వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కూటమి బలపరిచిన షేక్ రియాజ్ నామినేషన్ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ పి.
- చెంచల బాబు యాదవ్ పాల్గొన్నారు.
- ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మద్దతుతో రియాజ్ నామినేషన్ దాఖలు చేశారు.
ఉదయగిరి మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కూటమి బలపరిచిన షేక్ రియాజ్ నామినేషన్ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ పి. చెంచల బాబు యాదవ్ పాల్గొన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మద్దతుతో రియాజ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. చెంచల బాబు యాదవ్ మాట్లాడుతూ రియాజ్ గెలుపుతోనే ఉదయగిరి పట్టణ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని తెలిపారు. కూటమి అభ్యర్థికి ప్రజలు మద్దతుగా నిలిచి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నామినేషన్ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.