Tuesday, 22 September 2026

Tag: అనకాపల్లి జిల్లా

అనకాపల్లి

రైల్వే స్టేషన్ జంక్షన్‌లో రైల్ ఇంజన్ నమూనా పనులకు శ్రీకారం..

అనకాపల్లి: పున్నమి ప్రతినిధి ఆనంద్ : జీవీఎంసీ 83వ వార్డులోని భీమునిగుమ్మం రైల్వే స్టేషన్ జంక్షన్ వద్ద, రైల్వే స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేయనున్న రైల్ ఇంజన్ నమూనా పనులను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే శ్రీ కొణతాల రామకృష్ణ పాల్గొని జీవీఎంసీ అధికారులకు పలు సూచనలు చేశారు. జీవీఎంసీ జోనల్ కమిషనర్ చక్రవర్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్, 83వ వార్డు జనసేన పార్టీ ఇంచార్జ్ మంగా ఈశ్వర్, వార్డు టీడీపీ అధ్యక్షుడు రామకృష్ణ, నూకాంబిక దేవస్థానం ధర్మకర్త పొలిమేర ఆనంద్, కోట్ని రామకృష్ణ, తలారి లక్ష్మీప్రసాద్, జిల్లా తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు కాయల ప్రసన్న, షేక్ రియాజ్, బూత్ ఇంచార్జ్ సిమిటి రామకృష్ణ, బెల్లాన శ్రీనివాస్, టీడీపీ మీడియా కోఆర్డినేటర్ భానుచంద్ అఖిల్ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.

అనకాపల్లి

యలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘పరివర్తన’ అవగాహన సదస్సు

యలమంచిలి :పున్నమి ప్రతినిధి ఆనంద్ : ​యలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం, అనకాపల్లికి చెందిన సీడ్ అర్గనైజేషన్ వ్యసన విముక్తి కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా ‘పరివర్తన’ అనే అవగాహన సదస్సును నిర్వహించారు. ​ఈ సదస్సులో భాగంగా యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉండాలని, మత్తు పదార్థాల వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్ప్రభావాల గురించి విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. అలాగే డ్రగ్స్ వ్యసనం నుండి బయటపడేందుకు చేపట్టాల్సిన డి-అడిక్షన్ చర్యలు, వ్యసన విముక్తి కేంద్రాల ద్వారా అందుబాటులో ఉన్న సేవలపై సవివరంగా అవగాహన కల్పించారు. ​మత్తు రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ వి. చిట్టిబాబు, డాక్టర్ కె. సుజాతలతో పాటు కళాశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అనకాపల్లి

30 వేల ఆర్థిక సాయం అండిచిన’మన ధర్మవరం’ గ్రూప్ సభ్యులు,

పున్నమి ప్రతినిధి ఆనంద్ : ​యలమంచిలి : పాముకాటుకు గురై అకాల మరణం చెందిన ఓ వ్యక్తి కుటుంబానికి స్థానిక యవకులు, స్నేహితులు అండగా నిలిచారు. యలమంచిలిలోని ధర్మవరం వీధికి చెందిన చిక్కాల సురేశ్ సెప్టెంబర్ 6న పాముకాటుకు గురై మృతి చెందారు. కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ‘మన ధర్మవరం’ గ్రూప్ సభ్యులు, స్నేహితులు ముందుకొచ్చారు. ​సభ్యులంతా కలిసి రూ. 30,000 ఆర్థిక సాయాన్ని సేకరించి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కష్టసమయంలో తమవంతు సాయంగా ఈ మొత్తాన్ని సమకూర్చినట్లు గ్రూప్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ సభ్యులు కొటారు దుర్గారావు, తాటిపాకల చిన్ని, కన్నూరు శేషు, కొటారు శ్యాము తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

లీకేజీతో తాగునీరు వృథా.. యలమంచిలి మున్సిపాలిటీ నిర్లక్ష్యం!

పున్నమి ప్రతినిధి ఆనంద్: యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేట వీధిలో తాగునీటి కొళాయి పైపులైన్ లీకేజీతో విలువైన నీరు వృథాగా పోతోంది. లింగం డాక్టర్ ఇంటి ఎదురుగా, మామిడి కొండయ్య వీధిలో లీకేజీల కారణంగా నీరు రోడ్డుపైకి చేరి నిలిచిపోతోంది. మరోవైపు కాలువల్లో పారిశుద్ధ్యం లోపించడంతో దుర్వాసన, అపరిశుభ్రత నెలకొన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లీకేజీ విషయాన్ని మున్సిపల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని వారు ఆరోపిస్తున్నారు. రోడ్లపై నీరు నిలవడంతో బురద, చెత్త పేరుకుపోయి దోమలు, ఈగల బెడద పెరిగే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఉన్న సమయంలో పైపులైన్ ద్వారా నీరు వృథా కావడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే లీకేజీలను అరికట్టి, నిల్వ నీటిని తొలగించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.

అనకాపల్లి

కరువుతో అల్లాడుతున్న ప్రజలకు ఉపాధి కల్పించాలి, సిఐటియు

పున్నమి ప్రతినిధి ఆనంద్ : అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని, రైతాంగం, వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కల్పించి గ్రామీణ ప్రజలను ఆదుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ .రాము డిమాండ్ జిల్లాలో ఖరీఫ్ సీజన్ లో 60% వరకు వర్షాభావం ఏర్పడింది.రిజర్వాయర్లలో నీటి మట్టం అడుగంటింది. భూగర్భ జలాలు 300 అడుగులకు పడిపోయాయి.పనులు లేక అనకాపల్లి జిల్లాలో వేలాది మంది వ్యవసాయ కూలీలు, వలస వెళ్ళే పరిస్థితి నెలకొంది ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించి పేదలను ఆదుకోవాలని అనకాపల్లి జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి తక్షణ సహాయ చర్యలు తీసుకొని సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని ఎకరానికి 25000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్

అనకాపల్లి

దాడి వీరునాయుడు కళాశాలలో ఓసియన్ లిట్రసి అవేర్నెస్ ప్రోగ్రాం..

అనకాపల్లి పున్నమి ప్రతినిధి (ఆనంద్ ) దాడి వీరునాయుడు కళాశాలలో సెంటర్ ఫర్ స్టడీస్ ఆన్ బే ఆఫ్ బెంగాల్, ఆంధ్ర విశ్వవిద్యాలయం మరియు ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓసియన్ లిట్రసి అవేర్నెస్ ప్రోగ్రాం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ INCOIS శాస్త్రవేత్త డాక్టర్ స్నేహజా గారు విచ్చేసి విద్యార్థులకు సముద్రం మానవాళిపై చూపే ప్రభావము మరియు సముద్రం మీద మనకంటూ ఉన్న ప్రభావం గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సముద్రం మన వాతావరణాన్ని, జీవనాధారాన్ని ఎలా నియంత్రిస్తుందో తెలియజేశారు. మానవులు చేసే కార్యకలాపాలు సముద్రం యొక్క ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో వివరించారు. సముద్ర వనరులను మానవాళికి ఎలా ఉపయోగించుకోవాలో ఎలా కాపాడుకోవాలో ఈ అవగాహన కార్యక్రమంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కోరుబిల్లి రమేష్, వైస్ ప్రిన్సిపల్ ఎస్ దయా మాధురి, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.

అనకాపల్లి

22ఏ నుంచి గొలగాం భూములను తొలగించాలి..!

పున్నమి ప్రతినిధి ఆనంద్ : గొలగాం సర్వే నంబర్‌ 137/3లోని భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. గురువారం అనకాపల్లి తహశీల్దార్‌ కార్యాలయం వద్ద బాధిత భూ యజమానులతో కలిసి సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ.. 2012లో సమృద్ధి వెంచర్‌లో ప్లాట్లు కొనుగోలు చేసి, సబ్బవరం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న భూములను ప్రస్తుతం 22ఏలో చేర్చడం అన్యాయమన్నారు. అప్పట్లో కలెక్టర్‌ కార్యాలయం నుంచి ఎన్‌ఓసీ కూడా జారీ అయిందని తెలిపారు. రిజిస్ట్రేషన్‌ పత్రాలు, లింక్‌ డాక్యుమెంట్లు, ఎన్‌ఓసీలను పరిశీలించి సమగ్ర సర్వే నిర్వహించి అర్హులైన భూ యజమానుల భూములను 22ఏ నుంచి తొలగించాలని కోరారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే తహశీల్దార్‌ కార్యాలయం వద్ద వంటా వార్పు చేపట్టి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం గాజువాక జోన్‌ కార్యదర్శి ఎం.రాంబాబు, అనకాపల్లి మండల కన్వీనర్‌ గంట శ్రీరామ్‌, డి.రమణ, గొలగాం భూ యజమానులు పాల్గొన్నారు.

అనకాపల్లి

ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు..!

చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన జిల్లా ఎస్పీ, పోలీస్ అధికారులు అనకాపల్లి, సెప్టెంబర్ 17: ​పున్నమి ప్రతినిధి ఆనంద్ శిల్పకళ, వాస్తుశాస్త్రం, యంత్ర సాంకేతికతకు ప్రతీక అయిన దేవశిల్పి శ్రీ విశ్వకర్మ జయంతి వేడుకలను అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్, విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ​ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… శ్రీ విశ్వకర్మను ప్రపంచ తొలి వాస్తుశిల్పిగా, నిర్మాణ శాస్త్రానికి (ఆర్కిటెక్చర్) ఆద్యుడిగా పురాణాలు అభివర్ణిస్తున్నాయని గుర్తుచేశారు. ద్వారక వంటి అద్భుత నగరాల నిర్మాణంతో పాటు దేవతల ఆయుధాలు, రథాలను తీర్చిదిద్దిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు.​శ్రమజీవులందరికీ విశ్వకర్మ స్ఫూర్తిప్రదాత: కేవలం దేవతల శిల్పి మాత్రమే కాక, కష్టపడి పనిచేసే ప్రతి కార్మికుడు, శిల్పి, వడ్రంగి, ఇంజనీర్, పారిశ్రామికవేత్త వెనుక ఉన్న నిజమైన ప్రేరణ శ్రీ విశ్వకర్మ.ఆధునిక సాంకేతికతకు మార్గదర్శకం: నేటి ఆధునిక యుగంలోనూ ఆయన ప్రదర్శించిన సృజనాత్మకత, నైపుణ్యం ఎంతో ఆచరణీయం.నైపుణ్యమే విజయం: కష్టపడే తత్వం, అంకితభావం, పట్టుదల ఉంటే ఎంతటి క్లిష్టమైన పనులనైనా అద్భుతంగా సాధించవచ్చనే సందేశాన్ని విశ్వకర్మ జీవితం నేర్పుతుంది. ​కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహనరావు, డీఎస్పీ శ్రీ కె.రవికుమార్, సీఐలు బాల సూర్యరావు, లక్ష్మి, అప్పలనాయుడు, శ్రీనివాసరావు, రామకృష్ణారావు, మన్మధరావు, ఏ.వో సి.హెచ్.తిలక్ బాబు తదితర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని శ్రీ విశ్వకర్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

