వార్త ముఖ్యాంశాలు
- Uploaded Video:
ఉదయగిరి నియోజకవర్గం: దుత్తలూరు మండల కేంద్రంలో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లా అడిషనల్ ఎస్పీ దీక్షిత పరిశీలించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకోవడంతో అక్కడే ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులతో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పరిస్థితిని గమనించిన అడిషనల్ ఎస్పీ దీక్షిత వెంటనే రంగంలోకి దిగారు. ఇరువర్గాల నాయకులతో మాట్లాడి సర్దిచెప్పారు. అనంతరం నాయకులను పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలగకుండా భద్రతా చర్యలు కొనసాగించారు.
Uploaded Video: