Monday, 28 September 2026

Tag: అనకాపల్లి జిల్లా

అనకాపల్లి

యలమంచిలి మున్సిపల్ ఎన్నికలపై వైఎస్సార్సీపీ కసరత్తు

వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపికపై ఆశావహులతో కీలక సమావేశం పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో) యలమంచిలి: రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యలమంచిలి వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ ప్రభుత్వ విప్, నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అధ్యక్షతన ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహంపై చర్చించారు. మాజీ మంత్రి, రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి, నియోజకవర్గ పరిశీలకుడు కోలా గురువులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని బొడ్డేడ ప్రసాద్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, వార్డు అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అనకాపల్లి

చోడపల్లిలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు

అన్నసమారాధనలో పాల్గొని భక్తులకు స్వయంగా అన్నదానం చేసిన AP RDC చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో) అచ్యుతాపురం మండలం చోడపల్లి గ్రామంలో శ్రీ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గణేష్ మండపం వద్ద నిర్వహించిన భారీ అన్నసమారాధన కార్యక్రమానికి AP RDC చైర్మన్, ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, అనంతరం భక్తులకు ప్రసాదం, అన్నాన్ని స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అనకాపల్లి

కట్టుపాలెంలో నూతన గృహాలు మంజూరు.. లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ

పేదల సొంతింటి కలకు మరో అడుగు! పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో) యలమంచిలి: యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ ఆదేశాల మేరకు యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు కట్టుపాలెంలో నూతనంగా గృహాలు మంజూరైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. కూటమి నాయకులు లబ్ధిదారులకు గృహాల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గృహాలు మంజూరైన లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

అనకాపల్లి

పేదల సొంతింటి కలకు మరో అడుగు!

నూతన గృహాలు మంజూరైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో) యలమంచిలి: యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆదేశాల మేరకు నూతన గృహాలు మంజూరైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డు రామరాయుడుపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో కూటమి నాయకులు లబ్ధిదారులకు గృహాల మంజూరు ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.

అనకాపల్లి

భగత్‌సింగ్ ఆశయాల సాధనకు యువత పోరాడాలి

అచ్చుతాపురంలో ఘనంగా 119వ జయంతి వేడుకలు.. విగ్రహానికి పూలమాల వేసి నివాళులు పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో) అచ్చుతాపురం: భగత్‌సింగ్ 119వ జయంతి వేడుకలను CITU ఆధ్వర్యంలో అచ్చుతాపురం కొత్త మోసయ్యపేట గ్రామం వద్ద ఘనంగా నిర్వహించారు. అక్కడి భగత్‌సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా CITU జిల్లా కార్యదర్శి ఆర్. రాము మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం అతి చిన్న వయసులోనే భగత్‌సింగ్ ప్రాణత్యాగం చేశారని, ఆయన కలలుగన్న దోపిడీ లేని సమాజం కోసం నేటి యువత పోరాడాలని పిలుపునిచ్చారు. ఉపాధి, విద్య, వైద్యం అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే విధానాలతో నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, యువత భవిష్యత్తు కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిస్తూ యువత ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కొత్తూరు యూత్ నాయకులు పాము రమణ, కిల్లాడి చిన్న, శెట్టి చిన్న, నాగ, మత్స్యకార కార్మిక సంఘం నాయకులు చేపల తాతయ్య తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

తూర్పు కాపు కల్యాణ మండపం నిర్మాణం పూర్తిచేస్తాం..!

కాపు జేఏసీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి నాగేశ్వరరావు : పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో ) యలమంచిలి తూర్పు కాపుల సంక్షేమం కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులందరూ కలిసి పనిచేయాలని కాపు జేఏసీ కన్వీనర్‌ ద్వారపురెడ్డి నాగేశ్వరరావు అన్నారు. ఎలమంచిలిలో గతంలో శంకుస్థాపన చేసి, మధ్యలో నిలిచిపోయిన తూర్పు కాపు కల్యాణ మండపం నిర్మాణాన్ని ప్రజాప్రతినిధులతో మాట్లాడి పూర్తిచేసేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఆదివారం ఎలమంచిలి ధర్మవరంలో తూర్పు కాపు సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ద్వారపురెడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూ, తూర్పు కాపుల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా నాయకులంతా సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. కల్యాణ మండపం నిర్మాణం పూర్తయితే సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు వివిధ శుభకార్యాల నిర్వహణకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. తూర్పు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తూర్పు కాపు సమన్వయ కమిటీ అధ్యక్షుడు శెలంశెట్టి సూర్య ప్రకాష్‌, ఎక్స్ సర్వీస్ మేన్ నక్కా శివ శంకర రావు, యలమంచిలి పట్టణ కాపు సంక్షేమ భరోసా కేంద్రం కన్వీనర్ తేటకల వెంకట సూర్య ప్రకాష్, వాగ్దేవి కళాశాల ప్రిన్సిపాల్‌ అడపా శేషగిరి తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

ఏటికొప్పాక పంచాయతీలో స్క్రాప్ సైకిళ్లకు బహిరంగ వేలం!

