Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

అవినాష్‌రెడ్డి కాన్వాయ్‌పై పెట్రోల్ బాంబుల దాడి!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అవినాష్‌రెడ్డి కాన్వాయ్‌పై పెట్రోల్ బాంబుల దాడి!

వార్త ముఖ్యాంశాలు

  • సింహాద్రిపురంలో తీవ్ర ఉద్రిక్తత – బీటెక్ రవి వర్గీయులపైనే ఎంపీ ఆరోపణలు కడప జిల్లా సింహాద్రిపురం మండలంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడి జరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
  • పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల నామినేషన్ల కోసం అంకాలమ్మగూడూరు వైపు వెళ్తుండగా ప్రత్యర్థులు రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు.
  • పెట్రోల్ బాంబులు కూడా విసిరినట్లు ఆరోపణలు వచ్చాయి.

సింహాద్రిపురంలో తీవ్ర ఉద్రిక్తత – బీటెక్ రవి వర్గీయులపైనే ఎంపీ ఆరోపణలు
కడప జిల్లా సింహాద్రిపురం మండలంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడి జరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల నామినేషన్ల కోసం అంకాలమ్మగూడూరు వైపు వెళ్తుండగా ప్రత్యర్థులు రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. పెట్రోల్ బాంబులు కూడా విసిరినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ దాడికి టీడీపీ నేత బీటెక్ రవి, ఆయన అనుచరులే కారణమని అవినాష్‌రెడ్డి ఆరోపించారు. ఘటన అనంతరం సర్పంచ్ అభ్యర్థులతో కలిసి పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. మరోవైపు ఉద్రిక్తతలకు అవినాష్‌రెడ్డే కారణమని బీటెక్ రవి ప్రతివిమర్శలు చేశారు. ఈ ఘటనతో పులివెందుల నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *