*బీ సి రిజర్వేషన్ పై ప్రభుత్వం కు ధన్యవాదములు తెలిపిన బీసీ నాయకులు*
ఆంధ్రప్రదేశ్ బి.సి ఫెడరేషన్ రాష్ట్ర కో కన్వీనర్, దేవాంగ అభ్యుదయ సేవా సంఘం అధ్యక్షులు గుత్తి త్యాగరాజు ఆధ్వర్యంలో స్థానిక బస్ స్టాండ్ ఆవరణలో ప్రభుత్వంకు ధన్యవాదములు కార్యక్రమం చేపట్టడం జరిగింది. 💥ఈ సమావేశంలో గుత్తి త్యాగరాజు మాట్లాడుతూ గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలలో 34 శాతం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలలో 33.33% రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు, గౌరవ ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు గౌరవ శ్రీ నారా లోకేష్ గారు, బీసీ శాఖ మాత్యులు గౌరవ శ్రీమతి సవిత గారి నాయకత్వంలో తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తూ కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సామాజిక వర్గాల తరఫున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు, 💥బీసీలకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని, నారా చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానిని 34 శాతానికి పెంచుతూ మరొకసారిత్రాత్మక నిర్ణయం తీసుకుని బీసీలకు చట్టసభలలో ప్రాధాన్యత పెంచారు, కానీ మధ్యలో వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత సాంకేతిక కోర్టు తీర్పులు కారణంగా అమలు చేయలేకపోయినా రిజర్వేషన్ మరల ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ఆచరణలోకి తీసుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు తెలిపారు, 💥అలాగే ప్రకటించిన ఈ రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించి, సాంకేతిక ఇబ్బందులు, న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ప్రణాళిక చేసి అమల్లోకి వచ్చే విధంగా చేయాలని ప్రభుత్వానికి సూచించారు, 💥అలాగే రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో యువతకు తగిన ప్రాధాన్యతను ఇవ్వాలని, రోస్టర్ విధానాన్ని కొనసాగించాలని చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లేని బిసి సామాజిక వర్గాలకు స్థానిక సంస్థల్లో ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు, అలాగే అంచెలంచలుగా బీసీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్న కూటమి ప్రభుత్వం బీసీ రక్షణ చట్టాన్ని కూడా త్వరలో అమలు చేయాలని కోరారు, 💥ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు సి జానకిరామ్,లక్ష్మయ్య ధనుంజయశెట్టి, కల్లూరు మల్లికార్జున, ఆర్ కే శ్రీను,పసుపులేటి విజయ్ కుమార్, నాయిబ్రాహ్మణ శ్రీను,గోదారి ప్రకాష్, మాచర్ల లోహిత్,


