Wednesday, 30 September 2026

Tag: ఆర్మూర్

నిజామాబాద్

తిజ్ పండుగలో పాల్గొన్న ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్,,,

ఆర్మూర్ పట్టణంలో గురువారం జరిగిన తీజ్ పండుగ వేడుకల్లో ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే తీజ్ పండుగలో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ER ఫౌండేషన్ సభ్యులు రామ్ ప్రసాద్, అర్గుల్ సురేష్, దినేష్, తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్

పలు శుభకార్యాలకు పాల్గొన్న ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరావత్రి రాజశేఖర్

తేదీ:26-08-2026 బుధవారం నాడు ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ పలు వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బంధుమిత్రులను, శ్రేయోభిలాషులను కలిశారు. ఆయన వెంట ER ఫౌండేషన్ సభ్యులు అర్గుల్ సురేష్, దినేష్, బ్యాంక్ నవీన్, కర్తన్ నవీన్, తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్

అడవి మామిడిపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ భూమి పూజలో పాల్గొన్న వినయ్ కుమార్ రెడ్డి ……*

మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ భూమి పూజలో అడవిమామిడిపల్లి గ్రామ సర్పంచ్ లతా సాగర్ కలిసి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ ప్రారంభించిన *ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి …..* ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి శాలువాతో సత్కరించి గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించమని వినతి పత్రం ఇచ్చిన గ్రామ సర్పంచ్ మరియు గ్రామ కాంగ్రెస్ నేతలు…… ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ తరపున తప్పకుండా నిధులు మంజూరు చేయిస్తానని వాగ్దానం చేశారు.. *రాఖీ పండుగ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి రాఖీ కట్టి ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్న సర్పంచ్ కూన లతా సాగర్ గారు మరియు అడవి మామిడిపల్లి గ్రామ మహిళా మణులు….* ఈ కార్యక్రమంలో వారితో పాటు పాల్గొన్న మాక్లూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు దయాకర్ రావు , అడవి మామిడిపల్లి గ్రామ సర్పంచ్ లతా సాగర్ , ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ రఘు సొసైటీ చైర్మన్ ముల్లంగి అశోక్ చిన్నాపూర్ సర్పంచ్ చిన్న ,కౌన్సిలర్లు భూపేందర్ ప్రసాద్ గంగోలి ,వార్డు సభ్యులు మరియు కాంగ్రెస్ నాయకులు గంగాధర్ గౌడ్ ముల్లంగి అశోక్ , దామోదర్ , శివకృష్ణ, వెంకట్రావు, మోసిన్, రాకేష్ రెడ్డి చిట్టి రెడ్డి,శ్యామ్ గౌడ్సీ,నియర్ నాయకులు గోవర్ధన్, తదితర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అనుచరులు…

నిజామాబాద్

దేశంలో తొలి డబుల్-స్టాక్ కంటైనర్ రైలు*

భారతీయ రైల్వేలు దేశంలోనే తొలిసారిగా డబుల్-స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలును విజయవంతంగా నడిపి సరుకు రవాణా రంగంలో కీలక మైలురాయిని సాధించాయి. ఆగస్టు 21, 2026 రాత్రి 7 గంటలకు ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ (JNPT) నుంచి బయలుదేరిన ఈ రైలు వడోదర డివిజన్లోని వర్ణమా CONCOR GCT టెర్మినల్ వరకు 422 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, మొత్తం 360 TEUs కంటైనర్లను తరలించింది. ఈ ఆపరేషన్ ద్వారా భారీ స్థాయిలో కంటైనర్ సరుకును వేగంగా తరలించడంలో రైల్వేల సామర్థ్యం, టెర్మినల్ రద్దీ తగ్గింపు, తక్కువ రోలింగ్ స్టాక్ అవసరం, రైల్వే మార్గాల సామర్థ్యం మెరుగుదల, సరుకు రవాణా సమయం తగ్గింపు, తక్కువ రవాణా ఖర్చు, పర్యావరణ ప్రయోజనాలు వంటి అంశాలు స్పష్టమయ్యాయి.

నిజామాబాద్

ఆర్మూర్ పట్టణంలో చాయ్ పే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వినయ్ కుమార్ రెడ్డి …..*

ఆర్మూర్ పట్టణంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలతో చాయ్ పే చర్చా కార్యక్రమంలో పాల్గొని నియోజక వర్గం లో జరుగుతున్న అభివృద్ధి పనుల తీరు తెన్నులు ఇంకా చేయాల్సిన అభివృద్ధికి అవసరమైన నిధులు గురించి మరియు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చేయాల్సిన సూచనలను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతల వినతులను స్వీకరించిన *ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి …* మరియు వారితో పాటు పాల్గొన్న ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మరియు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ , నిజామాబాద్ డిసిసి సెక్రెటరీ సాయినాథ్ గౌడ్ ఆర్మూరు మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు శాంతి , కౌన్సిలర్లు నవీన్ , ప్రసాద్ గారు గంగోలి తాటి హనుమాన్లు కాంగ్రెస్ నాయకులు శాంతి, ఆర్మూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నాగరాజు , మాక్లూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు దయాకర్ రావు , కాంగ్రెస్ నాయకులు నూతల నారాయణరెడ్డి , చిట్టి రెడ్డి దేగాం శ్రీనివాస్ గౌడ్ , ఏలియా రెడ్డి ,గంగాధర్ గౌడ్ , రాము , వెంకటగిరి , పివిఆర్ శ్రీకాంత్ ……

నిజామాబాద్

ఇంకుడు గుంతలు ప్రారంభించిన సర్పంచ్,

*నందిపేట్ గ్రామంలో జలసిరి కార్యక్రమంలో భాగంగా రాజ్‌నగర్ (ధుబ్బా) ఎస్సీ హాస్టల్ వద్ద ఏర్పాటు చేస్తున్న వెర్టికల్ సోక్ పిట్ పనులకు నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం ముగ్గు పోసి పనులను ప్రారంభించారు.* *వెర్టికల్ సోక్ పిట్ ద్వారా వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేసి భూగర్భ జలాల (Ground Water) పెరుగుదలకు దోహదపడుతుంది. భవిష్యత్‌లో నీటి సంరక్షణకు ఇది ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం.* *ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామ్ చందర్, వార్డు సభ్యులు కాంతం చిన్నయ్య, చింత శ్రీనివాస్, నాయకులు భాస్కర్, గంగన్న తదితరులు పాల్గొన్నారు.* *గ్రామ అభివృద్ధి – నీటి సంరక్షణే మన లక్ష్యం.*

నిజామాబాద్

తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బిజెపి నాయకులు అబ్బగోని అశోక్ గౌడ్ సల్మానించారు,

తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ మండల కేంద్రంలో ఉన్నటువంటి చిత్తాపూర్ గ్రామంలో లింగన్న పాటిల్,పుత్రుడు వెంకటేష్ గౌడ,సంఘం సభ్యులకు రేణుక ఎల్లమ్మ గుడి కోసం తన సొంత స్థలాన్ని కేటాయించడం జరిగిందనీ తెలియజేశారు. వెంకటేష్ గారికి రేణుక ఎల్లమ్మ ఆశీస్సులు ఉండాలని సంఘ సభ్యులు ప్రజలు అందరూ కోరుకున్నారు అదేవిధంగా ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని రేణుక ఎల్లమ్మ ఆశీస్సులు ఉండాలని గౌడ సంఘం సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనకు గౌడ సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు.

నిజామాబాద్

శ్రీ జెండా బాలాజీ జాతర కి పాల్గొన్నఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్,

ఆదివారం ఆర్మూర్ పట్టణంలో శ్రీ బాలాజీ జండా జాతరలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి దయతో ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరూ బాగుండాలని స్వామివారిని వేడుకున్నారు. ప్రజలందరికీ శ్రీ బాలాజీ జండా జాతర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయనను సర్వ సమాజ్ అధ్యక్షులు కొట్టాల సుమన్ కార్యవర్గం సభ్యులతో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ER ఫౌండేషన్ సభ్యులు అర్గుల్ సురేష్, నూకల శేఖర్, కేవీ రమణ, వినోద్, దినేష్, బ్యాంకు నవీన్, నారా గౌడ్, విట్టోబ, శేఖర్, కర్తన్ నవీన్, గంగ మోహన్, తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్

*ఆర్మూర్ లో రైతుల ధర్నా మద్దతు తెలిపిన ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్*

*ఆర్మూర్ పట్టణంలో శనివారం రైతన్నలు చేపట్టిన ఆందోళనకు ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ మద్దతు తెలిపారు. యూరియా యాప్ వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.* *ఆర్మూర్ ప్రాంత రైతాంగం చైతన్యవంతులని ఆయన చెప్పుకొచ్చారు. యూరియా లేకపోతే పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. అన్నదాతలకు సరిపడా యూరియాను సరఫరా* *చేయాలని డిమాండ్ చేశారు. ఎకరానికి మూడు యూరియా సంచులు ఇవ్వాలని ప్రభుత్వాలను, నాయకులను కోరారు. అన్నదాతల పట్ల నిర్లక్ష్యం సరికాదన్నారు. యూరియా విషయంలో ప్రభుత్వాలు, పాలకుల నిర్లక్ష్యాన్ని తాము ఖండిస్తున్నామన్నారు.* *ఇకనైనా రైతన్నల ఆవేదనను ప్రభుత్వాలు అర్థం చేసుకొని సరిపడా యూరియా అందించాలన్నారు. *రైతులు పండించే పంటలను కాపాడాలన్నారు. రైతులకు 100 శాతం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు తాము ఎప్పుడు మద్దతుగా ఉంటామని ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ స్పష్టం చేశారు. ER ఫౌండేషన్ సభ్యులు అర్గుల్ సురేష్, రామ్ చందర్, నూకల శేఖర్, వినోద్, దినేష్, శ్రావణ్, కర్తన్ నవీన్, తదితరులు ఉన్నారు.*

నిజామాబాద్

నల్గొండ జిల్లాలో ఇటీవల హత్యకు గురైన ప్రిన్సిపల్ రూపా రెడ్డి చిత్రపటానికి,

తేదీ:21-08-2026 శుక్రవారం నాడు ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద PDSU ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రిన్సిపాల్ రూపా రెడ్డి మృతికి కారణమైన కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. యువత చెడు వ్యసనాలకు అలవాట్ల బారిన పడకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో PDSU జిల్లా అధ్యక్షుడు నరేందర్, PDSU నాయకులు నికిల్, ER ఫౌండేషన్ సభ్యులు అర్గుల్ సురేష్, రామ్ చందర్, నూకల శేఖర్, రజనీష్ కిరాడ్, వినోద్, దినేష్, నారా గౌడ్, విట్టోబ శేఖర్, బ్యాంక్ నవీన్, కర్తన్ నవీన్, కాకతీయ శీను, చందూ, శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.