Tuesday, 18 August 2026

Tag: Karnataka

జాతీయ అంతర్జాతీయ

కేపీఎస్సీ అక్రమాలపై సోదాలు

కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసుకు సంబంధించి కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. మాజీ కేపీఎస్సీ చైర్‌పర్సన్ శివశంకరప్ప ఎస్. సాహుకార్‌కు సంబంధించిన ప్రాంగణాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. సోదాలపై ఈడీ నుంచి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.