అనకాపల్లి

విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాం

పున్నమి ప్రతినిధి ఆనంద్ : విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాం: అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆర్థిక ప్రయోజనాలు, కారుణ్య నియామకాల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశం అనకాపల్లి, సెప్టెంబర్ 17: విధులు నిర్వహిస్తూ అకాల మరణం చెందిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు స్పష్టం చేశారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులతో ఎస్పీ గారు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ​ఈ సందర్భంగా బాధితుల సమస్యలను ఆయన ఒక్కొక్కరిగా అడిగి తెలుసుకున్నారు. వారికి ప్రభుత్వం నుంచి రావలసిన జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, ఫ్యామిలీ పెన్షన్ తదితర ఆర్థిక ప్రయోజనాలతో పాటు కారుణ్య నియామకాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దస్త్రాలను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సాంకేతిక, రికార్డుపరమైన సమస్యలను వెంటనే సరిదిద్ది బాధితులకు న్యాయం చేయాలని స్పష్టం చేశారు. ​ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ… “విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది త్యాగాలు మరువలేనివి. వారి కుటుంబాల సంక్షేమానికి మా ప్రథమ ప్రాధాన్యత. మీరంతా మా పోలీస్ కుటుంబ సభ్యులే. మీకు ఏ విధమైన సమస్యలు, ఇబ్బందులు ఉన్నా ఎలాంటి సంకోచం లేకుండా నేరుగా నన్ను కలవవచ్చు. శాఖాపరంగా అన్ని విధాలా మీకు అండగా ఉంటాం,” అని భరోసా ఇచ్చారు. ​ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహన రావు, డీఎస్పీ శ్రీ కె.రవికుమార్, సీఐలు బాల సూర్యరావు, రామకృష్ణారావు, మన్మధరావు, కార్యాలయ పరిపాలనాధికారి (ఏవో) శ్రీ సి.హెచ్.తిలక్ బాబు, ఆఫీస్ సూపరింటెండెంట్ దేవరాజు, ఎస్సై హరినాథ్ మరియు ఇతర పోలీస్ అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

అనకాపల్లి

అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

అనకాపల్లి పట్టణం, సెప్టెంబర్ 17:పున్నమి ప్రతినిధి అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులు, రిసెప్షన్ కౌంటర్, లాకప్ గదులను పరిశీలించిన ఎస్పీ, పెండింగ్ కేసుల పురోగతి మరియు స్టేషన్ నిర్వహణ తీరుపై అధికారులతో సమీక్షించారు.​ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు రౌడీ షీటర్లపై కఠిన నిఘా: పట్టణ పరిధిలోని రౌడీ షీటర్లు, పాత నేరస్థుల కదలికలపై నిరంతరం కన్నేసి ఉంచాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.పగలు, రాత్రి గస్తీ (బీట్ సిస్టమ్): రద్దీ ప్రాంతాలు, సున్నితమైన ప్రాంతాల్లో విజిబుల్ పోలీసింగ్ పెంచాలని, రాత్రి వేళల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేసి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని ఆదేశించారు.సీసీటీవీ కెమెరాల నిఘా: పట్టణంలోని ప్రధాన కూడళ్లు, వీధుల్లో నిఘా నేత్రాలను మరింత బలోపేతం చేయాలని, వ్యాపార సంస్థలు మరియు కాలనీల్లోనూ సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.​ మహిళా భద్రత & శక్తి యాప్: మహిళలు, యువతుల రక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి యాప్ వినియోగంపై విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించాలి. మహిళా చట్టాలపై ప్రతి ఒక్కరికీ స్పష్టత ఉండేలా చూడాలని పేర్కొన్నారు.​ సైబర్ నేరాలపై చైతన్యం: రోజురోజుకూ పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని, సైబర్ ఫిర్యాదులు రాగానే తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం: స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించి ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ​ఈ కార్యక్రమంలో అనకాపల్లి టౌన్ సీఐ జి.ప్రేమ కుమార్, ఎస్సైలు షేక్ జిలాని, వెంకటేశ్వరరావు, భాస్కరరావు మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.