Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

బైరవరం పోలింగ్ కేంద్రం వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు

Punnami Newsroom Published:
బైరవరం పోలింగ్ కేంద్రం వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు

బైరవరం పోలింగ్ కేంద్రం వద్ద గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాలు, ఉన్నతాధికారుల సూచనల మేరకు దుత్తలూరు ఎస్‌ఐ బీ. మహేంద్ర పోలీస్ సిబ్బందితో కలిసి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రం పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తూ పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకున్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పోలింగ్ సజావుగా కొనసాగింది.

బైరవరం పోలింగ్ కేంద్రం వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *