Thursday, 1 October 2026

Tag: కొత్తగూడెం

BHADRADRI

బీజేపీ ఆధ్వర్యంలో రాస్తోరోకో )…

కొత్తగూడెం జిల్లా :సెప్టెంబర్ 1:(పున్నమి ప్రతినిధి ): బీజేపీ అధ్యక్షులు శ్రీ నేను. రామచందర్రావు గారి అక్రమ అరెస్ట్ ని నిరసిస్తూ కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ లొ రాస్తోరోకో మరియు నిరసన కార్యక్రమం చెయ్యటం జరిగింది.అదే విధంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం మరియు నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయ పై దాడిని బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు.ఈ సందర్బంగా కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షులు బై రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి పక్ష నాయకులను అరెస్ట్ చెయ్యటం రాజకీయ పార్టీ ల కార్యాలయాలపై దాడులకి పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకి విరుద్ధం అని అన్నారు.రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య పద్ధతిలోనే తగిన సమాధానం చెబుతామని తీవ్రంగా హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమం లొ జిల్లా అధ్యక్షులు బై రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి జాటోత్ వెంకన్న గారు,నాలుగో డివిజన్ కార్పొరేటర్ మరియు జిల్లా ఉపాధ్యక్షురాలు చెరుకు భాగ్యలక్ష్మి గారు,చుంచుపల్లి మండల అధ్యక్షులు బలగం శ్రీధర్ గారు,లక్ష్మి దేవిపల్లి మండల అధ్యక్షులు నవీన్ గారు,యువమోర్చ జిల్లా అధ్యక్షులు మోహనకృష్ణ గారు,మహిళ మోర్చా అధ్యక్షురాలు సముద్రాల గాయత్రి గారు,యువమోర్చ జిల్లా ఉపాధ్యక్షులు పొదిల శ్రీనివాస్ గారు, యువమోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి కోలా హరీష్ గారు, sc మోర్చా జిల్లా అధ్యక్షులు రాకేష్ గారు,తదితర మోర్చాలా నాయకులు ఉపాధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు…

BHADRADRI

ఆదివాసీ బిడ్డ మృతికి కొవ్వొత్తుల ర్యాలీ )…

కొత్తగూడెం జిల్లా :సెప్టెంబర్ 1:(పున్నమి ప్రతినిధి ):: ములకలపల్లి మండలం చవిటిగూడెం గ్రామ ఆదివాసీ బిడ్డ శిరీష మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని బూర్గంప‌హాడ్‌ మండల పరిధిలోని పోలవరం గ్రామానికి చెందిన ఆదివాసీలు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం రాత్రి శిరీష మృతికి సంతాపంగా మాజీ జడ్పీటీసీ బట్టా విజయ్ంధీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. హైదరాబాద్‌లో ఓ ప్రముఖ ఆస్ప‌త్రిలో వైద్య సహాయకురాలిగా నిరంతరం సేవలందించే నర్సు శిరీషను హత్య చేసిన వారిని వదలొద్దని, ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపించి కారకులకు కఠినశిక్ష పడేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. శిరీష పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

BHADRADRI

సింగరేణి ఉద్యోగికి పదవి విరమణ సన్మాన కార్యక్రమం

భద్రాద్రి కొత్తగూడెం :ఆగష్టు 31:(ప్రతినిధి ): శ్రీ కోలా. గురుమూర్తి గారు సింగరేణి సంస్థలో 43సంవత్సరాలు గ సుధీర్ఘ సేవను అందించి నేడు పదవి విరమణ చేయటం ఎంతో గర్వకారణం గ ఉంది అని తోటి ఉద్యోగులతో కలిసి పనిచేసిన అనుభవాలని గుర్తుచేసుకుంటూ నేడు 31-08-2026న ఆయన ఉద్యోగ జీవితాన్ని ముగించారు,ఈ 43సంవత్సరాల కాలంలో ఎన్నో వోడి దుడుకులు ఎదుర్కొని, కుటుంబ బాధ్యతలని నిర్వర్తిస్తూ తన వృత్తిపట్ల నిజాయితీగ, నిబద్ధతతో సేవలంధించిన కోలా గురుమూర్తి గారి ప్రయాణం ఎప్పటుకి స్ఫూర్తిదాయకం.అటువంటి గురుమూర్తి గారికి నేడు పదవి విరమణ సందర్బసంగా ఘనంగా సన్మానించటం జరిగింది.

BHADRADRI

కొత్తగూడెం లో ఆగష్టు 31న “ప్రజావాణి” అర్జీల స్వీకరణ)

భద్రాద్రి కొత్తగూడెం :ఆగష్టు 31:(పున్నమి ప్రతినిధి ):: ఆగస్టు 31 వ తేదీ, సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు ఉదయం 10గంటలకు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజలు తమ తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక ఫిర్యాదులను సమర్పించాలని సూచించారు. ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. సంబంధిత శాఖాధికారులు ప్రజల నుండి అందిన ఫిర్యాదులను వెంటనే స్వీకరించి, తగిన చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా జిల్లా ప్రజల సౌకర్యార్థం భద్రాచలం, సబ్ కలెక్టర్ కార్యాలయంలో, కొత్తగూడెం ఆర్డీవోకార్యాలయంలో,జిల్లాలోని అన్నీ మండల పరిషత్ కార్యాలయాలలో ప్రజావాణి నిర్వహించబడుతుందని తెలిపారు.కావున ప్రజలు ఈ అవకాశాన్నివినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో ఆదివారం కోరారు.

