Thursday, 1 October 2026

Tag: కొత్తగూడెం

BHADRADRI

కొత్తగూడెం లో గోదావరి పైప్ లైన్ పనులు వేగవంతం…

కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 21(పున్నమి ప్రతినిధి ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం గణేష్ టెంపుల్ ఏరియా లైన్ లో గోదావరి పైప్ లైన్ తవ్వకాలు శర వేగంగా జరుగుతున్నాయి.గోదావరి నది నుండి సిటీ కి 24/7 తాగున్నీరు అందించే లక్ష్యం తో ఈ పైప్ లైన్ ప్రాజెక్ట్ ని ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా తీసుకుంది.ఇప్పటికే 50%పనులు పూర్తయినాయి అధికారులు మాట్లాడుతూ పైప్ లైన్ వేయటం తో భూగర్భ జలాలపై ఆధారపడటం తగ్గుతుందని ప్రతి ఇంటికి సురక్షిత మైన మంచినీరు అందుతుందని తెలిపారు.పనుల కారణంగా కొన్ని రోడ్లపై రవాణాకి ఆటంకం కలిగిన ప్రజలు సహకరించాలని కోరారు.మరో మూడు నెలలలో ప్రాజెక్ట్ పూర్తి చేసి ప్రజలకి త్రాగునీరు అందిస్తామని అధికారులు తెలిపారు..

BHADRADRI

సర్ కి రాజకీయ పార్టీ ల సహకారం అవసరం.. కలెక్టర్ అంకిత్

కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 19:(పున్నమి ప్రతినిధి )::ప్రత్యేక ఓటురు జాబిత సవరణ 2026 కార్యక్రమం లో రాజకీయ పార్టీ ల సహకారం అత్యంత కీలకం అని కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు.మరణించిన, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకి వలస వెళ్లిన,నివాసం మార్చుకున్న ఓటురు వివరాలని క్షేత్రస్థాయిలో ధ్రువీకరించి ఖచ్చితమైన ఓటురు జాబితా రూపొందించేందుకు రాజకీయ పార్టీలు సహకారించాలని కోరారు.బుధవారం ‘I D O C”కార్యాలయం లో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.భారత ఎన్నికల సంఘం ఏనుమరేషన్ ఫారాల సమర్పణకి గడువు పొడిగించిన సమక్షంలో మిగిలిన ప్రక్రియని వేగవంతంగా, నాణ్యతతో పూర్తిచేయ్యాలని అధికారులకి సూచించారు.

BHADRADRI

(C P I ఆధ్వర్యంలో సీత రామ ప్రాజెక్ట్ పరిశీలన )

కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 18:(పున్నమి ప్రతినిధి ):: సీతారామ, సీతమ్మ సాగర్ ప్రాజెక్టుల పురోగతి, నిధుల కేటాయింపు, చెరువుల అనుసంధానం తదితర అంశాలపై వాస్తవాలను ప్రజలకు వెల్లడించేందుకు ఆగస్టు 18న సీపీఎం ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకత్వం ప్రాజెక్టుల పరిశీలన చేపట్టనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక మంచికంటి భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 15 నాటికి తుమ్మల చెరువుకు సీతారామ కాలువ ద్వారా నీటిని అందించి 7.89 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించినప్పటికీ, ఆ హామీ ఆచరణలో నెరవేరలేదని విమర్శించారు. మంత్రుల హామీలను నమ్మి నార్లు పోసుకున్న రైతులకు నిరాశే మిగిలిందన్నారు.

BHADRADRI

(దడ పుట్టిస్తున్న వాయుగుండం )

కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 18:(పున్నమి ప్రతినిధి ):: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త తీవ్ర వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే ఆరు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఉత్తర వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలకు సమీపంలో కేంద్రీకృతమైన అల్పపీడనం కాస్త బలపడి వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం వాయువ్య దిశగా వేగంగా పయనిస్తోంది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా మారాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 18 నుంచి 23వ తేదీ వరకు ఆరు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. కోస్తాంధ్రా, రాయలసీమ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

BHADRADRI

(Brs పాలనా ఓ స్వర్ణయుగం… Mlc రవీందర్ )

కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 16:(పున్నమి ప్రతినిధి )::brs పాలనలో తెలంగాణ స్వర్ణయుగం అని అన్నీ వర్గాల ప్రజలకి సంక్షేమ పధకాలు అందించి ప్రజల బాగోగులు చుసిన వ్యక్తి మాజీ సీఎం కెసిఆర్ అని కొనియాడారు.పార్టీ శ్రేణులని ఉద్దేశిస్తూ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన మాట్లాడారు.ఒక వైపు దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలని స్మరించుకుంటూ మరో వైపు తెలంగాణాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేసారు.తెలంగాణ రాష్ట్ర సాధకుడు మాజీ సీఎం కెసిఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రం అన్నీ రంగాలలో అభివృద్ధి చెందిందని కొనియాడారు. ఈ సమావేసంలో brs నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

BHADRADRI

కొత్తగూడెం బీజేపీ కార్యాలయంలో ఘనంగా జెండావందనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 15:(పున్నమి ప్రతినిధి ):: కొత్తగూడెం లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బై రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జాతీయ జెండా కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా అధ్యక్షుల వారు జెండా ఎగరవేసి అమర వీరులకి నివాళులు అర్పించారు. అనంతరం దేశభక్తి గీతాలు వందేమాతరం, జనగణమన గీతాలు ఆలపించారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు బై రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారుమాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు, భాగతసింగ్భా, వీర్ సావర్కర్ , సుభాష్ చంద్ర బోస్సం లాంటి ఎందరో మహానుభావులు తన ప్రాణాలని అర్పించారాని, వాళ్ళ పోరాటాల ఫలితంగా మనకి స్వాతంత్రంవచ్చిందని ఈ సందర్బంగా తెలియచేసారు.అలాగే మనం కూడా ఈ దేశ సమగ్రత సర్వబొమత్వం కోసం ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు G V K మనోహర్ గారు లక్ష్మీదేవి పల్లి మండల అధ్యక్షులు నవీన్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శులు మండల అధ్యక్షులు మండల కార్యదర్శులు కార్యకర్తలు పాల్గొన్నారు…

BHADRADRI

కొత్తగూడెం లో RSS ఆధ్వర్యంలో యువశక్తి సమ్మేళనం.

కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 14:(పున్నమి ప్రతినిధి ): ఈరోజు కొత్తగూడెం లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో యువశక్తి సమ్మేళనం ఘనంగా జరిగింది.నగరం లోని కార్యస్థలి వద్దకి యువతీ యువకులు పెద్ద సంఖ్యలో హాజరు అయ్యారు.RSS తెలంగాణ ప్రాంత సహా కార్యవహా(D R D O సైంటిస్ట్ )శ్రీ ఎర్ర నరసింగరావు గారు మాట్లాడుతు జాతీయ భావాలు,సంస్కృతి సంప్రదాయాలు,, సమాజ సేవపై యువకీలకి అవగాహనా కల్పించారు.యువత దేశ నిర్మాణం లో ప్రముఖ పాత్ర పోషించాలని పిలిపునిచ్చారు.శారీరక క్రీడలు, యోగ ప్రదర్శనలు దేశ భక్తి గీతాలతో కార్యక్రమం ఆకట్టుకుంది.RSS జిల్లా కార్యవహులు మాట్లాడుతూ యువశక్తి తోనే బలమైన భారత్ నిర్మాణం సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో RSS కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

BHADRADRI

కొత్తగూడెం లో RSS ఆధ్వర్యంలో యువశక్తి సమ్మేళనం.

కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 14:(పున్నమి ప్రతినిధి ): ఈరోజు కొత్తగూడెం లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో యువశక్తి సమ్మేళనం ఘనంగా జరిగింది.నగరం లోని కార్యస్థలి వద్దకి యువతీ యువకులు పెద్ద సంఖ్యలో హాజరు అయ్యారు.RSS తెలంగాణ ప్రాంత సహా కార్యవహా(D R D O సైంటిస్ట్ )శ్రీ ఎర్ర నరసింగరావు గారు మాట్లాడుతు జాతీయ భావాలు,సంస్కృతి సంప్రదాయాలు,, సమాజ సేవపై యువకీలకి అవగాహనా కల్పించారు.యువత దేశ నిర్మాణం లో ప్రముఖ పాత్ర పోషించాలని పిలిపునిచ్చారు.శారీరక క్రీడలు, యోగ ప్రదర్శనలు దేశ భక్తి గీతాలతో కార్యక్రమం ఆకట్టుకుంది.RSS జిల్లా కార్యవహులు మాట్లాడుతూ యువశక్తి తోనే బలమైన భారత్ నిర్మాణం సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో RSS కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.