Wednesday, 30 September 2026
  • Home  
  • ఈసారి సిరిసిల్ల గడీపై గురిపెడదాం.. మనమే పిరంగులమై పాలిద్దాం
- రాజన్న సిరిసిల్ల

ఈసారి సిరిసిల్ల గడీపై గురిపెడదాం.. మనమే పిరంగులమై పాలిద్దాం

ఈసారి సిరిసిల్ల గడీపై గురిపెడదాం.. మనమే పిరంగులమై పాలిద్దాం సిరిసిల్ల గడ్డపై మూడు రంగుల కాంగ్రెస్‌ జెండా ఎగరాలి: సీఎం రేవంత్‌రెడ్డి రాజన్న సిరిసిల్ల, సెప్టెంబరు 30 (పున్నమి ప్రతినిధి): ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి సిరిసిల్లకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి భారీగా తరలివచ్చిన ప్రజలతో సిరిసిల్ల జనసంద్రంగా మారింది. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావించడంతో పాటు రాజకీయ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. “ఈసారి సిరిసిల్ల గడీ మీద గురిపెడదాం.. మనమే పిరంగులమై పాలిద్దాం” అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గత పదేళ్ల పాలనలో సిరిసిల్ల ప్రజలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ప్రజలు వేసిన ఓట్లను అధికారంలో ఉన్నవారు తమ ఆస్తుల పెంపునకు ఉపయోగించుకున్నారని విమర్శించారు. “సిరిసిల్ల గడ్డమీద మూడు రంగుల కాంగ్రెస్‌ జెండా ఎగరవేయండి.. ఆ బిడ్డను మంత్రిని చేసి చూపిస్తా” అని సీఎం రేవంత్‌రెడ్డి సభలో అన్నారు. రానున్న శాసనమండలి ఎన్నికల్లో నేతన్న బిడ్డను శాసనమండలి సభ్యుడిగా చేద్దామని యువతకు, ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల గడ్డపై కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపిస్తే, ఆ కార్యకర్తను రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా చేసుకుందామని ప్రజలకు హామీ ఇచ్చారు. నేతన్నలు, రైతులు, గీత కార్మికులు, మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని సీఎం తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ తెలంగాణను ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. కోనరావుపేటలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌కు శంకుస్థాపనతో పాటు సిరిసిల్ల ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టారు. నేతన్నలకు మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించేందుకు నేతన్న బజార్‌ వంటి కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. నేరెళ్ల బాధితులకు చెక్కులు అందించడంతో పాటు గల్ఫ్‌లో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని సీఎం వెల్లడించారు. మహిళలకు బతుకమ్మ చీరలు అందిస్తామని తెలిపారు. సిరిసిల్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

ఈసారి సిరిసిల్ల గడీపై గురిపెడదాం.. మనమే పిరంగులమై పాలిద్దాం

సిరిసిల్ల గడ్డపై మూడు రంగుల కాంగ్రెస్‌ జెండా ఎగరాలి: సీఎం రేవంత్‌రెడ్డి

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబరు 30 (పున్నమి ప్రతినిధి):
ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి సిరిసిల్లకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి భారీగా తరలివచ్చిన ప్రజలతో సిరిసిల్ల జనసంద్రంగా మారింది. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావించడంతో పాటు రాజకీయ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

“ఈసారి సిరిసిల్ల గడీ మీద గురిపెడదాం.. మనమే పిరంగులమై పాలిద్దాం” అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గత పదేళ్ల పాలనలో సిరిసిల్ల ప్రజలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ప్రజలు వేసిన ఓట్లను అధికారంలో ఉన్నవారు తమ ఆస్తుల పెంపునకు ఉపయోగించుకున్నారని విమర్శించారు.

“సిరిసిల్ల గడ్డమీద మూడు రంగుల కాంగ్రెస్‌ జెండా ఎగరవేయండి.. ఆ బిడ్డను మంత్రిని చేసి చూపిస్తా” అని సీఎం రేవంత్‌రెడ్డి సభలో అన్నారు. రానున్న శాసనమండలి ఎన్నికల్లో నేతన్న బిడ్డను శాసనమండలి సభ్యుడిగా చేద్దామని యువతకు, ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల గడ్డపై కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపిస్తే, ఆ కార్యకర్తను రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా చేసుకుందామని ప్రజలకు హామీ ఇచ్చారు.

నేతన్నలు, రైతులు, గీత కార్మికులు, మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని సీఎం తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ తెలంగాణను ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు.

కోనరావుపేటలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌కు శంకుస్థాపనతో పాటు సిరిసిల్ల ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టారు. నేతన్నలకు మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించేందుకు నేతన్న బజార్‌ వంటి కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.

నేరెళ్ల బాధితులకు చెక్కులు అందించడంతో పాటు గల్ఫ్‌లో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని సీఎం వెల్లడించారు. మహిళలకు బతుకమ్మ చీరలు అందిస్తామని తెలిపారు. సిరిసిల్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.