Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Punnami News

పల్నాడు

*పల్నాడు : ఏపీలో కొత్త జిల్లాల సంఖ్యకు అనుగుణంగా జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ..!*

*పల్నాడు : ఏపీలో కొత్త జిల్లాల సంఖ్యకు అనుగుణంగా జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ..!* *ప్రస్తుతమున్న 13 జడ్పీల స్థానంలో 28 కొత్త జిల్లా పరిషత్‌లు ఏర్పాటుచేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు.* *కొత్తగా ఏర్పడిన మార్కాపురం, పోలవరం జిల్లాలకు సైతం జడ్పీలు మంజూరు.* *అదనంగా 15 జడ్పీ CEO, 15 డిప్యూటీ CEO పోస్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం.* *ఈ నెల 24న ప్రస్తుత జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీకాలం ముగిసిన వెంటనే అమల్లోకి రానున్న 28 కొత్త జడ్పీల వ్యవస్థ.*

పల్నాడు

తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీవాణి ట్రస్టు ద్వారా మాచర్ల నియోజకవర్గంలో వివిధ దేవాలయాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది..!

తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీవాణి ట్రస్టు ద్వారా మాచర్ల నియోజకవర్గంలో వివిధ దేవాలయాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది..! 1. రెంటచింతల మండలం, మంచికల్లు గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం నిర్మాణాలకు నిధులు – రూ. 40 లక్షలు 2. మాచర్ల మండలం, పశువేముల గ్రామంలో శ్రీ సంతు సేవాలాల్ స్వామి వారి దేవాలయం నిర్మాణాలకు నిధులు – రూ. 40 లక్షలు 3. వెల్దుర్తి మండలం, బోదిలవీడు గ్రామంలో శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం నిర్మాణాలకు నిధులు – రూ. 40 లక్షలు 4. వెల్దుర్తి మండలం, పట్లవీడు గ్రామంలో శ్రీ రామాలయం నిర్మాణాలకు నిధులు – రూ. 40 లక్షలు మొత్తం = రూ. 1 కోటి, 60 లక్షలు నిధులు మంజూరు చేస్తూ.. ఈ రోజులు ఉత్తర్వులు జారీ..!

పల్నాడు

నర్సరావుపేట లో హాస్పిటల్ వెనుక ఖాళీ ప్రాంతంలో ఆడ శిశువు గుర్తింపు

నరసరావుపేటలో ఆడ శిశువు కలకలం శ్రీ కేర్ ఆసుపత్రి వెనుక ఖాళీ ప్రదేశంలో ఆడ శిశువు గుర్తింపు 2–3 రోజుల వయసున్న శిశువును ఆసుపత్రికి తరలించిన సిబ్బంది వైద్యుల పర్యవేక్షణలో కొనసాగుతున్న చికిత్స కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు తల్లిదండ్రుల సమాచారం కోసం 94407 96244కు సంప్రదించాలని పోలీసుల విజ్ఞప్తి

పల్నాడు

*వినాయక చవితి పండుగ సందర్భంగా పందిళ్ల ఏర్పాటుకు అనుమతులు ఇక మరింత సులభం!*

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వినాయక మండపాలు/పందిళ్ల ఏర్పాటుకు అవసరమైన అనుమతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఏకీకృత ఆన్‌లైన్ అనుమతి వ్యవస్థ అందుబాటులోకి తీసుకురాబడింది. 🔹 www.ganeshutsav.net ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 🔹 పోలీస్, అగ్నిమాపక, మున్సిపల్, విద్యుత్ మరియు రెవెన్యూ శాఖల సమన్వయంతో అనుమతుల ప్రక్రియ నిర్వహించబడుతుంది. 🔹 అనుమతి మంజూరైన అనంతరం క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ అనుమతి పత్రం పొందవచ్చు. 🔹 ఈ సేవ పూర్తిగా ఉచితం. సురక్షితమైన, ప్రశాంతమైన మరియు క్రమబద్ధమైన వినాయక చవితి వేడుకల నిర్వహణ కోసం నిర్వాహకులు ఈ ఆన్‌లైన్ సదుపాయాన్ని వినియోగించుకుని ముందస్తుగా దరఖాస్తు చేసుకొనగలరు. 🙏🚩 సురక్షిత వేడుకలు – బాధ్యతాయుతమైన వేడుకలు * ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ

భక్తి

సాయిబాబా ఆశీస్సులతో శుభ గురువారం

శ్రీ సాయిబాబా ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో జ్ఞానం, శాంతి, సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ పున్నమి కుటుంబం శుభ గురువారం శుభాకాంక్షలు తెలిపింది. గురువుపై విశ్వాసం, సద్భావన, సేవాభావం మనిషిని సన్మార్గంలో నడిపిస్తాయని పేర్కొంది. సాయిబాబా బోధించిన శ్రద్ధ, సబూరి సూత్రాలను ఆచరిస్తూ ప్రేమ, దయ, మానవత్వంతో ముందుకు సాగాలని కోరింది. భక్తులందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, మనశ్శాంతి కలగాలని ప్రార్థించింది.

పల్నాడు

*పల్నాడు జిల్లాలో స్కూల్ బస్సు ను వెనుకనుండి ఢీకొట్టిన లారీ పలువురు విద్యార్థులకు గాయాలు*

పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది. మర్రిచెట్టుపాలెం నుంచి విప్పర్ల వైపు వెళ్తున్న సిబిఐటి స్కూల్ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కొంతమంది విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన విద్యార్థులను తక్షణమే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

పల్నాడు

*పల్నాడు జిల్లా… నరసరావుపేటలో ఘనంగా డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు….*

పల్నాడు జిల్లా… నరసరావుపేటలో ఘనంగా డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు…. జనసేన ఇంచార్జ్ సయ్యద్ జిలాని ఆధ్వర్యంలో జరిగిన జన్మదిన భారీ ఏర్పాట్లు… ఇస్సప్పాలెంలో మహంకాళి అమ్మవారి దేవస్థానంలో పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి, కొబ్బరికాయలు కొట్టిన ఇంచార్జ్ జిలాని… ఇస్సప్పాలెం మహంకాళి అమ్మవారి దేవస్థానం నుంచి జనసేన పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ… అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి,అన్నదానం ఏర్పాటు చేసిన జిలాని… కార్యక్రమంలో పాల్గొన్న రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వీరవల్లి వంశీ,జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు…

పల్నాడు

*పల్నాడు : నరసరావుపేటలో మంత్రి నారా లోకేష్‌కు ఘన స్వాగతం..!*

*పల్నాడు : నరసరావుపేటలో మంత్రి నారా లోకేష్‌కు ఘన స్వాగతం..!* *నరసరావుపేటలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్‌కు టీడీపీ, జనసేన శ్రేణుల ఘన స్వాగతం.* *మంత్రి లోకేష్‌కు స్వాగతం పలికిన ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యేలు, టీడీపీ ముఖ్య నేతలు.* *SRK సెంటర్‌లో డప్పులు, డీజేలు, నినాదాలతో హోరెత్తిన పసుపు సైనికులు, అభిమానులు.* *పసుపు జెండాలతో, గజమాలలతో యువనేత లోకేష్‌కు అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన టీడీపీ శ్రేణులు, అభిమానులు.* Uploaded Video: