Monday, 21 September 2026

Tag: V

తిరుపతి

పారిశుధ్య కార్మికుల సేవలు అమూల్యం* *ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ*

*ఎక్స్ గ్రేషియా చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ* నాయుడుపేట :* ప్రజారోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అన్నారు. ఆమె మంగళవారం నాయుడుపేట మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పబ్లిక్ హెల్త్ వర్కర్ల మరణించిన కుటుంబాలకు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపాలిటీలో పని చేసి మృతి చెందిన ఏడుగురు కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ, పరిశుభ్రత అనేది పారిశుద్ధ్య కార్మికుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు స్వచ్ఛ మున్సిపాలిటీ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని సూచించారు. తడి – పొడి చెత్తలను వేరు చేసి చెత్త సేకరణ కార్మికులకు అందించాలని కోరారు. అనంతరం తడి – పొడి చెత్తలను నిల్వ చేయడానికి ప్లాస్టిక్ బకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ ఫజులుల్లా, పట్టణ పార్టీ అధ్యక్షులు 786 రఫీ, పార్టీ నాయకులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

తిరుపతి

ఇల్లు కూలుస్తామని బెదిరింపులు

బి.ఎన్.కండ్రిగలో అధికార పార్టీ నాయకులు, స్థానిక అధికారుల అండదండలతో పేదల ఇళ్లను కూల్చివేయడానికి కుట్ర జరుగుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా ఓబీసీ కాలనీలో నివాసముంటున్న పేదలను ఇళ్ల నుండి బలవంతంగా ఖాళీ చేయించి, రోడ్డున పడేసేందుకు కొందరు నేతలు చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. గతంలో శాసనసభ్యుల చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పొంది, ప్రశాంతంగా జీవిస్తున్న తమపై స్థానిక రెవెన్యూ అధికారులు, కొందరు అధికార పార్టీ నేతలు కక్షగట్టారని బాధితులు మండిపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జేసీబీ యంత్రాలను తీసుకొచ్చి ఇళ్లను, ప్రహరీ గోడలను కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అధికారులు వారికి మద్దతు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుట్ర వెనుక ప్రధానంగా సుధారాణి, భద్ర శేషమునాయుడు అతని అనుచరులు అధికార పార్టీ పాటు స్థానిక అధికారులు రాజకీయ బలంతో పాటు, కొందరు అధికారులు మామూళ్లకు లొంగిపోయి పేదల పొట్ట కొడుతున్నారని, తమకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ యంత్రాంగమే నేతలతో చేతులు కలపడం దారుణమని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. *కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాం* స్థానిక అధికారుల తీరుపై నమ్మకం లేదని, అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి తమకు అన్యాయం చేస్తున్న అధికారులపై ఉన్నతాధికారులకు, జిల్లా కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని బాధితులు హెచ్చరించారు. ప్రాణాలు పోయినా తమ ఇళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి అధికార పార్టీ నేతల అక్రమాలను, అధికారుల ఏకపక్ష వైఖరిని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.

తిరుపతి

వెంకటగిరి లో అంబేద్కర్ గారి విగ్రహ పునఃప్రతిష్ఠాపన

పనులకు శంకుస్థాపన ✊✊ నరసాపురం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బి.ఆర్. అంబేద్కర్ నూతన కాంస్య విగ్రహ పునఃప్రతిష్ఠాపన పనులకు నరసాపురం ఎమ్మెల్యే శ్రీ బొమ్మిడి నాయకర్ శంకుస్థాపన చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆశయ సాధనకు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. అంబేద్కర్ సెంటర్‌లో విగ్రహ ఏర్పాటు, సుందరీకరణ పనుల కోసం ఇప్పటికే రూ.31.50 లక్షల నిధులు మంజూరు చేశాం. పనుల పూర్తికి భవిష్యత్తులో నిధుల కొరత ఏర్పడినా వెనుకడుగు వేసేది లేదు. అవసరమైతే తన సొంత నిధులతోనైనా పనులను పూర్తి చేయించే బాధ్యత నాదే. అంబేద్కర్ ఆశయాలు, ఆయన అందించిన రాజ్యాంగ స్ఫూర్తి ప్రజలకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయి. అంబేద్కర్ సెంటర్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆయన స్ఫూర్తిని చాటేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ధన్యవాదాలు ఇట్లు:-జనసేన పార్టీ కార్యాలయం వెంకటగిరి నియోజకవర్గం 🙏🙏 ✊✊

తిరుపతి

మానవత్వానికి నిలువుటద్దం *786 రఫీ సేవా సంస్థ*

తిరుపతి జిల్లా నాయుడుపేట సమాజంలో కష్టం ఉన్న చోట నేనున్నానంటూ ముందుకొచ్చి, బాధితులకు కొండంత అభయాన్ని ఇచ్చే అరుదైన వ్యక్తుల్లో *786 రఫీ* ఒకరు. కేవలం సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా, పేదరికం కారణంగా ఏ ఒక్కరి చదువు, క్రీడలలో భవిష్యత్తులో ఏ ఒక్కరికి ఆగిపోకూడదనే ఉద్దేశంతో ‘786 సేవా సంస్థ’ ద్వారా నిరంతరం శ్రమిస్తున్నారు. క్రీడాకారులకు కొండంత అండ – ఇటీవల నాయుడుపేట బిరదవాడ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల నుండి రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన 20 మంది విద్యార్థినులకు 786 సేవా సంఘం ద్వారా రఫీ ప్రత్యేకంగా స్పోర్ట్స్ టీ-షర్టులు, షార్ట్లు, క్యాప్స్ మరియు షూస్ పంపిణీ చేశారు. క్రీడల్లో విద్యార్థినులు మరింత రాణించి, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. *సేవా కార్యక్రమాల విస్తృతి* *పండుగల్లో చేయూత:* ప్రతి పండుగ సందర్భంలోనూ పేదలకు, నిరుపేద కుటుంబాలకు కొత్త దుస్తులు పంపిణీ చేస్తూ పండుగ వెలుగులను పంచుతారు. *విద్యార్థులకు నిరంతర సహాయం :* స్కూల్కి అవసరమైన పుస్తకాలు, బ్యాగులు, క్రీడా పరికరాలు ఉచితంగా అందజేస్తూ పేద విద్యార్థుల చదువుకి తోడ్పడుతున్నారు. అలాగే అనాథ ఆశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు అవసరమైన నిత్యవసరాలు సమకూరుస్తూ ఆకలి తీరుస్తున్నారు. ఆపద్బాంధవుడిగా ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద సంభవించినా ‘నేనున్నాను’ అంటూ మానవత్వంతో సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటారు. స్వార్థం నిండిన రోజుల్లో రఫీ చేస్తున్న ఈ నిరంతర సామాజిక సేవ ఎందరికో ఆదర్శనీయం. నిలవాలని ఈ కార్యక్రమంలో పాఠశాల పీ.ఈ.టీ.లు మరియు 786 సేవా సంఘం సభ్యులు పాల్గొని ఆయన సేవలను కొనియాడారు.

తిరుపతి

రక్తదాన శిబిరం కార్యక్రమం ✊✊ వెంకటగిరి

30వ తేదీ ఆదివారం 10 గంటలకు స్థలం: గవర్నమెంట్ ఆసుపత్రి, వెంకటగిరి ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా అభిమానులు జనసేన నాయకులు వీర మహిళలు,కార్యకర్తలు ప్రతి ఒక్కరు రక్తదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం🙏🙏 ధన్యవాదాలు ఇట్లు:-జనసేన పార్టీ కార్యాలయం వెంకటగిరి నియోజకవర్గం 🙏🙏 ✊✊

తిరుపతి

గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపనకు ముందస్తు అనుమతి తప్పనిసరి.