రూ.1,000 డిపాజిట్‌తో అవకాశం.. బుధవారం 12 గంటలకు వేలం పాట పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో) ఏటికొప్పాక: గ్రామపంచాయతీ పరిధిలో వినియోగానికి పనికిరాకుండా ఉన్న డ్రై సైకిళ్లను స్క్రాప్‌గా బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు గ్రామపంచాయతీ కార్యదర్శి కె. గిరిప్రసాద్ తెలిపారు. ఈనెల 30వ తేదీ బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వేలంలో పాల్గొనదలచిన వారు రూ.1,000 డిపాజిట్ చెల్లించి నమోదు చేసుకోవాలి. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి వేలం పాట నిర్వహించనున్నారు. వేలంలో పాల్గొనే పాటదారులు నిర్ణయించిన నిబంధనల ప్రకారం బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చు. వేలం దక్కించుకున్న వారు పాట అనంతరం మెటీరియల్‌కు సంబంధించిన పూర్తి మొత్తాన్ని చెల్లించి, రసీదు/అనుమతులు పొందిన తర్వాత స్క్రాప్ మెటీరియల్‌ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు నిర్ణీత సమయానికి పంచాయతీ కార్యాలయానికి హాజరై వేలం ప్రక్రియలో పాల్గొనాలని కార్యదర్శి సూచించారు.

అనకాపల్లి

గోవాడ ఫ్యాక్టరీను తెరవాలి.. రైతుల బకాయిలు చెల్లించాలి!

చక్కెర కర్మాగారాల భూముల నగదీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: అమర్నాథ్, ధర్మశ్రీ పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో ) విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడారు. సహకార చక్కెర కర్మాగారాల భూముల నగదీకరణకు సంబంధించిన ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గోవాడ చక్కెర కర్మాగారంపై ఆధారపడుతున్న రైతులకు, ఉద్యోగులకు పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. గోవాడ ఫ్యాక్టరీకి రైతులు, కార్మికులతో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించాలని వారు పేర్కొన్నారు. కర్మాగార ఆస్తులను విక్రయించి బకాయిలు చెల్లించడం కాకుండా ప్రభుత్వం నిధులు సమకూర్చాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై ఈ నెల 29న వైఎస్సార్‌సీపీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు తెలిపారు.

అనకాపల్లి

ఉప్పుటేరులో మునిగిన చైన్ మిషన్లు.. రంగంలోకి దిగిన ఎమ్మెల్యే!

పూడిమడకలో సుందరపు విజయ్‌కుమార్‌ పర్యటన.. మిషన్ల వెలికితీతకు ప్రత్యేక రిస్క్ ఆపరేషన్ పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో ) పూడిమడక: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలోని ఉప్పుటేరును ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌ పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా ఉప్పుటేరులో ఇసుక తవ్వకాలకు వినియోగిస్తున్న రెండు చైన్ మిషన్లు నీటిలో మునిగి చిక్కుకుపోయిన నేపథ్యంలో స్థానిక కూటమి నాయకులతో కలిసి పరిస్థితిని పరిశీలించారు. మునిగిపోయిన రెండు మిషన్లను సురక్షితంగా బయటకు తీసేందుకు జిల్లా కలెక్టర్, రాష్ట్ర హోంమంత్రి, మత్స్యశాఖ అధికారులతో మాట్లాడి ప్రత్యేక రిస్క్ ఆపరేషన్ చేపట్టేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. పూడిమడకలో జట్టి నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామని, అప్పటివరకు మత్స్యకారుల బోట్లు రాకపోకలు సాగించేందుకు తాత్కాలిక సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకారుల రాకపోకలకు సీసీ లేదా గ్రావెల్ రోడ్డు, అవసరమైన విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. హామీలపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు.

అనకాపల్లి

దుప్పటికి చుట్ట మంటలు.. మహిళ మృతి!

ఎలమంచిలిలో విషాద ఘటన.. ప్రమాదవశాత్తు జరిగిందా? పోలీసుల దర్యాప్తు పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో) యలమంచిలి: ఎలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరభద్రస్వామి గుడి సమీపంలో శుక్రవారం రాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. కోరుకొండ సన్యాసమ్మ (65) ఇంట్లో ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకుని మృతి చెందారు. రాత్రి సుమారు 11.30 గంటలకు ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి బంధువు కిల్లాడి చిన్నా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సన్యాసమ్మకు చుట్ట తాగే అలవాటు ఉండేదని, తరచూ మంచంపై పడుకుని దుప్పటి కప్పుకుని చుట్ట కాల్చుకునేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. చుట్ట నుంచి దుప్పటికి మంటలు అంటుకోవడంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.