BHADRADRI

కొత్తగూడెం లొ 2వ దశ sir ప్రక్రియ ప్రారంభం

కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 28:(పున్నమి ప్రతినిధి ):: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం టౌన్ 29వ డివిజన్ లొ sir 2వ దశ కార్యక్రమం ప్రారంభమైంది.ఈ కార్యక్రమం లొ బీజేపీ కార్మిక సెల్ కో కన్వినర్ మరియు బూత్ ఇంచార్జి సబ్బానీ రాజేష్ పాల్గొని బూత్ స్థాయి అధికారులతో ఓటర్ల జాభితాని పరిశీలించారు.జాబితాలో నమోదైన వివరాలు కొత్తగా అర్హత పొందిన వారి పేర్లు నమోదు, మరణించిన వారి పేర్లు తొలగింపు, చిరునామా మార్పులు,ఇతర వివరాలో తప్పులు సవరణ వంటి అంశాలని పరిశీలించారు.అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడాలని రాజేష్ సూచించారు.అదే విధంగా అనర్హుల పేర్లు ఓకే వ్యక్తికి ఒకటి కంటే అనేక చోట్ల ఓటు ఉంటే వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి తొలగించేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రజలు కూడా తమ ఓటు వివరాలని పరిశీలించుకుని ఏమైన తప్పులు ఉంటే సంబంధిత అధికారులకి తెలియచేయాలనీ కోరారు.ఈ కార్యక్రమంలో భూత్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

BHADRADRI

ప్రముఖ యోగ గురువుకి జాతీయ నాయకులు అభినందన

కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 27:(పున్నమి ప్రతినిధి ): కొత్తగూడెం జిల్లా వాసి అయ్యిన స్థానిక కొత్తగూడెం వాస్తవ్యులు పట్టణ ప్రముఖ యోగ గురువు గుమ్ములాపురం సత్యనారాయణ గారికి ఇంటర్నేషనల్ యోగ డే సందర్బంగా బెంగుళూరు వారు నిర్వహించినయోగా ఛాంపియన్ షిప్ పోటీలో యోగ క్రీడాకారులగా ప్రధమ స్థానం అదేవిధంగా అనేక యోగ పోటీలకు విద్యార్థులని యోగ ఛాంపియన్ షిప్ పోటీలకి ప్రోత్సహించి పోటీలో పాల్గొనేటట్టు చేసినందుకు గాను బెంగుళూర్ వారు ది బెస్ట్ యోగ టీచర్ అవార్డు అందచేసినారు.అదేవిధంగా జాతీయ స్థాయి లొ యోగ ఛాంపియన్షిప్ప్ర ధమ స్థానం, బెస్ట్ యోగ టీచర్ గాను సౌత్ ఇండియా నుండి జరిగిన చెన్నై పోటీలయందు ప్రధమ స్థానం పొందినందుకు గాను మన కొత్తగూడెం విచ్చేసిన జాతీయ st కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ గారు అభినందనలు తెలియచేస్తూ ఆరోగ్యం కోసం అందరు తప్పనిసరిగా యోగ చెయ్యాలని కోరారు.

BHADRADRI

కొత్తగూడెం జిల్లా లేబర్ సెల్ co కన్వీనర్ గ సీనియర్ బీజేపీ నాయకులు సబ్బానీ రాజేష్ నియామకం

కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 24(పున్నమి ప్రతినిధి ):: సమగ్ర, సమీక్ష సీనియర్ నాయకుల సలహాల మేరకు భారతీయ జనతా పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర కన్వీనర్ శ్రీ అందె శ్రీరాములు గారి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లేబర్ సెల్ కో కన్వినర్ గ జిల్లాలో సీనియర్ నాయకులు అయ్యిన సబ్బానీ రాజేష్ గారిని నియమించటం జరిగింది.ఈ సందర్బంగా రాజేష్ గారు మాట్లాడుతూ నాకు ఇచ్చిన ఈ బాధ్యతని అంకిత భావంతో కార్మికుల సంక్షేమనికి సంస్థ బలోపేతానికి కృషిచేస్తానని పేర్కొన్నారు.ఈ నియామక ఉత్తర్వులు తక్షణమే అమలు లోకి వస్తుంది కావున పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పదా ధికారులు నియామకాన్ని గుర్తించి వారికీ పూర్తి సహకారం అందించవలసిందిగా కోరుచున్నారు..

బీజేపీ ఆధ్వర్యంలో ఫీ రియింబుర్స్మెంట్ ధర్నా

కొత్తగూడెం జిల్లా :ఆగస్ట్ 24:(పున్నమి ప్రతినిధి ): కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ లో బీజేపీ ఆధ్వర్యంలో ఫీజులు బకాయి బిజెపిలడాయి ధర్నా చెయ్యటంజరిగింది, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జాటోత్ వెంకన్న మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా కాంగ్రేస్ ప్రభుత్వం ఫీ రేయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయకపోవటం తో sc, st, bc మైనారిటీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.పెండింగ్ లో వున్నా 15000కోట్ల రూపాయిల వెంటనే విడుదల చెయ్యాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేసారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటినుండి ఫీ రియింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయకపోవటంతో ప్రయివేయేట్ కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల ఒరిజినల్ సిర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బండిపెడుతున్నారు.దీనివలన పేద విద్యార్థులు ఉన్నత చదువులకి వెళ్లలేకపోతున్నారని మండిపడ్డారు.పెండింగ్ లో ఉన్నబకాయిలు వెంటనే విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు..

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.