Sunday, 16 August 2026
  • Home  
  • పోలింగ్ బూత్ స్థాయిలో ఓబీసీ మోర్చాను బలోపేతం చేయాలి: బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు.
- ఖమ్మం

పోలింగ్ బూత్ స్థాయిలో ఓబీసీ మోర్చాను బలోపేతం చేయాలి: బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు.

ఖమ్మం జిల్లా ఓబీసీ మోర్చా నూతన అధ్యక్షులు రేఖ సత్యనారాయణ యాదవ్ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రేఖ సత్యనారాయణ యాదవ్‌తో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ పార్టీకి మోర్చాలే బలమని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు రేఖ సత్యనారాయణ యాదవ్ మాట్లాడుతూ పోలింగ్ బూత్ స్థాయి నుంచి ఓబీసీ మోర్చాను మరింత పటిష్టంగా నిర్మించాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రాజు, పొన్నం ఉపేందర్, పల్లపు వెంకన్న, ప్రధాన కార్యదర్శులు పిల్లలమర్రి వెంకట్, గంధసిరి వీరభద్రం గౌడ్, ఎల్. వెంకన్న, వేల్పుల సుధాకర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు దొంతు జ్వాల నరసింహరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల నాగేంద్ర, మండడపు సుబ్బారావు, పుల్లయ్య చౌదరి, రవి గౌడ్, మాధవ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.