Wednesday, 16 September 2026

Tag: Telangana Congress

తెలంగాణ

తండ్రి కష్టానికి కుమారుల విజయాలే నిదర్శనం: మహేష్ కుమార్ గౌడ్

పొన్నం సత్తయ్య జీవితం నేటి తరానికి గొప్ప ఆదర్శమని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తూనే పిల్లలకు ఉన్నత విద్య అందించి ప్రయోజకులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. పొన్నం ప్రభాకర్‌ను 1985 నుంచి చూస్తున్నానని, తొలుత రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపకపోయినా తానే ప్రోత్సహించానని గుర్తుచేశారు. నేడు ఆయన మంత్రిగా ప్రజలకు సేవ చేస్తున్నారని పేర్కొన్నారు. గిడుగు రుద్రరాజు, పొన్నం ప్రభాకర్ తన రాజకీయ ప్రియ శిష్యులని చెప్పారు. ప్రతిభావంతులైన జానపద కళాకారులను గుర్తించి పురస్కారాలతో ప్రోత్సహించడం అభినందనీయమన్నారు.

తెలంగాణ

వైఎస్ఆర్ ఆశయాలకు సీఎం రేవంత్ రెడ్డి హామీ

వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్–2026 కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు, పేదల సంక్షేమంలో వైఎస్ సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రాణహిత–చేవెళ్ల, ఎస్ఎల్‌బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నది వైఎస్ చివరి ఆకాంక్ష అని పేర్కొంటూ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో అందరూ కలిసి ఆ లక్ష్యసాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.