు మహిళా సమాఖ్య సభ్యులు వారికి అండగా నిలవాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు మొదటి విడతలో సుమారు 7,500 దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా వచ్చాయని *కలెక్టర్* తెలిపారు. ఇంకా అర్హత కలిగిన వారు చివరి తేదీ వరకు అవకాశాన్ని వినియోగించుకొని, దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. *పింఛను రకాలు – అర్హతా ప్రమాణాలు* *వితంతువులు:* – 18 సం.లు పైబడిన వారు – భర్త మరణ ధృవీకరణ పత్రం *ఒంటరి మహిళలు:* – వివాహితులు: 18 సం.లు పైబడిన వారు, భర్తతో విడిపోయి/వదిలివేయబడి 1 సం.లు పైబడిన వారు – అవివాహితులు: గ్రామీణ ప్రాంతాల్లో 30 సం.లు పైబడిన వారు; పట్టణ ప్రాంతాల్లో 35 సం.లు పైబడిన వారు *దివ్యాంగులు:* – వయసుతో సంబంధం లేదు – SADAREM / UDID ధృవీకరణ ద్వారా 40% వైకల్యం (వినికిడి లోపం ఉన్నవారికి 51%) *రక్త సంబంధిత దివ్యాంగులు:* – తలసేమియా, సికిల్ సెల్ డిసీస్, హీమోఫీలియా (SADAREM / UDID ధృవీకరణ) *కల్లుగీత కార్మికులు:* – 50 సం.లు పైబడిన వారు – కల్లుగీత కార్మికుల సహకార సంఘ సభ్యత్వం – ఎక్సైజ్ శాఖ ధృవీకరణ *చేనేత కార్మికులు:* – 50 సం.లు పైబడిన వారు – చేనేత & జౌళి శాఖ ధృవీకరణ *ఫైలేరియా బాధితులు:* – గ్రేడ్-II & III ఫైలేరియా వ్యాధిగ్రస్తులు *దరఖాస్తుల స్వీకరణ* *గ్రామీణ ప్రాంతాలలో:* – పంచాయతీ కార్యదర్శులు – మండల పరిషత్ అభివృద్ధి అధికారులు *పట్టణ ప్రాంతాలలో:* – వార్డు అధికారులు – పురపాలక కమీషనర్లు దరఖాస్తు ఫారాలను *https://cheyutha.telangana.gov.in* వెబ్‌సైట్‌లోని “cheyutha application forms” బటన్ నొక్కి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో ఏపీడీ నూరుద్దీన్, డీపీఎం సతీష్, అడ్మిన్ అసిస్టెంట్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.