Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

రూ.40.96 కోట్ల ధాన్యం కేసులో ఈడీ సోదాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రూ.40.96 కోట్ల ధాన్యం కేసులో ఈడీ సోదాలు

వార్త ముఖ్యాంశాలు

  • ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్‌కు సంబంధించిన నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం ఏకకాలంలో రెండు చోట్ల సోదాలు చేపట్టారు.
  • రూ.40.96 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం అక్రమాల కేసులో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.
  • ఖానాపూర్ మండలం సత్తెనపల్లిలోని ఆమెకు చెందిన ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో 9,639.962 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ గతంలో గుర్తించింది.

ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్‌కు సంబంధించిన నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం ఏకకాలంలో రెండు చోట్ల సోదాలు చేపట్టారు. రూ.40.96 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం అక్రమాల కేసులో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఖానాపూర్ మండలం సత్తెనపల్లిలోని ఆమెకు చెందిన ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో 9,639.962 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ గతంలో గుర్తించింది. 2022-23, 2023-24, 2024-25 యాసంగి సీజన్లలో ప్రభుత్వానికి బియ్యం అప్పగించకుండా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో రేఖా నాయక్‌పై బీఎన్‌ఎస్ సెక్షన్లు 316(2), 316(5), 318(4), నిత్యావసర సరుకుల చట్టం కింద ఇప్పటికే కేసు నమోదైంది. ధాన్యం పక్కదారి పట్టించారన్న ఆరోపణలతో పాటు మనీలాండరింగ్ కోణంలోనూ ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సోదాల్లో కీలక ఆధారాల కోసం పత్రాలను పరిశీలిస్తున్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *