పట్టపగలే యువతిపై ఆకతాయిల వేధింపులు
బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో యువతిపై కొందరు ఆకతాయిలు వేధింపులకు పాల్పడ్డారు. కర్పూరిగ్రామ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బూఢీ గండక్ డ్యామ్ బైపాస్ రోడ్డుపై బైక్‌లపై వచ్చిన యువకులు ఓ యువతి, ఆమెతో ఉన్న యువకుడిని చుట్టుముట్టారు. యువతి చేయి పట్టుకుని లాక్కెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఇబ్బందులకు గురిచేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.


