గుంటూరు: ఆస్పత్రి నుంచి తండ్రిని తీసుకుని ఇంటికి వస్తుండగా కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో వృద్ధుడు సజీవ దహనమైన విషాద ఘటన గుంటూరు నగరంలో చోటుచేసుకుంది. ఐపీడీ కాలనీకి చెందిన అఖిలేష్ తన తండ్రి హరికృష్ణను ఆస్పత్రికి తీసుకెళ్లి కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. మంటలు వేగంగా వ్యాపించడంతో అఖిలేష్ కారు అద్దాలు పగలగొట్టి బయటకు వచ్చినట్లు సమాచారం. అయితే వెనుక సీట్లో ఉన్న హరికృష్ణ బయటకు రాలేక మంటల్లో చిక్కుకుని మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి, షార్ట్‌సర్క్యూట్ లేదా సాంకేతిక లోపం కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

కారు దగ్ధం.. వెనుక సీట్లో చిక్కుకుని వృద్ధుడు మృతి