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించాలి. గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపన, నిమజ్జనంపై నిర్వాహకులకు పోలీసుల అవగాహన. – ప్రజా రహదారులు, ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా మండపాల ఏర్పాటు. – రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అధిక శబ్దం, సాంస్కృతిక కార్యక్రమాలకు నిషేధం. – DJలు, హైపవర్ మ్యూజిక్ సిస్టమ్స్‌కు అనుమతి లేదు. – నిమజ్జన ఊరేగింపులో పోలీసుల సూచించిన మార్గం, తేదీ, సమయాన్ని తప్పనిసరిగా పాటించాలి. – మద్యం, మత్తు పదార్థాల వినియోగం, బాణాసంచా, రెచ్చగొట్టే సోషల్ మీడియా ప్రచారాలకు దూరంగా ఉండాలి తిరుపతి ఆగష్టు 23: రాబోయే వినాయక చవితి పండుగను ప్రశాంతంగా, సురక్షితంగా మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపిఎస్., గారి ఆదేశాలు, రేణిగుంట సబ్-డివిజనల్ పోలీస్ అధికారి శ్రీ వై. శ్రీనివాసరావు, డీస్పీ గారి సూచనల మేరకు, కోడూరు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించే ఉత్సవ కమిటీ సభ్యులతో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. కోడూరు అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సి. చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపనకు ముందు పోలీస్ శాఖతో పాటు సంబంధిత అధికారుల నుంచి తప్పనిసరిగా ముందస్తు లిఖితపూర్వక అనుమతి పొందాలని, అనుమతి ప్రతిని గణేష్ మండపం వద్ద ప్రదర్శించాలని నిర్వాహకులకు సూచించారు. మండపాలను ప్రజా రహదారులు, ఫుట్‌పాత్‌లు, ట్రాఫిక్ మరియు అత్యవసర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. రాత్రి 10.00 గంటల నుంచి ఉదయం 06.00 గంటల వరకు ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు లేదా అధిక శబ్దంతో కూడిన కార్యక్రమాలు నిర్వహించరాదని, DJలు, హైపవర్ మ్యూజిక్ సిస్టమ్స్‌కు అనుమతి లేదని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా శబ్ద కాలుష్యానికి పాల్పడరాదని, మండపాల వద్ద తగిన విద్యుత్, అగ్నిమాపక, లైటింగ్, జనసమూహ నియంత్రణ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. మండపాల వద్ద కనీసం ముగ్గురు బాధ్యతగల వాలంటీర్లను అందుబాటులో ఉంచి, వారి వివరాలను పోలీసులకు అందజేయాలని తెలిపారు. బాల కార్మికులను వినియోగించరాదని, రహదారులపై ప్రజలు, దుకాణదారుల నుంచి బలవంతంగా విరాళాలు వసూలు చేయరాదని స్పష్టం చేశారు. నిమజ్జన ఊరేగింపులకు ముందుగానే తగిన వాహనాలను ఏర్పాటు చేసుకొని, పోలీసులు ఆమోదించిన మార్గం, తేదీ, సమయాన్ని కచ్చితంగా పాటించాలని సూచించారు. నిమజ్జన వాహనాలపై DJలు, మ్యూజిక్ సిస్టమ్స్, బాణాసంచా మరియు లౌడ్‌స్పీకర్ల వినియోగానికి అనుమతి లేదని తెలిపారు. పాదచారులు, వాహనదారులపై గులాల్, కుంకుమ, రంగులు లేదా ఇతర పదార్థాలను విసరడం నిషేధమని, మద్యం లేదా ఇతర మత్తు పదార్థాల ప్రభావంలో ఉన్న వ్యక్తులను ఊరేగింపులో పాల్గొనకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. నిమజ్జన ఊరేగింపు సమయంలో ట్రాఫిక్‌కు, అత్యవసర వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని, ప్రార్థనా స్థలాలు మరియు ఇతర ముఖ్యమైన ప్రదేశాల వద్ద అనవసరంగా ఊరేగింపును నిలిపివేయరాదని తెలిపారు. పోలీసులు నిర్దేశించిన నిమజ్జన ప్రదేశాల్లో మాత్రమే గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయాలని స్పష్టం చేశారు. వినాయక చవితి వేడుకల సందర్భంగా ఎటువంటి రెచ్చగొట్టే, వివాదాస్పద లేదా అనధికారిక సమాచారాన్ని WhatsApp, సోషల్ మీడియా మరియు ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం చేయరాదని నిర్వాహకులకు సూచించారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన లేదా అత్యవసర పరిస్థితి తలెత్తిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. – తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపన, నిమజ్జనం, శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి ఇప్పటికే పలు మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా కోడూరు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు ముందస్తు అవగాహన కల్పిస్తూ ఈ సమావేశం నిర్వహించారు. పండుగను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీస్ శాఖకు పూర్తిగా సహకరించాలని కోడూరు అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సి. చంద్రశేఖర్ సూచించారు.

తిరుపతి

ప్రజా సేవలో కిరణ్ కుమార్‌కు ప్రత్యేక గుర్తింపు

మీడియా రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కాంగ్రెస్ నేతకు ప్రజల అభినందనలు సూళ్లూరుపేట: ఎన్నో సంవత్సరాలుగా మీడియా రంగంలో పనిచేస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి, ప్రజలకు ఎంతో మేలు చేసిన వ్యక్తిగా దయ్యాల కిరణ్ కుమార్కు ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉందని పలువురు పేర్కొన్నారు. మీడియా రంగంలో ఉన్న సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేసిన వ్యక్తిగా కిరణ్ కుమార్‌కు మంచి పేరు ఉందని ప్రజలు తెలిపారు. ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి స్పందించే ఆయన తీరు ఎంతోమందికి నచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం కిరణ్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. మీడియా ద్వారా ప్రజలకు సేవ చేసిన అనుభవం ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి రావడం వల్ల ప్రజా సమస్యలను మరింత బలంగా ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని ప్రజలు అభిప్రాయపడ్డారు. కిరణ్ కుమార్ నియోజకవర్గ ఇంచార్జిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారని కాంగ్రెస్ శ్రేణులు పేర్కొన్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా, కార్యకర్తలకు అండగా నిలిచే వ్యక్తిగా కిరణ్ కుమార్ మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఘనంగా జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇంచార్జ్ దయ్యాల కిరణ్ కుమార్ జన్మదిన వేడుకలు సూళ్లూరుపేట బస్టాండ్ ఎదురుగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కిరణ్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రజలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపిన పలువురు మాట్లాడుతూ, మీడియా రంగంలో ప్రజల కోసం పనిచేసిన అనుభవాన్ని రాజకీయాల్లోనూ కొనసాగిస్తూ మరింతగా ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై మరింత చురుగ్గా స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజల సంక్షేమం కోసం కిరణ్ కుమార్ మరింత కృషి చేయాలని ప్రజలు కోరారు.

తిరుపతి

పల్లెనిద్రతో గ్రామాల్లో పోలీసుల భరోసా – ప్రజల సమస్యలపై ప్రత్యక్ష ఆరా.*

బుచ్చినాయుడు కండ్రిగ ఆగస్ట్ 23 తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు పల్లెనిద్ర, నైట్ హాల్ట్ మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో రాత్రి వేళల్లో పర్యటిస్తూ ప్రజలతో నేరుగా మమేకమై వారి స్థానిక సమస్యలు, శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలపై ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా బి.ఎన్. కండ్రిగ సీఐ ఆధ్వర్యంలో తొట్టంబేడు ఎస్‌ఐ బోనుపల్లి గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. బోనుపల్లి సున్నితమైన గ్రామం కావడంతో పోలీసు అధికారులు ప్రత్యేకంగా పర్యటించి గ్రామస్తులతో సమావేశమై వారి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలో శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలపై చర్చించి, ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల నియంత్రణ, మహిళలు–చిన్నారుల భద్రత, రోడ్డు భద్రత, హెల్మెట్ వినియోగం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. జిల్లాలోని రేణిగుంట, చిట్వేల్, బాలాయపల్లి, వెంకటగిరి తదితర పోలీస్ స్టేషన్ పరిధుల్లోని గ్రామాల్లో కూడా అధికారులు పర్యటించి గ్రామస్తులు, గ్రామ పెద్దలతో సమావేశమై స్థానిక సమస్యలు మరియు శాంతిభద్రతల అంశాలపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా సున్నితమైన గ్రామాల్లో ప్రత్యేక అప్రమత్తతతో పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మరియు వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రజలు సంయమనం పాటిస్తూ శాంతియుత వాతావరణానికి సహకరించాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు. ప్రజలకు పోలీసుల భద్రతా భరోసా కల్పించడం, వారి సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడం, సున్నితమైన ప్రాంతాల్లో శాంతిభద్రతలను పటిష్టంగా పర్యవేక్షించడం, నేరాల నివారణపై అవగాహన పెంచడం లక్ష్యంగా పల్లెనిద్ర, నైట్ హాల్ట్ మరియు అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిరంతరం కొనసాగుతున్నాయి.

తిరుపతి

రేపే ఘనంగా ప్రారంభం!*కుప్పారెడ్డిపాలెం లో

*రేపే ఘనంగా ప్రారంభం!* *RAJA’S COOL DRINKS & GENERAL STORE* దొరవారిసత్రం మండల ప్రజలకు శుభవార్త! మీ కుప్పరెడ్డిపాలెం హైవేలో *రాజా కూల్ డ్రింక్స్ & జనరల్ స్టోర్* రేపు *ఆదివారం (24.08.2025)* ఘనంగా ప్రారంభం కాబోతోంది. మా వద్ద లభించును: కూల్ డ్రింక్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, చిప్స్ & స్నాక్స్, షాంపూస్, సోప్స్, సర్ఫ్, కొల్గేట్ మరియు అన్ని నిత్యావసర సరుకులు – అన్నీ ఒకే చోట, బెస్ట్ క్వాలిటీ – బెస్ట్ సర్వీస్ తో! *ప్రతి ఒక్కరూ విచ్చేసి మా నూతన షాప్ ప్రారంభోత్సవాన్ని జయప్రదం చేయగలరు.* *స్థలం:* కుప్పరెడ్డిపాలెం హైవే, దొరవారి సత్రం *ప్రొప్రయిటర్: K. రాజా రత్నం* *ఫోన్: 6281110783* *Daily Needs – Everything Under One Roof!*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.