Monday, 14 September 2026

Tag: #Visakhapatnam

విశాఖపట్నం

సామవేదం షణ్ముఖ శర్మకు కొప్పరపు కవుల జాతీయ ప్రతిభా పురస్కారం

వైభ‌వంగా ”ష‌ణ్ముఖ శ‌ర్మ‌’కు ‘కొప్ప‌ర‌పు’ క‌వుల జాతీయ ప్ర‌తిభా పుర‌స్కార ప్ర‌దానం -శ్రీ కొప్ప‌ర‌పు సోద‌ర క‌వుల శ‌తావ‌ధాన సౌంద‌ర్యం (శ్రీం) గ్రంధావిష్క‌ర‌ణ‌ -బ్ర‌హ్మ‌శ్రీ‌ సామ‌వేదంచే కొప్ప‌ర‌పు క‌వుల ‘దైవ‌సంక‌ల్పం’ కావ్యంపై ప్ర‌వ‌చ‌నం ప్ర‌ఖ్యాత ప్ర‌వ‌చ‌నకారులు బ్ర‌హ్మ‌శ్రీ సామ‌వేదం ష‌ణ్ముఖ శ‌ర్మ ప్ర‌తిష్ఠాత్మ‌క కొప్ప‌ర‌పు క‌వుల జాతీయ‌ప్ర‌తిభా పుర‌స్కారం-2026 అందుకున్నారు. బుధ‌వారం సాయంత్రం విశాఖ‌లోని క‌ళాభార‌తి ఆడిటోరియంలో అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌రిగిన కొప్ప‌ర‌పు క‌వుల క‌ళాపీఠం 24వ వార్షికోత్స‌వ వేడుక‌లో అతిథులుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ అత్యున్న‌త న్యాయ‌స్థానం న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ బి. కృష్ణ మోహ‌న్‌, విశ్రాంత న్యాయ మూర్తి జ‌స్టిస్ దుర్గా ప్ర‌సాద్‌, ఆచార్య విశ్వ‌నాథ గోపాలకృష్ణశాస్త్రి, ఆచార్య తాడేప‌ల్లి ప‌తంజ‌లిశాస్త్రి అమెరికాకు చెందిన ప్ర‌ఖ్యాత హృద్రోగ నిపుణులు డాక్ట‌ర్ ఆళ్ల శ్రీ‌నివాస రెడ్డి త‌దిత‌రుల చేతుల మీదుగా ఈ పుర‌స్కార ప్ర‌దానం జ‌రిగింది. ఈ మ‌హ‌త్త‌ర స‌భాకార్య‌క్ర‌మానికి ఆచార్య బేత‌వోలు రామ బ్ర‌హ్మం అధ్య‌క్షులుగా వ్య‌వ‌హ‌రించారు. ఆయన తన అధ్యక్షోపన్యాసంలో కొప్పరపుకవుల పద్యవేగం ధారం కృత్రిమ మేథ సాయంతో లభ్యమయ్యే సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరలో అందుబాటులోకి తెచ్చే మాశర్మ కల నిజం కావాలని ఆకాంక్షించారు. గోదావరి పుట్టుక పై బేతవోలు వినిపించిన పద్యాన్ని షణ్ముఖశర్మ సారస్వతానికి అన్వయించిన తీరు బావుంది. తెలుగు భాష‌కే సొంత‌మైన అవ‌ధాన విద్య‌కు ఆద్యులు, అగ్ర‌గ‌ణ్యులు, ఆశుక‌వితా సార్వ‌భౌములు కొప్ప‌ర‌పుసోద‌ర క‌వులు (కొప్ప‌ర‌పువేంక‌ట సుబ్బరాయక‌వి 1885-1932), కొప్ప‌ర‌పు వేంక‌టర‌మ‌ణక‌వి 1887-1942) దివ్య‌స్మృతిలో గ‌త 24 సంవ‌త్స‌రాలుగా తెలుగు రాష్ట్రాల‌కే త‌ల‌మానికంగా ఏటాటా ఘ‌నంగా ఈ ఉత్స‌వాలు జ‌రుగుతున్న తీరును కొప్ప‌ర‌పు క‌వుల క‌ళాపీఠం వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులు మాచ‌వ‌రం వేంక‌ట చెంచురామ మారుతీ సుబ్బ‌రాయ శ‌ర్మ‌(మాశ‌ర్మ‌) త‌న అధ్య‌క్షోప‌న్యాసంలో వివ‌రించారు. ఆదిశంకరాచార్యులు రామకష్ణ పరమహంస కందుకూరి శివానందమూర్తి తదితర పురుపుంగవులతో సామవేదం షణ్ముఖశర్మను పోల్చారు. శ్రీ కొప్ప‌ర‌పు సోద‌ర క‌వుల విర‌చిత శ‌తావ‌ధాన సౌంద‌ర్యం(శ్రీం) గ్రంధావిష్క‌ర‌ణ ఒక విశేష‌ణం ఐతే ఆ గ్రంధం వెలువరించడానికి నిధులు సమకూర్చడం, తొలి ప్ర‌తిని స్వీక‌రించ‌డానికి అమెరికాకు చెందిన ప్ర‌ఖ్యాత హృద్రోగ నిపుణులు డాక్ట‌ర్ ఆళ్ల శ్రీ‌నివాస రెడ్డి విచ్చేయ‌డం వారి స‌హృద‌య‌త‌కు నిద‌ర్శ‌నం అన్నారు మా శర్మ. బ్ర‌హ్మ‌శ్రీ సామ‌వేదం ష‌ణ్ముఖ శ‌ర్మ‌కు కొప‌ర‌పు జాతీయ ప్ర‌తిభా పుర‌స్కార ప్ర‌దానంతోపాటు ఒక గంట నిడివిలో ‘దైవ సంక‌ల్పం’ అనే అంశంపై సామ‌వేదం ష‌ణ్ముఖ శ‌ర్మ ప్ర‌వ‌చ‌నం ఆబాల‌గోపాలాన్నీ క‌ట్టిప‌డేసింది. అంతేకాకుండా ఈ ఏడాది ఉత్స‌వ క్ర‌తువును శోభాయ‌మానంగా తీర్చి దిద్దింది. పుర‌స్కార ప్ర‌దాన సంద‌ర్భంగా ఎప్ప‌టిలాగే మా శ‌ర్మ ప్ర‌ణ‌మిల్లి పుర‌స్కార స్వీక‌ర్త‌ను గౌర‌వించ‌డం, అన‌ర్గ‌ళంగా కొప్ప‌ర‌పు సోద‌ర క‌వుల ప‌ద్యాల‌ను ఆల‌పించిన విధానం స‌భాస‌దుల మ‌న్న‌న‌లందుకుంది. స‌భ ప్రారంభానికి ముందు ఘోర‌క‌వి సంప‌త్ కుమార్ చే నారాయ‌ణ తీర్థుల త‌రంగ గానం, కొద్దిసేపు ఆల‌మూరు రాధాకుమారి చే కొప్ప‌ర‌పు క‌వుల విర‌చిత నీలాంభుజారామ కేళీ మ‌రాళ‌మై…, పరమ సుస్తుతి రాఘ్రు కాయా … , శారదాభ్రపటీ రహీ ర హ | సురాపరాసర గాగ …. హరియన్నన్ పరుడన్నా బ్రహ్మమయన్న….త‌దిత‌ర ప‌ద్య గాన క‌చేరీ వీనుల‌విందుగా సాగాయి. వాయులీనం పై డాక్టర్ మావుడూరి సత్యనారాయణ, మృదంగంపై మావుడూరి సూర్యప్రకాశ శర్మ ఈ పద్యక చేరీకి చక్కటి వాద్య సహకారం అందించి కచేరీని రక్తికట్టించారు. భార‌తీభూష‌ణ రాంభ‌ట్ల నృసింహశ‌ర్మ స‌భావ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించారు. విశేష సంఖ్య‌లో హాజ‌రైన క‌ళా, సాహితీ ప్రియుల‌తో క‌ళాభార‌తి ప్రాంగ‌ణం విశిష్ఠ శోభ‌ను సంత‌రించుకొంది.

విశాఖపట్నం

విశాఖలో అంతర్జాతీయ గురుకులం

విశాఖపట్నంలో అత్యాధునిక గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, శ్రీ స్వామినారాయణ గురుకుల ట్రస్ట్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆగస్టు 22న విశాఖ నోవోటెల్‌లో జరిగిన బ్రిక్స్ మంత్రుల సమావేశంలో ఎంవోయూపై సంతకాలు జరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రభుత్వానికి గురుకుల నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. విలువలతో కూడిన విద్య, ఆధ్యాత్మిక జ్ఞానంతో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు.

విశాఖపట్నం

ఎన్నికల నగారా మోగనుంది.. విశాఖలో రాజకీయ వేడి! ఎలక్షన్ కసరత్తు వేగం.. 120 వార్డులపై కొత్త లెక్కలు.. కార్పొరేటర్ల పనితీరుపై ప్రజల్లో చర్చ

విశాఖపట్నం, పున్నమి ప్రతినిధి: విశాఖ మహానగరంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి క్రమంగా ఊపందుకుంటోంది. ఎన్నికల ప్రక్రియకు ముందస్తు ఏర్పాట్లు వేగం పుంజుకోవడంతో రాజకీయ పార్టీల్లోనూ, ఆశావహుల్లోనూ కదలిక మొదలైంది. ముఖ్యంగా జీవీఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజనకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్ వెలువడటం ఎన్నికల వాతావరణానికి మరింత ఊపునిచ్చింది. గతంలో ఉన్న 98 వార్డులను 120 వార్డులుగా విభజించే ప్రతిపాదనను జీవీఎంసీ మే 17న ప్రకటించింది. ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించే ప్రక్రియను కూడా చేపట్టింది. 120 వార్డులు.. 120 కొత్త రాజకీయ సమీకరణాలు! వార్డుల సంఖ్య పెరగడంతో విశాఖ నగర రాజకీయ ముఖచిత్రంలోనూ మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కొత్త వార్డు హద్దులు, జనాభా ప్రాతిపదికన విభజన, రిజర్వేషన్లు తదితర అంశాలు ఖరారైన తర్వాతే ఏ ప్రాంతం నుంచి ఎవరు పోటీ చేయాలన్న దానిపై స్పష్టత రానుంది. దీంతో ఇప్పటికే రాజకీయ పార్టీల్లో టికెట్ల కోసం ఆశావహుల కదలికలు మొదలైనట్లు చర్చ సాగుతోంది. పాత కార్పొరేటర్లకు పనితీరు పరీక్ష ఇప్పటి వరకు కార్పొరేటర్లుగా పనిచేసిన ప్రజాప్రతినిధులకు రానున్న ఎన్నికలు ఒక రకంగా పనితీరు పరీక్షగా మారనున్నాయి. తమ డివిజన్‌లో రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, పార్కులు, మౌలిక వసతులు వంటి సమస్యలపై ఎంతవరకు స్పందించారు? ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నారు? అధికారుల వద్ద సమస్యలను ఎంతవరకు పరిష్కరించగలిగారు? అన్న అంశాలపై ఓటర్లు లెక్కలు వేసే అవకాశం ఉంది. కొత్త ముఖాలకు అవకాశం? మరోవైపు యువ నాయకులు, మహిళలు, స్థానికంగా ప్రజా సమస్యలపై పనిచేస్తున్న నాయకులు కూడా ఎన్నికల బరిలోకి రావాలని ఉత్సాహం చూపుతున్నారు. కొత్త వార్డు హద్దులు, రిజర్వేషన్లు ఖరారైన తర్వాత ఆశావహుల లెక్క మరింత పెరిగే అవకాశం ఉంది. గతంలో ఉన్న రాజకీయ సమీకరణాలు కొత్త వార్డుల్లో ఎంతవరకు పనిచేస్తాయన్నది కూడా ఆసక్తికరంగా మారింది. పార్టీలకు ప్రతిష్టాత్మక పోరు విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. పార్టీ బలం ఒకవైపు.. అభ్యర్థి వ్యక్తిగత పరిచయాలు, ప్రజలతో అనుబంధం మరోవైపు.. స్థానిక సమస్యలపై పోరాటం, గత పనితీరు ఇంకోవైపు.. ఇలా అనేక అంశాలు ఒక్కో వార్డులో ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి. ప్రజలే అసలు నిర్ణేతలు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ నాయకుల కంటే ప్రజల సమస్యలే ప్రధాన చర్చగా మారనున్నాయి. “ఎవరు అందుబాటులో ఉన్నారు? ఎవరు సమస్యను పరిష్కరించారు? ఎవరు మాట నిలబెట్టుకున్నారు? ఎవరు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించారు?” అనే ప్రశ్నలకు ప్రజల సమాధానమే అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనుంది. వార్డు వారీగా ‘పున్నమి’ ప్రత్యేక పరిశీలన రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విశాఖ నగరంలోని ప్రతి వార్డుపై ‘పున్నమి’ ప్రత్యేక దృష్టి సారించనుంది. ఆయా ప్రాంతాల్లోని ప్రధాన సమస్యలు, గత ప్రజాప్రతినిధుల పనితీరు, ప్రజల్లో ఉన్న అభిప్రాయం, రాజకీయ పార్టీల బలం, ఆశావహుల పోటీ, కొత్త సమీకరణాలు వంటి అంశాలను వార్డు వారీగా విశ్లేషించే ప్రత్యేక కథనాలు అందించనున్నాం. 98 నుంచి 120 వార్డులు.. పాత లెక్కలకు కొత్త రూపం.. కార్పొరేటర్ల పనితీరుకు ప్రజల తీర్పు.. కొత్త ముఖాలకు అవకాశాలపై ఉత్కంఠ.. విశాఖలో ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతోందా? రానున్న రోజుల్లో ప్రతి వార్డులో ఎవరి బలం ఎంత? ఎవరి వెంట ప్రజలు ఉన్నారు? ఎవరి పనితీరు ఎలా ఉంది? ఏ పార్టీకి ఎక్కడ అనుకూల పరిస్థితులు ఉన్నాయి? అనే అంశాలపై ‘పున్నమి’ ప్రత్యేక కథనాలు కొనసాగనున్నాయి.

విశాఖపట్నం

శ్రీ దుర్గా గణపతి దేవస్థానం 33వ వార్షికోత్సవం…

విశాఖపట్నం సీతంపేటలో ప్రతిష్టించబడిన శ్రీ దుర్గా గణపతి దేవస్థానం 33వ వార్షికోత్సవం సందర్భంగా తెల్లవారుఝామున 4 గంటల గణపతి హోమం, మహా అభిషేకములతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగును. సాయంత్రం 5 గంటల నుండి సీతంపేట పుర వీధులలో 108 కళశములతో మహిళలచేత ఊరేగింపు మరియు పల్లకి సేవ నిర్వహింపబడునని విశాఖ పార్లమెంట్ MP మతుకుమిల్లి శ్రీ భరత్ మరియు విశాఖ (ఉత్తర) నియోజకవర్గం MLA పి. విష్ణుకుమార్ రాజు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారని ఆలయ ఈఓ శివ కేశవ రావు, చైర్మన్ నమ్మి రవి కుమార్, ధర్మకర్తలు భమిడిపాటి మల్లీశ్వరి, భీమవరపు శ్రీనివాస్ రావు, గంట్యాడ రాజేశ్వరి, లొట్ల పార్వతి తదితరులు తెలియజేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.