*ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా ఆటో బోల్తా
*పలువురికి గాయాలు*
చిలకలూరిపేట సమీపంలోని పోలిరెడ్డిపాలెం బ్రిడ్జి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఆటో బోల్తా పడి పలువురికి గాయాలయ్యాయి. ఒంగోలు సమీపంలోని ఈతముక్కలకు చెందిన వూట్ల రాజేశ్వరి(24) క్యాన్సర్ చికిత్స కోసం కుటుంబ సభ్యులతో కలిసి మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లి, తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
తిరుగు ప్రయాణంలో ఆటో డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో, రాజేశ్వరి భర్త అశోక్(32) ఆటో డ్రైవింగ్ చేశాడు. పోలిరెడ్డిపాలెం వద్ద బైపాస్, సర్వీస్ రోడ్డు మార్గాల మధ్య గందరగోళానికి గురైన అశోక్.. ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ఘటనలో మర్రిపూడి సుశీల(52) తల, కాళ్లకు తీవ్ర గాయాలు కాగా, డ్రైవర్ తో పాటు అశోక్, రాజేశ్వరిలకు సైతం గాయాలయ్యాయి. గమనించిన వాహనదారులు, 108 సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
Uploaded Video:

